లాంచ్‍కు సిద్దమవుతున్న టాటా నెక్సాన్ ఐసీఎన్‌జీ వెర్షన్ ఇదే!.. వివరాలు

భారతీయ మార్కెట్లో అతి తక్కువ కాలంలో అత్యధిక ప్రజాదరణ పొందిన టాటా మోటార్స్ యొక్క నెక్సాన్.. ఇప్పటికి కూడా మంచి సంఖ్యలో అమ్ముడవుతూ ఉంది. కంపెనీ ఈ కారును ప్రస్తుతం పెట్రోల్, ఎలక్ట్రిక్ రూపంలో విక్రయిస్తోంది. కాగా త్వరలోనే ఐసీఎన్‌జీ రూపంలో లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. కంపెనీ లాంచ్ చేయనున్న ఈ కొత్త టాటా నెక్సాన్ ఐసీఎన్‌జీ కారు డిజైన్ ఎలా ఉంది, ఫీచర్స్ ఏంటి? మైలేజ్ వివరాలు మరియు అంచనా ధర వంటి వాటికి సంబంధించిన మరిన్ని వివరాలు వివరంగా ఈ కథనంలో తెలుసుకుందాం..

త్వరలో విడుదలకానున్న కొత్త టాటా నెక్సామ్ ఐసీఎన్‌జీ మోడల్ 1.2 లీటర్ టర్బోఛార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది పెట్రోల్ వెర్షన్‌లో 118 Bhp పవర్ మరియు 170 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. అయితే ఐసీఎన్‌జీ వెర్షన్‌ యొక్క ఓవర్ మరియు టార్క్ అనేది కొంత తక్కువగా ఉండే అవకాశం ఉంది. అయితే మైలేజ్ ఎక్కువగా ఉంటుందని తెలుస్తోంది.

Tata Nexon iCNG

సాధారణంగా CNG కార్లలో బూట్ స్పేస్ అనేది ఫ్యూయెల్ కార్ల కంటే కొంత తక్కువగా ఉంటుంది. అయితే బూట్ స్పేస్ సాధారణ కార్లలో ఉండే విధంగా అందించేలానే ఉద్దేశ్యంతో కంపెనీ ఇప్పుడు తన నెక్సాన్ ఐసీఎన్‌జీ వెర్షన్‌లో ఒక పెద్ద సిలిండర్‌కు రెండు చిన్న సిలిండర్లను పొందుపరచనుంది. కాబట్టి బూట్ స్పేస్ 240 లీటర్ల వరకు ఉంటుంది. ఇది వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

టాటా కార్లు అంటేనే మొదట గుర్తోచ్చేది.. సేఫ్టీ ఫీచర్స్. ఇప్పటికే టాటా నెక్సాన్ ఈవీ క్రాష్ టెస్టులో 5-స్టార్ రేటింగ్ సాధించి సురక్షితమైన కార్ల జాబితాలో ఒకటిగా నిలిచింది. కాబట్టి స్టాండర్డ్ మోడల్స్ మాదిరిగానే రాబోయే నెక్సాన్ ఐసీఎన్‌జీ మోడల్ కూడా ఆధునిక సేఫ్టీ ఫీచర్స్ పొందనున్నట్లు సమాచారం. నెక్సాన్ ఐసీఎన్‌జీ కారులో హీట్ డిఫ్లెక్టర్, CNG లీకేజ్ డిటెక్షన్ సిస్టమ్, గ్యాస్ లీక్‌ల కోసం సేఫ్టీ వాల్వ్ ఉండనుంది.

Tata Nexon iCNG Cylinder

ఇక ప్రధానంగా చెప్పుకోదగ్గ విషయం మైలేజ్. విడుదలకు సిద్దమవుతున్న టాటా నెక్సాన్ ఐసీఎన్‌జీ మోడల్ మంచి మైలేజ్ అందిస్తుందని తెలుస్తోంది. ఇది 25 కిమీ/కేజీ మైలేజ్ అందిస్తుందని సమాచారం. కానీ దీన్ని ఏఆర్ఏఐ ధ్రువీకరించలేదు. అయితే ఈ కారు పెట్రోల్ కారు మైలేజ్ కంటే ఎక్కువ ఉంటుందని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. మైలేజ్ వివరాలు కూడా అధికారికంగా తెలియాల్సి ఉంది.

త్వరలో లాంచ్ కానున్న కొత్త టాటా నెక్సాన్ ఐసిఎన్‌జి కారు ఆధునిక అప్డేట్స్ పొందనున్నట్లు సమాచారం. కాబట్టి ధర స్టాండర్డ్ పెట్రోల్ కారు కంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. దీని ధర సాధరణ మోడల్ కంటే రూ. లక్ష నుంచి రూ.1.5 లక్షలు ఎక్కువ ఉండవచ్చని తెలుస్తోంది. అయితే ఈ కారు ధరలను కంపెనీ లాంచ్ సమయంలో అధికారికంగా వెల్లడించనుంది. లాంచ్‍కు సంబంధించిన వివరాలు కూడా తెలియాల్సి ఉంది.

Tata Nexon iCNG Rear View

టాటా నెక్సాన్ ఐసీఎన్‌జీ కారు చూడటానికి దాదాపు పెట్రోల్ మోడల్ మాదిరిగానే ఉంటుంది. అయితే అక్కడక్కగా ఐసీఎన్‌జీ బ్యాడ్జ్ కనిపిస్తుంది. దీన్ని బట్టి టాటా నెక్సాన్ ఐసీఎన్‌జీ మోడల్ కారును గుర్తించవచ్చు. ఫ్రంట్, రియర్ మరియు సైడ్ ప్రొఫైల్ మొత్తం స్టాండర్డ్ మోడల్ మాదిరిగా ఉంటుందని తెలుస్తోంది. ఇందులో వాహన వినియోగదారులకు అవసరమైన ఆధునిక ఫీచర్స్ ఉండనున్నాయి. వీటికి సంబంధించిన వివరాలు త్వరలోనే వెల్లడవుతాయి.

ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.

More from DriveSpark

Article Published On: Friday, June 21, 2024, 11:31 [IST]
English summary
Upcoming tata nexon icng launch soon in india
Read more on: #tata motors #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+