పొట్టి ఫార్చ్యూనర్‌ వచ్చేస్తుంది.. మిడిల్‌ క్లాస్‌ ఫ్యామిలీలకు మంచి లగ్జరీ కారు దొరికినట్టే!

భారతీయ మార్కెట్‌లో టయోటా కార్లకు డిమాండ్‌ ఎక్కువ. ఈ కంపెనీ నుంచి అందుబాటులో ఉన్న ఇన్నోవా, ఫార్చ్యూనర్‌, అర్బన్ క్రూయిజర్‌ వంటివి మంచి ఫేమ్‌ని కలిగి ఉన్నాయి. భారత్‌లో రాజకీయ నాయకులు, ఇతర ప్రముఖులు, వ్యాపారవేత్తలు ఈ కార్లను ఎక్కువగా వినియోగిస్తూ ఉంటారు. అందువల్ల ఇన్నోవా కార్లు మంచి పాపులారిటీని సాధించాయి. ఈ సంస్థకు చెందిన కార్లు మంచి కంఫర్ట్‌తో భారీ ఇంటీరియర్‌ స్పేస్‌, టాప్ క్లాస్‌ ఫీచర్లు, పెద్ద డిజైన్‌, సేఫ్టీతో వస్తాయి. అందువల్ల ప్రముఖులు వీటిని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తుంటారు. ఇదే సమయంలో ఈ కార్ల రేట్లు సైతం ఆకాశంలో ఉంటాయి. అయితే మాస్‌ మార్కెట్‌ని టార్గెట్‌ చేస్తూ కొత్త మినీ ఫార్చ్యూనర్‌ ఎస్‌యూవీని టయోటా తీసుకురాబోతుంది. ఆ వివరాలు ఈ కథనంలో..

త్వరలో రాబోయే కొత్త టయోటా ఫార్చ్యూనర్‌ 2.4 లీటర్ నాలుగు సిలిండర్స్‌ 2జీడీ-FTV డీజిల్ ఇంజిన్‌తో రానుంది. ఇక ఫీచర్ల పరంగా ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌లైట్స్‌, LED DRLs, బీస్పోక్‌ 16 అంగుళాల అల్లాయ్ వీల్స్‌తో రానుంది. దీనిని పూర్తి స్థాయిలో అందరికీ అందుబాటులో ఉండేలా ఓ ప్యాసింజర్-ఫోకస్డ్ వెహికల్‌గా తీసుకువచ్చే అవకాశం ఉంది. ఇది మెరుగైన క్యాబిన్ స్పేస్‌ ఉండనుంది.

Upcoming Toyota Mini Fortuner SUV

మరింత పాలిష్ చేయబడిన బాడీ లైన్ల కోసం పొడవైన పైకప్పుతో పాటు రీడిజైన్ చేయబడిన వెనుక బాడీని కలిగి ఉంది. ఇది థాయిలాండ్‌, ఇండోనేషియాలో అందుబాటులో ఉన్న హిలక్స్ రంగ్గా ఎస్‌యూవీ కాన్సెప్ట్ వలె సమానమైన ఫీచర్లను కలిగి ఉండనుంది. ఇందులోనూ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లేతో కూడిన 7 ఇంచెస్‌ టచ్‌స్క్రీన్‌ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, డ్యూయల్ జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటివి ఉండనున్నాయి.

వీటితో పాటు నాలుగు పవర్ విండోస్, సెన్సార్స్‌తో కూడిన రివర్స్ పార్కింగ్ కెమెరా, డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్స్‌, యాంటీ లాక్ బ్రేకింగ్‌ సిస్టమ్‌ వంటి ఫీచర్లు ఉండనున్నాయి. ఈ కారు సుమారు 4.5 మీటర్ల పొడవుతో వస్తుంది. అలాగే పెద్ద ఫార్చ్యూనర్ వలె వీల్‌బేస్‌తో రానుంది. పైన చెప్పిన విధంగా ఈ ఎస్‌యూవీలో జీడీ సిరీస్ డీజిల్ ఇంజిన్‌ ఉండనుంది.

Fortuner FJ Cruiser

నెక్స్ట్‌ జనరేషన్‌ ఫార్చ్యూనర్‌లో ప్రవేశపెట్టే పెట్రోల్‌లో రానుంది. ఈ కొత్త మినీ-ఫార్చ్యూనర్ / FJ క్రూయిజర్‌ని జపనీస్ టాప్‌ IMV ప్లాట్‌ఫామ్‌ ఆధారంగా తయారు చేయనన్నారు. ఈ ప్లాట్‌ఫామ్‌ని హీలక్స్, ఫార్చ్యూనర్, ఇన్నోవా వంటి మోడళ్లలో వనియోగించారు. ఫర్ఫామెన్స్‌ పరంగా ఇది అదరగొట్టనుంది. డిజైన్, ఫీచర్లు, ఇతర స్పెసిఫికేషన్స్‌తో ఓవరాల్‌గా ఓ ఆల్‌రౌండర్‌ ఎస్‌యూవీగా మార్కెట్‌లోకి అడుగుపెట్టనుంది.

తెలిపిన అన్ని భారీ ఫీచర్లతో వస్తున్నా కానీ ధర పరంగా అందరికీ అందుబాటులోనే ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం మాస్‌ మార్కెట్‌లో ఎక్కువగా అమ్ముడవుతున్న ప్రైజ్ రేంజ్‌లోనే దీని ధర ఉండనుంది. అందువల్ల నేరుగా పోటీని ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇది మాస్ మార్కెట్‌ని ఆకట్టుకోవాలంటే ధర ప్రకటన వరకు వెయిట్‌చేయాల్సిందే. అయితే ఇది పూర్తి స్థాయిలో భారత్‌లోకి వచ్చే సరికి ఇంకా సంవత్సరం పట్టే అవకాశం ఉంది.

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Sunday, December 8, 2024, 7:20 [IST]
English summary
Upcoming toyota mini fortuner budget friendly suv with high performance
Read more on: #toyota #upcoming cars #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+