స్వీడన్ బ్రాండ్ కారుకు భారత్‌లో పెరిగిన డిమాండ్.. సేల్స్‌లో సరికొత్త రికార్డ్

భారతీయ విఫణిలో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ భారీగా ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని దాదాపు అన్నాయి వాహన తయారీ సంస్థలు తమ కార్లను లేదా బైకులను ఎలక్ట్రిక్ రూపంలో లాంచ్ చేస్తున్నాయి. ఇందులో భాగంగానే ప్రముఖ స్వీడన్ కార్ల తయారీ సంస్థ 'వోల్వో' (Volvo) దేశీయ మార్కెట్లో రెండు ఎలక్ట్రిక్ కార్లను లాంచ్ చేసింది. అవి XC40 రీఛార్జ్ మరియు C40 రీఛార్జ్. ఇవి రెండూ ఏకంగా 1000 యూనిట్లు అమ్ముడైనట్లు సమాచారం. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు వివరంగా ఈ కథనంలో చూసేద్దాం.

2022 నవంబర్ నెలలో ప్రారంభించబడిన వోల్వో ఎలక్ట్రిక్ కార్లు భారతదేశంలో తన ప్రయాణంలో ఓ సరికొత్త మైలురాయిని ప్రకటించింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 1000 వోల్వో ఎలక్ట్రిక్ కార్లను దేశ వ్యాప్తంగా విక్రయించినట్లు సమాచారం. అయితే కంపెనీ తన ఎలక్ట్రిక్ వాహనాలను తన ఆన్‌లైన్ సేల్స్ ప్లాట్‌ఫామ్ ద్వారా మాత్రమే విక్రయిస్తుంది. ఇందులో XC40 రీఛార్జ్ మరియు C40 రీఛార్జ్ కార్లు ఉన్నాయి.

Volvo C40 Recharge

ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా వోల్వో కార్స్ ఇండియా 1000 కంటే ఎక్కువ కార్లను విక్రయించినట్లు కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ జ్యోతి మల్హోత్రా పేర్కొన్నారు. 2030 నాటికి కంపెనీ పూర్తిగా ఎలక్ట్రిక్ కార్లను మాత్రమే లాంచ్ చేయడానికి సన్నద్ధమవుతున్నట్లు కూడా వివరించారు. కంపెనీ ఎలక్ట్రిక్ కార్లకు మార్కెట్లో మంచి ఆదరణ ఉందని, రాబోయే రోజుల్లో మరిన్ని గొప్ప ప్రజాదరణ పొందుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

నిజానికి వోల్వో కంపెనీ యొక్క XC40 రీఛార్జ్ రెండు ట్రిమ్‌లలో లభిస్తుంది. అవి ఆల్టోమేట్ డ్యూయెల్ మోటార్ వేరియంట్ మరియు ఇటీవల ప్రారంభించబడిన ప్లస్ ట్రిమ్, ఇది కేవలం ఒకే మోటారును పొందుతుంది. రెండోది రియర్ వీల్ డ్రైవ్ మోడల్. ఇది గరిష్టంగా 238 Bhp పవర్ మరియు 420 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. పనితీరు పరంగా ఇది చాలా ఉత్తమంగా ఉంటుంది.

Volvo XC40 Recharge

వోల్వో C40 రీఛార్జ్ ఎలక్ట్రిక్ కారు 403 Bhp పవర్ మరియు 660 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇది ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్‌తో ట్విన్ మోటార్ సిస్టమ్‌తో ట్విన్ మోటార్ పొందుతుంది. ఇది అద్భుతమైన పనితీరును అందిస్తుంది. XC40 రీఛార్జ్ ప్లస్ మరియు అల్టిమేట్ ట్రిమ్‌ ధరలు రూ.54.95 లక్షలు మరియు రూ.57.90 లక్షలు (ఎక్స్-షోరూమ్). అయితే C40 రీఛార్జ్ అల్టిమేట్ ధర రూ.62.95 లక్షలు (ఎక్స్-షోరూమ్).

ఆధునిక కాలంలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు విపరీతంగా పెరుగుతున్నాయి. దీంతో చిన్న కంపెనీల దగ్గర నుంచి పెద్ద కంపెనీల వరకు ఎలక్ట్రిక్ వాహనాలను లాంచ్ చేస్తూ.. ఉత్తమ అమ్మకాలను పొందుతున్నాయి. ప్రస్తుతం దేశీయ మార్కెట్లో సరసమైన ధరలకు లభించే ఎలక్ట్రిక్ వాహనాలు ఉన్నాయి, కోట్ల రూపాయల విలువైన కార్లు అందుబాటులో ఉన్నాయి. అంటే అన్ని వర్గాల వారి కోసం ఎలక్ట్రిక్ కార్లు మార్కెట్లో అద్భుతాలు ఉన్నట్లు స్పష్టమవుతోంది.

కేవలం కంపెనీలు మాత్రమే కాకుండా కేంద్ర ప్రభుత్వం కూడా ఎలక్ట్రిక్ వాహనాలను ఉపయోగించాలని, ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేసేవారికి సబ్సిడీలు అందిస్తోంది. ఇది ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని బాగా పెంచడంలో దోహదపడుతోంది. రాబోయే రోజుల్లో దేశంలో ఫ్యూయెల్ కార్ల వినియోగాన్ని తగ్గించనున్నట్లు, వాటి స్థానంలో ఎలక్ట్రిక్ కార్లు మాత్రమే ఉపయోంచనున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఇటీవలే పేర్కొన్నారు.

ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.

More from DriveSpark

Article Published On: Friday, June 7, 2024, 17:33 [IST]
English summary
Volvo ev sales crossed 1000 units in india
Read more on: #volvo #electric vehicles
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+