5 స్టార్‌ సేఫ్టీ రేటింగ్‌ కార్లు, వోక్స్‌వ్యాగన్‌ టైగన్, వర్టస్‌లలో ఇకపై 6 ఎయిర్‌బ్యాగ్స్‌

వోక్స్ వ్యాగన్ ఇండియా టైగన్ మరియు వర్టస్ మోడళ్లలో అన్ని వేరియంట్లలో ఆరు ఎయిర్ బ్యాగులను అందించనున్నట్లు ప్రకటించింది. ఈ రెండూ కార్లు గ్లోబల్‌ ఎన్‌సీఏపీ సేఫ్టీలో 5-స్టార్‌ రేటింగ్‌ని కలిగి ఉంది. ఇండియా 2.0 ప్రొడక్ట్ పోర్ట్ ఫోలియోను వాహనాల్లో ఈ సేఫ్టీ ఫీచర్లను జోడించబోతున్నట్లు ఆ సంస్థ తెలిపింది. సబ్ కాంపాక్ట్ క్రాస్‌ఓవర్‌ విభాగంలోని టైగన్ ఎస్‌యూవీని సెప్టెంబర్ 2021లో ప్రవేశపెట్టింది. ఇక మిడ్ సైజ్ సెడాన్ వర్టస్ మార్చి 2022 లో వచ్చింది. ఈ రెండు కార్లు ఇకపై ఫుల్‌-సేఫ్టీ మోడ్‌లో అందుబాటులో ఉండనున్నాయి.

ఇండియా 2.0 ఫోర్ట్‌పోలియో లైనప్‌లలో ఆరు ఎయిర్ బ్యాగులను స్టాండర్డ్ అందిస్తున్నందుకు సంతోషంగా ఉందని వోక్స్‌వ్యాగన్‌ ప్యాసింజర్‌ కార్స్‌ ఇండియా బ్రాండ్‌ డైరెక్టర్‌ చెప్పారు. ప్రయాణికులకు మరింత భద్రతను కల్పించాలనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఇది భారత్‌లో సంస్థ నిబద్ధతపై మరియు మార్కెట్‌ని పెంచుకోవడానికి సహాయపడుతుందని ఆయన వెల్లడించారు.

Volkswagen-6-Airbags-Standard

టైగన్ మరియు వర్టస్ రెండు కార్లు 1 లక్షకు పైగా అమ్మకాల మైలురాయిని చేరుకున్నందుకు మేము సంతోషంగా ఉన్నామని ఆయన చెప్పారు. వోక్స్ వ్యాగన్ ఇండియా ఇటీవలే టైగన్ యొక్క రెండు కొత్త వేరియంట్లను విడుదల చేసింది. అందులో 1-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్‌తో కూడిన జీటీ లైన్ మరియు 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ ఆప్షన్ తో జీటీ ప్లస్ స్పోర్ట్ వేరియంట్లలో అందుబాటులో ఉన్నాయి.

టైగన్ మరియు వర్టస్ రెండూ వారి అద్భుతమైన సేఫ్టీ ఫీచర్లను కలిగి ఉంది. అడల్ట్స్‌తో పాటు పిల్లల సేఫ్టీని అందించడంలో ఈ కార్లు 5-స్టార్ రేటింగ్‌ని కలిగి ఉంది. ముఖ్యంగా వోక్స్ వ్యాగన్ అమ్మకాల్లో టైగన్ ప్రధాన పాత్ర పోషించింది. ఈ లైనప్‌ కంపెనీ సేల్స్లో దాదాపు 61% పైగా వాటాను కలిగి ఉంది. ఇంకా సేల్స్‌లో ఈ కారు దూసుకెళ్తుంది.

Volkswagen-6-Airbags-Standard

వర్టస్ ప్రీమియం మిడ్-సైజ్ సెడాన్‌గా కూడా ప్రజాదరణ పొందింది. ఈ కారులోని 40% మంది వినియోగదారులు అధిక-పనితీరు గల జీటీ వేరియంట్లను ఎంచుకున్నారు. ఈ ప్రాధాన్యత వినియోగదారుల దృష్టిలో భద్రతతో పాటు పనితీరు యొక్క ప్రాముఖ్యతను చాటుతుంది. ఈ సంస్థకు వస్తున్న డిమాండ్‌ ఆధారంగా వోక్స్‌ వ్యాగన్‌ ఉత్పత్తి సామర్థ్యాన్ని కూడా పెంచింది.

సురక్షితమైన కార్లను తయారు చేసేందుకు ఈ సంస్థ నిరంతరం పనిచేస్తుంది. భారతదేశంలో వోక్స్ వ్యాగన్ యొక్క నెట్ వర్క్ బలం రోజు రోజుకు పెరుగుతుంది. 208 సేల్స్‌ మరియు ప్రీ-ఓన్డ్ కార్ టచ్ పాయింట్లను కలిగి ఉంది. వీటితో పాటు దేశంలోని 155 నగరాల్లో విస్తరించిన 142 సర్వీస్ టచ్ పాయింట్‌లు ఉన్నాయి. తన వినియోగదారులకు టోటల్ కాస్ట్ ఆఫ్ ఓనర్షిప్ మరియు పారదర్శక సేవాలను అందించడానికి బ్రాండ్ దృష్టి సారించింది.

వోక్స్ వ్యాగన్ ఇండియా తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నప్పుడు, సృజనాత్మకత, డిజైన్, పనితీరు మరియు అన్నింటికీ మించి భద్రతకు ప్రాధాన్యత ఇస్తుంది. టైగన్ మరియు వర్టస్ వేరియంట్లలో 6 ఎయిర్ బ్యాగుల ప్రామాణీకరణ సురక్షితమైన మరియు ప్రీమియం మొబిలిటీ పరిష్కారాలను అందించడంలో బ్రాండ్ యొక్క నిబద్ధతను చాటి చెబుతుంది. భారతీయ ఆటోమోటివ్ పరిశ్రమలో కొత్త బెంచ్ మార్క్ లను ఈ సంస్థ ఏర్పాటు చేస్తుంది.

డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Tuesday, June 4, 2024, 13:31 [IST]
English summary
Volkswagen india upgrades safety features in taigun and virtus models with 6 airbags
Read more on: #volkswagen #cars #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+