Used Cars సెకండ్‌ హ్యాండ్‌ కార్లు కొనేవారికి చేదువార్త.. ఎందుకంటే?

కారు, ఇళ్లు కలిగి ఉండటం అనేది చాలా మందికి ఒక కలగా ఉంటుంది. కానీ మిడిల్‌ క్లాస్‌ ఫ్యామిలీలు కొత్త కారుని కొనుగోలు చేయడానికి ఇబ్బందిగా భావిస్తుంటారు. దీంతో ఖర్చులు తగ్గించుకునేందుకు 2nd హ్యాండ్‌ కార్ల కోసం వెతుకుతుంటారు. మంచి కారు దొరికిన వెంటనే దానిని కొనుగోలు చేస్తారు. అయితే కొన్ని సందర్భాల్లో మంచి కార్లు లభిస్తున్నప్పటికీ చాలా మందికి వీటి వల్ల రిపేరు ఖర్చులను ఎదుర్కోవాల్సిన పరిస్థితులు నెలకొంటాయి. అయితే కొత్త కారు కొనడం ద్వారా రోడ్డు టాక్స్‌, ఇన్సూరెన్స్‌ వంటివి అదనపు ఖర్చులుగా ఉంటాయి. దీంతో ఎక్స్‌షోరూమ్‌ ధరతో పోల్చితే కొత్త వాటికి అదనంగా 30 నుంచి 35 శాతం వరకు డబ్బు జమ అవుతుంది.

అందువల్ల చాలా మంది 2nd హ్యాండ్‌ కార్లను మాత్రమే కొంటూ ఉంటారు. అయితే తాజాగా సెంట్రల్‌ ఫైనాన్స్ మినిస్టర్‌ నిర్మలా సీతారామన్ నేతృత్వంలోని GST కౌన్సిల్ సెకండ్‌ హ్యండ్‌ కార్లపై పన్ను రేటును 12% నుంచి 18% కు పెంచాలని నిర్ణయం తీసుకుంది. దీంతో ఈ 2nd హ్యాండ్‌ మార్కెట్‌లో కార్ల ధరలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇది కస్టమర్లతో పాటు డీలర్లపై తీవ్ర ప్రభావం చూపుతుంది.

Used Cars Tax Increased by GST Council

ఈ పన్ను పెంపు 1200 CC వరకు ఇంజిన్ సామర్థ్యం ఉన్న కార్లకు మాత్రమే వర్తిస్తుంది. 55వ GST కౌన్సిల్ సమావేశం తర్వాత, సీతారామన్ ఈ టాక్స్‌ పెంపుని ప్రకటించారు. ఇది ప్రధానంగా డీలర్ లావాదేవీలను మాత్రమే ప్రభావితం చేస్తుందని.. వ్యక్తుల నుంచి నేరుగా మరొకరికి వాహనాలను అమ్మడం ద్వారా కాదని పేర్కొన్నారు. ఇటీవలె 2nd హ్యాండ్ మార్కెట్‌ గణనీయమైన వృద్ధిని చవి చూచింది. దీంతో టాక్సుల్లో మార్పులు జరిగాయి.

తాజా డేటా ప్రకారం 2023-24లో సుమారు 50 లక్షల కార్లు అమ్ముడయ్యాయని నివేదికలు సూచిస్తున్నాయి. మారుతి సుజుకి, మహీంద్రా & మహీంద్రా వంటి ప్రధాన కారు తయారీదారులు, స్పిన్నీ, కార్స్24 వంటి ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్‌ కీలక పాత్ర పోషించాయి. వ్యక్తిగత అమ్మకాలు మినహాయించి డీలర్‌షిప్‌ల నుంచి ప్రీ-ఓన్డ్ వాహనాలను కొనుగోలు చేసే వినియోగదారులకు 6% పన్ను పెంపు ఉంటుంది.

Used Car Taxes

ఇంతకు ముందు, 1200 CC కంటే తక్కువ ఉన్న కార్లపై 12% పన్ను మాత్రమే ఉండేది. ఇప్పుడు, ఇంజిన్ సామర్థ్యం 1200 CC మించిపోయిన వాహనాలతో పాటు, ఈవీలు, పెట్రోల్ ఇంజిన్‌ 4000 mm కంటే ఎక్కువ పొడవు ఉన్నవి, డీజిల్ వాహనాలు 1500 CC దాటిన వాటిపై అలాగే 4000 mm కంటే ఎక్కువ పొడవు ఉన్న ఎస్‌యూవీలపై కూడా ఈ 18% GST ఛార్జ్‌ వసూలు చేయనున్నారు.

GST కౌన్సిల్, GST సరఫరాదారుల ద్వారా జరిగే లావాదేవీలపై మాత్రమే ఇది వర్తిస్తుందని స్పష్టం చేశారు. దీని వల్ల ఈ నిర్ణయం డీలర్లకు కాస్త చేదువార్తే అని చెప్పాలి. ఈ పన్ను పెంపు వల్ల వినియోగ దారులకు సైతం కొన్ని సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. కొన్నింటికీ కళ్లెం వేసే క్రమంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల ఈ మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపెట్టే అవకాశం ఉంది.

Second Hand Cars

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Sunday, December 22, 2024, 18:24 [IST]
English summary
Used car taxes increased by gst council check details here
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+