ప్రతీ రోజు 60 మంది ఇదే కారుని కొంటున్నారు.. సేఫ్టీలో 5 స్టార్, పవర్‌ఫుల్ ఇంజిన్!
దేశంలో ఫోక్స్‌వ్యాగన్ కార్ల అమ్మకాలు క్రమంగా పెరుగుతున్నాయి. ఒకప్పుడు కేవలం పదుల సంఖ్యకు మాత్రమే పరిమితం అయ్యే ఈ కార్లను నేడు జనాలు వందల సంఖ్యలో కొనుగోలు చేస్తున్నారు. భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో ప్రస్తుతం ఫోక్స్‌వ్యాగన్ కొత్త రికార్డులను నమోదు చేస్తుంది. ఈ సంస్థకు డిమాండ్ పెరగడానికి ప్రధాన కారణం ఫోక్స్‌వ్యాగన్ వర్టస్ (Volkswagen Virtus). భారతీయ మార్కెట్‌లో ఈ ఫోక్స్‌వ్యాగన్ వర్టస్ మంచి అమ్మకాలను రాబడుతోంది. ముఖ్యంగా క్రాష్‌టెస్ట్‌లో మంచి స్కోర్‌తో 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ని సాధించడంతో ఈ సెడాన్‌ని ప్రతిరోజూ సుమారు 60 మంది కొనుగోలు చేస్తున్నారు. దీని సేల్స్‌తో పాటు భారతీయ మార్కెట్‌లో ఈ సంస్థకు ఆదరణ పెరుగుతోంది. ముఖ్యంగా పండుగ సీజన్లో అమ్మకాలు భారీగా పెరిగాయి. ఆ వివరాలు మీకోసం..
ఫోక్స్‌వ్యాగన్ ఇండియా వెల్లడించిన అక్టోబర్ 2024 సేల్స్ రిపోర్ట్ ప్రకారం వర్టస్ సెడాన్ నెలవారీ అమ్మకాలలో కొత్త రికార్డుని నమోదు చేసింది. అక్టోబర్‌లో మొత్తం 2,351 వర్టస్ కార్లు అమ్ముడయ్యాయి. గత ఏడాది ఇదే సంవత్సరంతో పోలిస్తే ఇది 32 శాతం అధికం కావడం విశేషం. అంతేకాకుండా అక్టోబర్ 2023తో పోల్చితే అక్టోబర్ 2024 లో ఈ సంస్థ అమ్మకాలలో 9 శాతం వృద్ధి కూడా నమోదైంది.

ఈ సేల్స్ పెరగడం వల్ల భవిష్యత్తులో కంపెనీ అభివృద్ధికి దోహదపడనుంది. కంపెనీ లైనప్‌లో ముఖ్యంగా వర్టస్ మోడల్ కీలకంగా వ్యవహరిస్తోంది. ఈ సెడాన్ విడుదల నుంచి ఇప్పటి వరకు 50,000 యూనిట్లకు పైగా కంపెనీ విక్రయించింది. 2024 లోనే ఏకంగా 17,000 వర్టస్ యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇది కంపెనీ లైనప్‌లోనే అత్యంత వేగంగా సేల్స్ సాధించిన కారుగా నిలిచింది.
ఈ కారుని మార్కెట్లోకి విడుదల చేసిన 28 నెలల్లోనే ఇది ఈ మైలురాయిని చేరుకుంది. జూన్ 2022 లో లాంచ్ అయిన ఈ ఫోక్స్‌వవ్యాగన్ వర్టస్ ఆ సంస్థలోనే ట్రెండ్‌ని సెట్ చేసింది. ఈ కారును స్కోడా-MQB-AO-ప్లాట్‌ఫామ్‌పై నిర్మించారు. ఇది స్కోడా స్లావియా, స్కోడా కుషాక్, స్కోడా కైలాక్‌తో సహా ఆ కంపెనీలోని ఇతర మోడళ్లలో ఇదే ప్లాట్‌ఫామ్‌ని వినియోగించారు.

ఫోక్స్‌వ్యాగన్ వర్టస్ రెండు పవర్‌ట్రైన్ ఆప్షన్‌లలో లభిస్తుంది. 1.0-లీటర్ TSI పెట్రోల్ ఇంజిన్ 113 bhp పవర్, 178 nm టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇందులో 6-స్పీడ్ మాన్యువల్, ఆటోమేటిక్ గేర్ బాక్స్‌తో జతచేయబడి ఉన్నాయి. ఇక రెండో ఇంజిన్ మరింత శక్తివంతమైన 1.5-లీటర్ TSI EO ఇంజిన్‌తో పనిచేస్తుంది.దీనిని జీటీ పెర్ఫార్మెన్స్ లైన్ వేరియంట్‌ని అని కూడా పిలుస్తారు.
ఇందులో 7-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ జతచేయబడింది. ఇందులోని ఇంజిన్ ఆప్షన్స్ డ్రైవర్ల అవసరాలకు తగినట్లుగా ట్యూన్ చేయబడ్డాయి. దీంతో మెరుగైన ఫర్ఫామెన్స్‌ని అందిస్తాయి. ఇందులో ఫీచర్లు కూడా భారీగానే ఉన్నాయి. 10 ఇంచెస్ టచ్‌స్ట్రీన్ సిస్టమ్, వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జింగ్, 8-స్పీకర్ సిస్టమ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్, సన్‌రూఫ్‌తో సహా ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే సపోర్ట్‌తో వస్తుంది.

ముందు చెప్పిన విధంగా ఇందులోని సేఫ్టీ ఫీచర్లకు కొదువలేదు. ఈ సెడాన్‌లో 6 ఎయిర్‌బ్యాగ్స్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ఈఎస్‌సీ), టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, ఏబీఎస్‌తో కూడిన ఈబీడీ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ ఫోక్స్‌వ్యాగన్ వర్టస్ స్కోడా స్లావియా, మారుతి సుజుకి సియాజ్, హ్యుందాయ్ వెర్నా, హోండా సిటీ వంటి వాటికి గట్టి పోటీని ఇస్తుంది.
మంచి ఇంజిన్ ఆప్షన్లు, అధునాతన ఫీచర్లు, హై సేఫ్టీ ఫీచర్లతో ఈ కారు అందుబాటులో ఉంటుంది. దీంతో పాటు ఆకర్షణీయమైన ఎక్స్‌టీరియర్ డిజైన్‌తో ప్రీమియం సెడాన్ సెగ్మెంట్‌లో స్ట్రాంగ్ కాంపీటీటర్‌గా ఉంది. ఈ కారు ధర రూ. 11.56 లక్షల నుంచి రూ. 19.40 లక్షల (ఎక్స్ షోరూమ్) ధరతో కొనుగోలుకి అందుబాటులో ఉంటుంది. కొత్తగా ఓ మంచి ప్రీమియం కారు కొనుగోలు చేయాలనుకునేవారు దీనిని ట్రై చేయవచ్చు.


Click it and Unblock the Notifications








