వోక్స్‌వ్యాగన్ నుంచి కొత్త ఎలక్ట్రిక్ కారు ID.4.. డిజైన్, ఫీచర్లను చూశారా.??
భారత్‌లో వోక్స్‌వ్యాగన్ కార్లకు ప్రత్యేక స్థానం ఉంది. లగ్జరీ ఫీచర్లతో నిండి ఉన్న ఈ కార్లపై జనాలకు క్రేజ్ చాలా ఉంది. జర్మనీకి చెందిన ఫోక్స్‌వ్యాగన్ వినూత్న ఫీచర్లతో కస్టమర్లను ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలో గురువారం రాజస్థాన్‌లోని జైపూర్‌లో జరిగిన కంపెనీ వార్షిక సదస్సులో ID.4 కొత్త ఎలక్ట్రిక్ కారును సంస్థ తొలిసారిగా ప్రదర్శించింది.
డిజైన్: గ్లోబల్ మార్కెట్‌లో ఇప్పటికే కొనుగోలుకు అందుబాటులో ఉన్న ఈ Volkswagen ID.4 ఎలక్ట్రిక్ కారు అధునాతన డిజైన్‌తో పాటు ఆకర్షణీయమైన ఫ్రంట్ గ్రిల్ మరియు హెడ్‌లైట్లను కలిగి ఉండటంతో పాటు ఆకట్టుకునేలా వెనుక డిజైన్‌ను కలిగి ఉంది. వేరియంట్‌లను బట్టి, 9 లేదా 20 అంగుళాల వీల్స్‌ను id.4 ఎలక్ట్రిక్ కారులో అమర్చారు.

ఫీచర్లు: వివిధ రకాల వేరియంట్లలో లభ్యమవుతున్న వోక్స్‌వ్యాగన్ ID.4 ఎలక్ట్రిక్ కారు డజన్ల కొద్దీ వినూత్న ఫీచర్లతో వస్తుంది. LED లైటింగ్, హీటెడ్ సీట్లు, 3-జోన్ క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ ఛార్జింగ్, సన్‌రూఫ్, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, నావిగేషన్ మరియు 12-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటి అధునాతన ఫీచర్లు ఉన్నాయి.
పవర్‌ట్రెయిన్: ఈ వోక్స్‌వ్యాగన్ id.4 కారును సింగిల్ మోటార్ మరియు డ్యూయల్ మోటార్ ఆప్షన్‌లలో కొనుగోలు చేయవచ్చు. సింగిల్ మోటార్‌తో చిన్న 58 kWh సామర్థ్యం గల బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. ఇది గరిష్ఠంగా 201 hp శక్తిని ఉత్పత్తి చేస్తుంది. పెద్ద 77 kWh బ్యాటరీ ప్యాక్‌తో ఉన్న డ్యూయల్ మోటార్ వేరియంట్ 330 hp శక్తిని ఉత్పత్తి చేస్తుంది.

వోక్స్‌వ్యాగన్ ID.4 ఎలక్ట్రిక్ కారులోని పెద్ద బ్యాటరీ - AWD (ఆల్ వీల్ డ్రైవ్) టెక్నాలజీ.. పూర్తి ఛార్జ్‌తో 410 కి.మీ మరియు RWD (రేర్ వీల్ డ్రైవ్) మోడల్ 442 కి.మీ రేంజ్‌ను అందిస్తుంది. ఇక చిన్న బ్యాటరీతో కూడిన సింగిల్ మోటార్ వేరియంట్.. పూర్తి ఛార్జ్‌పై 336 కిమీ రేంజ్‌ను ఇస్తుందని సంస్థ తెలిపింది.
వోక్స్‌వ్యాగన్ ఐడీ4 ఎలక్ట్రిక్ కారు కేవలం 5.8 సెకన్లలో 0 నుండి 100 kmph వేగాన్ని అందుకుంటుంది. దీని బ్యాటరీ ప్యాక్ DC ఫాస్ట్ ఛార్జర్ ఆప్షన్‌పై 10 నుండి 80 శాతం వరకు ఛార్జ్ చేయడానికి 36 నిమిషాలు తీసుకుంటుంది. దేశీయ మార్కెట్లో హ్యుందాయ్ ఐయోనిక్ 5, కియా EV6 మరియు వోల్వో ఎలక్ట్రిక్ కార్లకు వోక్స్‌వ్యాగన్ id.4కి గట్టి పోటీగా రానుంది.

భారత్‌లో వోక్స్‌వ్యాగన్ ఐడీ4 ఎలక్ట్రిక్ కారు రానున్న నెలల్లో భారత్‌లో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ ఎలక్ట్రిక్ కారు రూ.45 లక్షల ఎక్స్-షోరూమ్ ధరతో అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. ఈ ఈవెంట్‌లో కారు యొక్క టైగన్ జీటీ ప్లస్ స్పోర్ట్ మరియు జీటీ లైన్ వేరియంట్‌లను ఆవిష్కరించగా.. వీటిలో ఒకదానికొకటి మించిపోయే ఫీచర్లు ఉండటం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








