కార్లలో ఈ ఫీచర్లు ఉంటే ఇక యాక్సిడెంట్లే జరగవు.. CAEV ఎక్స్‌పో 2024లో VinAI కొత్త ఉత్పత్తులు ఇవే.!!

రేపటి నుంచి(మార్చి 14-15, 2024) తేదీల్లో బెంగళూరులో జరిగే ప్రతిష్టాత్మక CAEV ఎక్స్‌పోలో VinAI పాల్గొననుంది. ఆటోమోటివ్ రంగంలో స్మార్ట్‌ మొబిలిటీ దిశగా అధునాతన AI సొల్యూషన్‌ల అభివృద్ధిలో VinAI కృషి చేస్తోంది. మా అంతర్జాతీయ మీడియా OneArabia నివేదిక ప్రకారం CAEV ఎక్స్‌పో 2024లో, VinAI ఆవిష్కరించిన రెండు సరికొత్త ఇంటీరియర్‌ ఫీచర్లను ప్రదర్శించనుంది.

కర్ణాటక ట్రేడ్ ప్రమోషన్ సెంటర్‌లోని బూత్ నంబర్ HB 102-103 వద్ద VinAI బూత్‌ను ఏర్పాటు చేశారు. సందర్శకులు.. VinAI ఆవిష్కరించిన ఈ టెక్నాలజీ ఎక్విప్‌మెంట్స్‌, వాటి పనితీరును ప్రత్యక్షంగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. అంతే కాకుండా స్మార్ట్‌ మొబిలిటీ రంగంలో VinAI ఆవిష్కరించిన ఇంటీరియర్‌సెన్స్‌(Interior Sense And Surround Science) అందించే ప్రయోజనాలను తెలుసుకోవచ్చు.

VinAI-CAEV-Expo-2024

VinAI InterorSense: ఇక మొదటగా VinAI పరిచయం చేసిన ఇంటీరియర్‌సెన్స్(InteriorSense).. కారులో డ్రైవర్ మరియు ఆక్యుపెంట్స్ మానిటరింగ్ సిస్టమ్ (DOMS), మిర్రర్‌సెన్స్ మరియు డ్రంక్‌సెన్స్‌లను కలిగి ఉన్న అధునాతన ఇన్-క్యాబిన్ సొల్యూషన్‌ల సూట్ ఇది. రియల్‌ టైమ్‌లో డ్రైవర్ ప్రవర్తనను DOMS విశ్లేషిస్తుంది. డ్రైవర్‌ మగత, అలసట మరియు పరధ్యానాన్ని ఇది పర్యవేక్షిస్తుంది. తద్వారా డ్రైవర్ మరియు ప్రయాణీకుల భద్రతను నిర్ధారించడానికి ఇంటీరియర్‌ సెన్స్‌.. సకాలంలో హెచ్చరికలను జారీ చేస్తుంది.

AI టెక్నాలజీని ఉపయోగించుకోవడం ద్వారా, MirrorSense ఇప్పటికే ఉన్న కారులో కెమెరా సిస్టమ్‌లతో ఈజీగా కనెక్ట్‌ చేసుకోవచ్చు. తద్వారా ఇది హార్డ్‌వేర్ అప్‌గ్రేడ్‌ల అవసరాన్ని తొలగిస్తుంది. దీంతో కస్టమర్లకు అనవసర ఖర్చు కూడా తగ్గుతుంది. VinAI అభివృద్ధి చేసిన ఈ ప్రపంచ-మొదటి ఆటోమేటిక్ మిర్రర్ అడ్జస్ట్‌మెంట్ ఫీచర్‌ ద్వారా ఇంకా చాలా ప్రయోజనాలు ఉన్నాయి.

VinAI-CAEV-Expo-2024

కారు డ్రైవర్ మరియు ఆక్యుపెంట్ మానిటరింగ్ సిస్టమ్ (DOMS) యొక్క కెమెరాను ఉపయోగించి డ్రైవర్ హెడ్ పొజిషన్ మరియు చూపుల ఆధారంగా 10mm వరకు ఖచ్చితత్వంతో అద్దాలను అడ్జస్టబుల్‌ చేస్తూ సరైన పొజిషన్‌లో ఉంచుకుంది. ఈ వినూత్న టెక్నాలజీనే VinAIకి CES 2024 ఇన్నోవేషన్ అవార్డును తీసుకువచ్చింది.

