కొత్త కారు కొనాలనుకునే వారికి లక్కీ ఛాన్స్.. ఈ కార్లపై రూ.2 లక్షల తగ్గింపు.. కొద్ది రోజులే అవకాశం..

ప్రస్తుత ఏడాది ముగియడానికి మరికొద్ది రోజులు మాత్రమే ఉంది. దీంతో దేశీయంగా ఉన్నటువంటి దిగ్గజ వాహన తయారీ కంపెనీలు తమ పాత స్టాక్‌ను క్లియర్ చేసుకోడానికి వరుస బెట్టి ఇయర్ ఎండ్ తగ్గింపులను అందిస్తున్నాయి. ఈ ఏడాది, అంతకంటే ముందు ఉన్న స్టాక్‌ను సేల్ చేయడానికి ఈ విధంగా ప్రతి ఏటా నవంబర్, డిసెంబర్ సమయంలో పలు డిస్కౌంట్స్ ఉంటాయి. దసరా, దీపావళి పండుగ సమయంలో కంపెనీలు ఇచ్చిన ఆఫర్లను సద్వినియోగం చేసుకోలేని వారు కొత్త ఏడాదికి ముందు అందివచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుని తక్కువ ధరలో కొత్త కార్లను కొనుగోలు చేసి తమ ఇంటికి తీసుకెళ్లవచ్చు. ఇదిలా ఉంటే మిగతా కంపెనీల బాటలోనే ప్రముఖ కార్ల తయారీ కంపెనీ ఫోక్స్‌వ్యాగన్(volkswagen) డిసెంబర్‌లో తగ్గింపులను తీసుకొచ్చింది.

ఇయర్ ఎండ్ సేల్‌లో భాగంగా ఫోక్స్‌వ్యాగన్ ఇండియా తన ఎంపిక చేసిన మోడళ్లపై భారీగా డిస్కౌంట్స్‌ను ప్రకటించింది. కంపెనీ ప్రత్యేకంగా వర్టస్, టైగన్ కార్లపై ప్రత్యేక తగ్గింపులు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు, డీలర్-స్థాయిలో పలు ప్రోత్సాహకాలను వినియోగదారుల కోసం అందిస్తున్నట్లు వెల్లడించింది. ఇవి ప్రస్తుతం రూ.10.89 లక్షల ధర నుంచి అందుబాటులో ఉన్నాయి. 2025 ఏడాదిలో కొత్త కారులో తిరగాలనుకునే వారికి ఇది మంచి అవకాశం.

Volkswagen Year End Discount

ఫోక్స్‌వ్యాగన్ టైగన్ (Tigun) 1.0లీ ట్రిమ్‌లపై కంపెనీ దాదాపు రూ. 1.5 లక్షల వరకు క్యాష్ తగ్గింపులను అందిస్తుంది. ఇది కాకుండా అదనంగా ఎక్స్‌ఛేంజ్ బోనస్‌ రూ. 50,000 ఉంది. అలాగే, 1.5 లీ ఇంజిన్ వేరియంట్‌పై లాయల్టీ బోనస్‌, స్క్రాపేజ్ ప్రయోజనాలతో కలిపి రూ.50,000 తగ్గింపు ఉంది. 2 ఎయిర్‌బ్యాగ్‌లను కలిగిన పాత వేరియంట్లపై కంపెనీ ప్రత్యేకంగా రూ.40,000 తగ్గింపు ఇస్తుంది.

ఫోక్స్‌వ్యాగన్ తన పాత వేరియంట్‌లో స్టాండర్గ్‌గా రెండు ఎయిర్‌బ్యాగులు ఇవ్వగా, జూన్ 2024 నుంచి ప్రత్యేకంగా 6 ఎయిర్‌బ్యాగులను అందిస్తుంది. అదే తన ఫ్లాగ్‌షిప్ మోడల్‌పై ఇయర్ ఎండ్ సేల్‌లో రూ.2 లక్షల క్యాష్ తగ్గింపు, ఎక్స్‌ఛేంజ్ బోనస్, కార్పొరేట్ రాయితీ రూ. 1.5 లక్షలు, అదనంగా డీలర్ల నుంచి ప్రత్యేకంగా రూ.50,000 లాయల్టీ బోనస్ కూడా అందుబాటులో ఉంది. టైగన్ స్టైలీష్ డిజైన్‌తో సరికొత్త ఫీచర్లను కలిగి ఉంది.

ఇంకా ఫోక్స్‌వ్యాగన్ తన 2023 టైగన్ మోడల్‌పై రూ. 90,000 విలువైన 4 ఏళ్ల కాంప్లిమెంటరీ సర్వీస్‌ను సైతం ఆఫర్ చేస్తుంది. అలాగే, ఇయర్ ఎండ్ సేల్‌‌లో కంపెనీ మరో కారు వర్టస్ (Virtus)‌ పై కూడా ప్రత్యేక తగ్గింపు అందుబాటులో ఉంది. డిసెంబర్ నెలలో దాదాపు రూ.2 లక్షల వరకు తగ్గింపులను ఈ మోడల్‌పై ఉంది. వర్టస్ ఇండియాలో దాదాపు రూ.11.50 లక్షల(ఎక్స్ షోరూమ్) ప్రారంబ ధరకు లభిస్తుంది.

వోక్స్‌వ్యాగన్ వర్టస్‌ 1.0-లీటర్ టీఎస్‌ఐ వేరియంట్‌లపై రూ.1.50 లక్షల వరకు తగ్గింపు ఉంది. వీటిలో రూ. 1 లక్ష క్యాష్ డిస్కౌంట్, రూ.50,000 వరకు ఎక్స్ఛేంజ్/స్క్రాపేజ్ తగ్గింపు వంటి ప్రయోజనాలు ఉన్నాయి. అదే విధంగా 1.5-లీ ఇంజిన్ వేరియంట్‌పై కూడా రూ.50,000 తగ్గింపును ఈ ఇయర్ ఎండ్‌కు ముందు పొందవచ్చు. రెండు ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్న పాత మోడల్‌పై అదనంగా రూ. 40,000 తగ్గింపు కూడా లభిస్తుంది.

టైగన్‌కు అందుబాటులో ఉన్న విధంగానే 2023 మోడల్‌పై రూ.50,000 క్యాష్ తగ్గింపు ఉంది. వర్టస్‌ కారుకు ఇండియాలో మంచి డిమాండ్ ఉంది. ఇది ప్రధానంగా హ్యుందాయ్ వెర్నా, హోండా సిటీ ,స్కోడా స్లావియాతో పాటు ఇతర మోడళ్లకు గట్టి పోటీ ఇస్తోంది. ఈ మోడల్ ఇటీవల అత్యధికంగా సేల్స్‌ను నమోదు చేసింది. డేటా ప్రకారం, ఇది 50,000 యూనిట్ల విక్రయాలను సాధించింది.

More from DriveSpark

Article Published On: Sunday, December 8, 2024, 11:37 [IST]
English summary
Volkswagen year end discount up to rs 2 lakh on taigun and virtus
Read more on: #volkswagen #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+