ప్రపంచంలోనే ఈ పొట్టి కార్లు చాలా గట్టివీ.. భారత్‌లో రాకకు ముహూర్తం ఫిక్స్‌!

భారత్‌లో ఎలక్ట్రిక్‌ కార్ల వినియోగం పెరుగుతోంది. దీంతో ప్రపంచంలోని ఎలక్ట్రిక్‌ కార్ల తయారీ సంస్థలు భారతీయ మార్కెట్‌పై ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నాయి. భవిష్యత్తులో భారత్‌ అతిపెద్ద కార్ల తయారీ కేంద్రంగా అవతరించే అవకాశం ఉంది. చాలా వరకు విదేశీ బ్రాండ్లు ఇప్పటికే భారత్‌లో ఉత్పత్తి కేంద్రాలను ప్రారంభించాయి. ప్రపంచంలోని అతిపెద్ద ఈవీ బ్రాండ్లలో విన్‌ఫాస్ట్ (VinFast) ఒకటిగా ఉంది. వియత్నాంకు చెందిన ఈ బ్రాండ్ టెస్లా సహా కంపెనీలతో ఇదివరకే భాగస్వామిగా ఉంది. అయితే భారత్‌లో ఎలాన్ మస్క్ టెస్లా భారత్‌లో ఎంట్రీపై గందరగోళం నెలకొంటోంది. ఈ సమయంలో విన్‌ఫాస్ట్ భారత్‌లో కాలుమోపేందుకు సిద్ధమైంది.

భారత్‌లో పూర్తి స్థాయిలో విన్‌ఫాస్ట్ సేవలను విస్తరించేందుకు కోట్లాది రూపాయల పెట్టుబడితో తమిళనాడులో తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తోంది. దీనికి సంబంధించిన పనులు సైతం శరవేగంగా కొనసాగుతున్నాయి. అతి త్వరలో ఈ ప్లాంట్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. తద్వారా భారత్‌లో తొలి విన్‌ఫాస్ట్‌ ఉత్పత్తి భారతీయ రోడ్లపైకి వచ్చే అవకాశం ఉంది. తమిళనాడు ప్రభుత్వంతో ఒప్పందం ప్రకారం తూత్తుకుడిలో ఆటోమొబైల్ తయారీ కేంద్రాన్ని నెలకొల్పింది.

VinFast VF3 Price

ఈ ఏడాది జనవరిలో ఆ రాష్ట్ర ప్రభుత్వంతో విన్‌ఫాస్ట్‌ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఏటా 1.50 లక్షల యూనిట్లకు పైగా ఎలక్ట్రిక్ కార్లను ఉత్పత్తి చేసే సామర్థ్యంతో ఈ ప్లాంట్‌ని నిర్మాణం కొనసాగుతోంది. అయితే 2025 జనవరిలో జరిగే భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్ పోలో విన్‌ఫాస్ట్ ఉత్పత్తులను ఆ సంస్థ ప్రదర్శించనుంది. తద్వారా భారత్‌లో అడుగుపెట్టబోయే మోడళ్లపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది.

విన్‌ఫాస్ట్ వియత్నాంలో ఎలక్ట్రిక్ వాహనాలను మాత్రమే కాకుండా ICE వెహికిల్స్‌ని సైతం విక్రయిస్తోంది. అక్కడ 2024 అక్టోబర్‌లో 11,000 ఎలక్ట్రిక్ వాహనాలను విన్‌ఫాస్ట్‌ విక్రయించింది. అంతక్రితం ఏడాదితో పోలిస్తే ఇది 21 శాతం వార్షిక వృద్ధిని నమోదు చేసింది. ఈ క్యాలెండర్ ఇయర్‌లో మొత్తం 59,000 ఎలక్ట్రిక్ కార్లను విక్రయించింది. ఇందులో విన్‌ఫాస్ట్ VF 3, VF 5 కార్లు గత నెలలో మంచి అమ్మకాలను నమోదు చేశాయి.

VinFast EV Cars in India

VF 3 కార్లు 5000 యూనిట్లు, VF 5 5000 యూనిట్లు సేల్‌ అయ్యాయి. వియత్నాం మార్కెట్లో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్న విన్‌ఫాస్ట్ తన మార్కెట్‌ని ప్రపంచ వ్యాప్తంగా విస్తరించే పనిలో ఉంది. భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో ద్వారా భారత్‌లో వచ్చే ఉత్పత్తులపై క్లారిటీ రానుంది. విదేశాల నుంచి కార్లను దిగుమతి చేసుకునే సమయంలో టాక్స్‌లను కూడా తగ్గించేలా కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇది వరకే జూన్‌లో విన్ ఫాస్ట్ VF e34 మోడల్ భారతదేశంలో ట్రయల్ రన్‌ నిర్వహిస్తుండగా కెమెరాకు చిక్కింది. మహారాష్ట్రలోని పుణెలో టెస్ట్‌డ్రైవ్‌లో కారు కనిపించింది. అయితే తమిళనాడులో నిర్మిస్తున్న ఈవీ ప్లాంట్ నిర్మాణం పూర్తయ్యే వరకు వాహనాలను కంప్లీట్‌ బిల్డ్‌ యూనిట్‌ (CBU) కింద దిగుమతి చేయనున్నారు. టెస్లా కంటే ముందే మార్కెట్‌ని కైవసం చేసుకోవాలని విన్‌ఫాస్ట్ లక్ష్యంగా పెట్టుకుంది. ధర అనేది ఇంపార్టంట్ ఫ్యాక్టర్‌గా మారనుంది.

VinFast EV Spied in India

ఈ విన్‌ఫాస్ట్‌ కార్లు మార్కెట్‌లో పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావడం ద్వారా టాటా మోటార్స్, ఎంజీ మోటార్స్‌తో పాటు ఇతర కంపెనీలకు గట్టి దెబ్బ పడే అవకాశం ఉంది. ప్రస్తుతం దేశంలో తక్కువ ధరకే ఎలక్ట్రిక్‌ కార్లు అందుబాటులోకి వస్తున్నాయి. త్వరలోనే మారుతి సుజుకి, హ్యుందాయ్ కూడా ఎలక్ట్రిక్ కార్లను మార్కెట్లోకి ప్రవేశపెట్టనున్నాయి. ఇప్పటికే సుజుకి ఇ-విటారా, హ్యుందాయ్ క్రెటా ఈవీని ఆవిష్కరించాయి.

ఇక విన్‌ఫాస్ట్‌ కార్లు రూ. 10 లక్షల (ఎక్స్‌-షోరూమ్) ధరతో కొనుగోలుకి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇది కేవలం ఓ అంచనా మాత్రమే. ధర ఫ్యాక్టర్‌ని బట్టి ఈ బ్రాండ్‌ పాపులారిటీని సాధించే అవకాశం ఉంది. తక్కువ ధరలో మంచి రేంజ్‌, సరికొత్త ఫీచర్లతో ఈ కార్లు అందుబాటులోకి వస్తే విజయం విన్‌ఫాస్ట్‌ వెంటే ఉంటుందని ఆటోమోబైల్‌ విశ్లేషకులు భావిస్తున్నారు.

More from DriveSpark

Article Published On: Friday, November 15, 2024, 7:20 [IST]
English summary
Vinfast entering in indian market in very soon check details here
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+