డిమాండ్ తగ్గలేదని నిరూపించిన ఫోక్స్‌వ్యాగన్ సెడాన్.. సేఫ్టీలో రారాజు.. అందుకే ప్రజల నీరాజనం
చాలా మంది ఇటీవల కాలంలో ఎస్‌యూవీ(SUV) కార్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో వీటి అమ్మకాలు ఎక్కువగా నమోదవుతున్నాయి. అయితే ఇదే సమయంలో సెడాన్‌లకు కూడా డిమాండ్ పెరుగుతుంది. తాజాగా ఈ విభాగానికి సంబంధించిన విక్రయాలు కూడా అధికంగా ఉన్నాయి. ఈ సెగ్మెంట్‌లో ప్రముఖ కంపెనీ ఫోక్స్‌వ్యాగన్‌కు చెందిన వర్టస్(virtus) మోడల్ అక్టోబర్ నెలలో ఇండియాలో ఎక్కువగా అమ్ముడుపోతున్న సెడాన్‌లో మొదటి స్థానంలో నిలిచింది. భారత వినియోగదారుల్లో సెడాన్‌లకు ఉన్న డిమాండ్ ఇప్పటికి తగ్గలేదని ఈ మోడల్ నిరూపించింది. ముఖ్యంగా పండుగల సీజన్ అమ్మకాలు పెరగడానికి బాగా దోహదపడింది. దసరా, దీపావళి సమయంలో కంపెనీ అందించిన ఆఫర్లు కూడా వర్టస్ సెడాన్‌కు ఉపయోగపడింది.
తాజాగా విడుదల అయిన డేటా ప్రకారం, ఫోక్స్‌వ్యాగన్ వర్టస్‌ను అక్టోబర్ నెలలో 2,351 మంది కొనుగోలు చేశారు. అయితే ఈ సంఖ్య తక్కువగా ఉన్నప్పటికి కూడా ఇతర కంపెనీలకు చెందిన సెడాన్‌లతో పోలిస్తే, ఇది చాలా ఎక్కువ కావడం గమనార్హం. ముఖ్యంగా ఇది సెడాన్ మోడల్ స్లోవియాను అధిగమించింది. వీటితో పాటు మారుతీ సియాజ్, హోండా సిటీ వంటి వివిధ కార్ మోడల్‌లకు గట్టి పోటీ ఇచ్చింది.

వర్టస్ కారు డిజైన్ చాలా స్టైలీష్‌గా ఉంటుంది. దీన్ని ఇండియా 2.0 ప్రాజెక్టు కింద అమ్మకానికి తీసుకొచ్చారు. ముఖ్యంగా MQB A0IN' ప్లాట్‌ఫారమ్ ద్వారా తయారు చేశారు. ఈ కారును మొదటి సారిగా ఇండియాలో జూన్ 2022లో ఘనంగా విడుదల చేశారు.
ఇది అమ్మకానికి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 50 వేలకు పైగా అమ్మకాలను నమోదు చేసింది. ఎస్‌యూవీలకు ఎక్కువ డిమాండ్ ఉన్న కాలంలో కూడా ఈ సెడాన్ పట్ల వినియోగదారుల్లో మంచి ఆదరణ ఉందని గణంకాలను చూస్తే అర్థం అవుతుంది.
వర్టస్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, ప్రయాణికుల సేఫ్టీ పరంగా అధునాతన భద్రతా ప్రమాణాలను కలిగి ఉంది. ముఖ్యంగా, ఇది గ్లోబల్ ఎన్‌సీఎపీ నిర్వహించిన క్రాష్ టెస్ట్‌లో 5 స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను పొందింది. ఈ కారు ప్రమాద సమయంలో పిల్లలు, పెద్దల రక్షణకు సంబంధించి అత్యుత్తమైన సెడాన్‌గా ఉంది.అందుకే ఈ సెడాన్‌ను ప్రజలు బాాగా ఇష్టపడుతున్నారు. .
ప్రయాణీకుల భద్రత కోసం ఈ కారులో 6 ఎయిర్ బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, పార్క్ డిస్టెన్స్ కంట్రోల్, మల్టీ కొలిజన్ బ్రేక్, హిల్ హోల్డ్ కంట్రోల్ వంటివి ఉన్నాయి. ఇవి మాత్రమే కాకుండా కారులో 40కి పైగా భద్రతా ఫీచర్లు ఉన్నాయి. క్యాబిన్‌లో కూడా అధునాతన ఫీచర్లు ఉన్నాయి. 10-అంగుళాల ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, టచ్ స్క్రీన్, ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీ, ఆపిల్ కార్ ప్లే వంటివి ఉన్నాయి.
ఇవి కాకుండా, ఫోక్స్‌వ్యాగన్ వర్టస్‌లో ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఎలక్ట్రానిక్ సన్‌రూఫ్, వైర్‌లెస్ ఛార్జింగ్ , వెంటిలేటెడ్ సీట్లు వంటి ప్రీమియం ఫీచర్లు కూడా ఉన్నాయి. ఈ సెడాన్ లుక్ కూడా ఆకర్షణీయంగా ఉంటుంది. దీంతో ఎస్‌యూవీల పట్ట ప్రజలు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్న కాలంలో ఈ వర్టస్ మోడల్ ఇతర సెడాన్‌ల కంటే కూడా ఎక్కువగా అమ్మకాలను సాధిస్తుంది.
డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