ఇక డ్రంక్‌సెన్స్, VinAI అభివృద్ధి చేస్తున్న కొత్త AI-శక్తితో కూడిన ఫీచర్ ఇది. డ్రైవర్ మత్తును ఆటోమేటిక్‌గా గుర్తించడానికి ఎలక్ట్రానిక్ సెన్సార్‌లు దోహదపడతాయి. అంతేకాకుండా డ్రైవర్ ప్రవర్తనను మానిటర్‌ చేస్తుంది. ఈ టెక్నాలజీ ద్వారా రోడ్డు భద్రత మెరుగుపడుతుంది. చాలా వరకు ప్రమాదాలను నివారించవచ్చు.

VinAI SurroundSense: ఇక VinAI మరో కొత్త ఫీచర్‌.. సరౌండ్‌సెన్స్(SurroundSense) డ్రైవింగ్ సేఫ్టీ మరియు ప్రయాణికుల సౌకర్యాన్ని మెరుగుపరచడానికి ఇందులో చాలా ఫీచర్లను కలిగి ఉంది. ఇందులో 360-డిగ్రీల విశాలమైన విజిబిలిటీ కోసం అధునాతన సరౌండ్ వ్యూ మానిటరింగ్ (ASVM), బ్లైండ్ స్పాట్‌లను తొలగించడం మరియు పరిస్థితులపై అవగాహన పెంచడం వంటి ఫీచర్లను కలిగి ఉంది.

వీటితో పాటు మెరుగైన, ఆహ్లాదకరమైన డ్రైవింగ్ అనుభవం కోసం జెల్లీ వ్యూ, హోమ్‌జోన్ పార్కింగ్ మరియు టచ్2పార్క్ ఫీచర్‌లను అందిస్తుంది. సాంప్రదాయ కెమెరాల మాదిరిగా కాకుండా, జెల్లీ వ్యూ పారదర్శకమైన కారు వ్యూను అందించడమే కాకుండా.. డ్రైవర్‌లు తమ చుట్టూ ఉన్న ప్రతి వస్తువును చూసేందుకు ఈ కెమెరా దోహదపడుతుంది. వాహనం కింద కూడా మీరు చూడవచ్చు.

జెల్లీ వ్యూ క్లిష్టమైన యాంగిల్స్‌లో బ్లైండ్ స్పాట్‌లను తొలగిస్తూ.. ప్రయాణికుల భద్రత మరియు సామర్థ్యాన్ని పెంచుతుంది. ముఖ్యంగా టర్నింగ్‌లు, ఇరుకైన ప్రదేశాలు మరియు ఘర్షణలకు గురయ్యే ప్రాంతాల్లో ఈ ఫీచర్‌ మెరుగైన డ్రైవింగ్‌ అనుభవాన్ని అందిస్తుంది. ఇక హోమ్‌జోన్ పార్కింగ్.. ఆటోమేటిక్ పార్కింగ్ స్పేస్ ఫైండర్ అవసరాన్ని తొలగిస్తుంది. టచ్2పార్క్, ఆటో పార్కింగ్ ఫీచర్, అల్ట్రాసోనిక్ సెన్సార్‌ల అవసరాన్ని లేకుండా చేస్తుది. ట్రెండింగ్‌కు అనుగుణంగా పార్కింగ్‌ను సురక్షితంగా మారుస్తుంది.

ఇక VinAI విషయానికొస్తే.. ఆటోమోటివ్ పరిశ్రమలో స్మార్ట్ మొబిలిటీ సొల్యూషన్స్‌లో అగ్రగామి సంస్థగా ఉంది. వాహన పనితీరును మెరుగుపరచడానికి టెక్నాలజీ పరంగా దోహదపడుతుంది. అధునాతన AI సాంకేతికతను అందించడం ద్వారా, ప్రపంచవ్యాప్తంగా లక్షల కొద్దీ డ్రైవర్లకు భద్రత మరియు డ్రైవింగ్ అనుభవాలను VinAI పెంచింది.

VinAI అందిస్తున్న టెక్నాలజీ సపోర్ట్‌, ఫీచర్లు ఇప్పటికే విన్‌ఫాస్ట్ యొక్క VF e34, VF5 మరియు eBusతో పాటు యూరోపియన్ వాహన తయారీదారుల నుండి వివిధ ఎలక్ట్రిక్ కార్ మోడళ్లలో డ్రైవర్లకు సహాయం చేస్తుంది. ఈ ఈవెంట్‌లో VinAI నిపుణులతో పర్సనల్‌గా చర్చించాలి అనుకుంటే.. సంస్థ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

More from DriveSpark

Article Published On: Wednesday, March 13, 2024, 9:47 [IST]
English summary
Vinai will showcase smart mobility solutions interiorsense and surroundsense at caev expo 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+