దేశంలోనే అందరి ఫేవరెట్ కారు తిరిగి వచ్చేసింది.. ఈ సారి దుమ్ములేచిపొద్ది.. అన్ని ఫీచర్లు సూపరో సూపర్

ప్రముఖ కంపెనీ హ్యుందాయ్(hyundai) ఇండియాలో తన మార్కెట్‌ను పెంచుకోడానికి ఎప్పటికప్పుడు కొత్త మోడళ్లను విడుదల చేస్తుండటంతో పాటు తన పాత మోడళ్లను కూడా లేటెస్ట్ ట్రెండ్‌కు అనుగుణంగా కొత్తగా అప్‌డేట్ చేసి మార్కెట్లోకి తిరిగి తీసుకొస్తుంది. కంపెనీ ఇటీవల తన కీలకమైన వెర్నా(Verna) మోడల్‌ను అప్‌డేట్ చేసి అమ్మకానికి తెచ్చింది. పాత దానితో పోలిస్తే ఈ కారులో అన్ని అధునాతన ఫీచర్లను అందించారు. కొత్త వెర్నా వినియోగదారులను మరింత ఆకట్టుకుంటుందని కంపెనీ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. సాధారణంగా హ్యుందాయ్ వెర్నాకు ఇండియన్ మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉంటుంది. అలాంటిది కంపెనీ తన ఫెవరేట్‌ మోడల్‌ను తిరిగి లాంచ్ చేసి మరోసారి మార్కెట్లో తన వెర్నా కారు సత్తాను నిరూపించుకోవాలని చూస్తుంది.

కొత్త హ్యుందాయ్ వెర్నా మిడ్-సైజ్ సెడాన్ మోడల్‌గా అందుబాటులో ఉంటుంది. ఈ కొత్త కారులో ప్రయాణీకులకు మంచి సేఫ్టీ లభిస్తుంది. ఎందుకంటే గ్లోబల్ ఎన్‌సీఎపీ క్రాష్ టెస్ట్‌లో ఈ కారు 5 స్టార్‌ రేటింగ్‌ని సాధించింది. దీంతో ఈ వెర్నాలో ప్రయాణించే వారికి ప్రమాద సమయాల్లో మంచి సేఫ్టీ లభించే అవకాశం ఉంటుంది.

Updated Hyundai Verna

వెర్నా డిజైన్ పూర్తిగా అప్‌డేట్ అయింది. చూడటానికి స్పోర్టీ ప్రొఫైల్‌ లుక్‌ను కలిగి ఉంది. ప్రారంభ ధర రూ. 11 లక్షల నుండి అమ్మకానికి అందుబాటులో ఉంది. అలాగే, దీని గరిష్ట ధర రూ. 17.47 లక్షలు. ఇవన్నీ ఎక్స్-షోరూమ్ ధరలు. అప్‌డేట్‌ల తరువాత అన్ని వెర్నా వేరియంట్‌‌ల ధరలు పెరిగాయి. ఈ కొత్త వెర్నా సరికొత్త కలర్‌లో లభిస్తుంది.

హ్యుందాయ్ వెర్నా రెండు వేరు వేరు ఇంజిన్ ఆప్షన్స్‌తో మొత్తం ఆరు వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఇవి వెర్నా EX, S, SX, SX DT, SX O,SX (O) DT వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది. ఇవన్ని అప్‌డేటెడ్ ఫీచర్లతో వచ్చాయి.

Updated Hyundai Verna New Features

అలాగే, ఈ కొత్త మోడల్ 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్, 1.5 లీటర్ టర్బో పెట్రోల్ మోటార్ ఆప్షన్స్‌తో లభిస్తుంది. మొదటి ఇంజిన్ 114 bhp పవర్, 144 nm గరిష్ట టార్క్‌ను , రెండోది 158 bhp పవర్, 260 nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

అలాగే, 1.5 లీటర్ CRDI డీజిల్ ఇంజిన్ ఆప్షన్‌తో కూడా అందుబాటులో ఉంటుంది. వెర్నా మాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికలతో లభిస్తుంది. కారు లోపల ఫీచర్లలో అన్ని లేటెస్ట్‌వి ఉన్నాయి. ప్రస్తుతం కస్టమర్ల నుంచి డిమాండ్ ఉన్న వాటినే ఈ కారు క్యాబిన్‌లో అందించారు. లోపల 10.25 టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో వంటివి ఉన్నాయి.

Updated Hyundai Verna Launched With New Features

ఇవి కాకుండా పూర్తిగా డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వెంటిలేటెడ్, హీటెడ్ సీట్లు, 8-స్పీకర్ బోస్ సౌండ్ సిస్టం, 64-కలర్ యాంబియంట్ లైటింగ్, సన్‌రూఫ్, ఎయిర్ ప్యూరిఫైయర్, భద్రత పరంగా, అన్ని ట్రిమ్‌లలో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, 3-పాయింట్ సీట్‌బెల్ట్‌లు, ESC, వీఎస్‌ఎమ్, హెచ్‌ఎసీ, ఐసోఫిక్స్‌తో సహా 33 భద్రతా ఫీచర్లు ఉన్నాయి. వెర్నా టాప్-స్పెక్ ట్రిమ్ లెవల్ 2 అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS)ని కూడా కలిగి ఉంది.

హ్యుందాయ్ కొత్త వెర్నా, హోండా సిటీ, వోక్స్‌వ్యాగన్ వర్టస్, స్కోడా స్లావియా వంటి వాటికి ప్రత్యర్థిగా ఇండియాలో అత్యధికంగా అమ్ముడవుతున్న మిడ్-సైజ్ సెడాన్‌లలో ఒకటిగా ఉంది. పాత మోడల్ కంటే ఇప్పుడు విడుదల అయిన కొత్త వెర్నా మరిన్ని అదనపు హంగులతో వచ్చింది. మార్కెట్లో వివిధ ఆటోమొబైల్ తయారీ కంపెనీల మధ్య విపరీతమైన పోటీ ఉన్న తరుణంలో ఈ కొత్త వెర్నాను కంపెనీ తన బ్రహ్మాస్త్రంగా వాడుకోనుంది.

More from DriveSpark

Article Published On: Tuesday, November 5, 2024, 8:30 [IST]
English summary
Updated hyundai verna launched with new features all top things details
Read more on: #hyundai #new launches #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+