ఈ కొత్త కారులో ప్రయాణం చాలా సేఫ్.. క్రాష్ టెస్టులో 5 స్టార్ రేటింగ్.. ప్రపంచంలోనే ఈ కార్లు చాలా ఫేమస్!
ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన కార్లలో ఒకటిగా వోల్వో కార్లు ప్రసిద్ధి చెందాయి. అందువల్ల అంతర్జాతీయ మార్కెట్‌లో ఈ సంస్థకు చెందిన కార్లు మంచి పాపులారిటీని సాధించాయి. భారతీయ మార్కెట్‌లోనూ వోల్వో కార్లు అమ్మకాలు స్థిరంగా రాణిస్తున్నాయి. వోల్వో సెకండ్ హ్యాండ్ కార్లకు సైతం మంచి డిమాండ్ ఉంది. అయితే దేశంలో టాటా, మహీంద్రా కార్ల వలె వోల్వో కార్లు ప్రపంచవ్యాప్తంగా సేఫెస్ట్ కార్లుగా ఉన్నాయి. తాజాగా మరో వోల్వో కారు క్రాష్ టెస్ట్‌లో 5 స్టార్ రేటింగ్‌ని సాధించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ కథనంలో..
తాజాగా నిర్వహించిన యూరో క్రాష్ టెస్ట్‌లో వోల్వో కొత్త ఎలక్ట్రిక్ కారు 'EX30' 5 స్టార్ రేటింగ్‌తో అదరగొట్టింది. ఈ సరికొత్త వోల్వో కారును భారతదేశంలో కూడా విక్రయించాలని కంపెనీ యోచిస్తోంది. భారత్‌లో గత కొద్ది నెలలుగా సురక్షితమైన కార్లకే జనాలు ప్రాధాన్యత ఇస్తున్నారు. అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానంతో కార్లను సాధ్యమైనంత సురక్షితంగా తయారు చేయడానికి కంపెనీలు యత్నిస్తున్నాయి. ఈ విషయంలో వోల్వో తొలి స్థానంలో ఉంది.

గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్ ఫలితాల వల్ల కంపెనీల మధ్య ఆరోగ్యకరమైన పోటీ నెలకొంది. అందుకు అనుగుణంగా కార్లను పరీక్షించేందుకు స్వచ్ఛందంగా అందిస్తున్నారు. తాజాగా డిజైర్‌ని సైతం మారుతి సొంతంగా పంపించింది. తద్వారా సేల్స్‌ని ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. భారత్‌లో ఎన్‌సీఏపీ క్రాష్ టెస్ట్‌ని నిర్వహిస్తున్నారు. భారత్‌లో అడుగుపెట్టే ప్రతీ కారుని BNCAPలో పరీక్షించవచ్చు.
అయితే ఈ వోల్వో యూరో NCAP క్రాష్ టెస్ట్‌లో 5 స్టార్ రేటింగ్‌ని సాధించింది. యూరో క్రాష్ టెస్ట్‌లో గతంలోనూ వివిధ వోల్వో కార్లను పరీక్షించారు. ఈ వోల్వో స్వీడిష్ కార్ల కంపెనీగా ఉంది. దీంతో వోల్వో ఈఎక్స్ 30 ఎలక్ట్రిక్ కారుని యూరో NCAP క్రాష్ టెస్ట్‌లో పరీక్షించారు. తాజాగా ఆ ఫలితాలు వెలువడ్డాయి. ఖరీదైన వోల్వో కార్లతో పోలిస్తే ఈ ఈఎక్స్ 30 కొంచెం చిన్నదిగా ఉంటుంది.

తాజా క్రాష్ టెస్ట్‌లో ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ అన్ని కేటగిరీల టెస్టుల్లో 79కి పైగా స్కోర్ సాధించింది. పెద్దల సేఫ్టీలో వోల్వో EX30 ఎలక్ట్రిక్ 35.3 స్కోర్‌ని అలాగే పిల్లల సేఫ్టీలో 42 స్కోర్‌ని సాధించింది. కార్లలోని ఎలక్ట్రానిక్ సేఫ్టీ సిస్టమ్స్ 80 శాతం మెరుగ్గా పనిచేశాయి. దీనిలోని ఫ్రంటల్ కొలిషన్‌లో ముందు ప్రయాణికుల మోకాలి ప్రాంతాలకు పెద్దగా రక్షణ లభించలేదని తేలింది.
అయితే ఢీకొన్న సమయంలో మోకాళ్లు మినహా ముందు సీట్ల ప్రయాణికుల శరీర భాగాలన్నింటికీ మంచి సేఫ్టీ లభించినట్లు యూరో ఎన్‌సీఏపీ పేర్కొంది. ఇక సైడ్ ఇంపాక్ట్‌లో వల్ల ముందు సీటు ప్రయాణికులకు మెరుగైన రక్షణ లభించినా కానీ వెనుక సీటు ప్రయాణికులకు అంత సేఫ్టీ లభించలేదు. ఈ ప్రమాదాలన్నింటిలో ముందు ఎయిర్‌బ్యాగ్స్ తలలకు మంచి సేఫ్టీని అందించాయి. ఒకవేళ కారు మునిగే సమయంలో ప్రయాణికులు డోర్లు, విండోస్ సులభంగా తెరవవచ్చు.
ఈ టెస్టుల్లో 6, 10 సంవత్సరాల వయస్సు గల డమ్మీలను ఉపయోగించారు. కారు లోపల ఇంతకంటే తక్కువ పిల్లలను గుర్తించే వ్యవస్థ లేకపోవడం వల్ల ఈఎక్స్ 30 స్కోర్ తగ్గింది. ఇక రోడ్డుపై వెళ్లే పాదచారుల సేఫ్టీ విషయంలో ఈ కారుకు 79 స్కోర్ మాత్రమే ఇచ్చారు. ఈ కారులోని అడ్వాన్స్‌డ్ ఫీచర్లు ప్రమాదాలను తగ్గించడంలో సహాయపడతాయి.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








