ఆ ప్లాంట్‌లో 10 వేల కార్లను ఉత్పత్తి చేసిన వోల్వో ఇండియా.. ఆ కారు ఎంటో తెలుసా..?

వోల్వో సంస్థ కీలక మైలురాయిని చేరుకుంది. వోల్వో ఇండియా తన బెంగళూరు తయారీ ప్లాంట్‌లో 10,000 కార్ల మైలురాయిని చేరుకుంది. ఈ సంస్థ 2017 సంవత్సరంలో తన అసెంబ్లింగ్‌ కార్యకలాపాలను ప్రారంభించింది. XC90 వాహనాన్ని తొలుత ఉత్పత్తి చేసింది. సంస్థ తొలి ప్యూర్‌ ఎలక్ట్రిక్‌ కారు XC40 రీఛార్జ్‌ (Volvo xc40 Recharge) ఉత్పత్తితో 10 వేల కార్ల ఉత్పత్తికి చేరింది.

ఇందులో గరిష్ఠంగా 4000 పైగా XC60 కార్లను ఉత్పత్తి చేసింది. ఈ తయారీ ప్లాంట్‌లో XC90, XC60, S90, XC40 రీఛార్జ్‌ సహా అనేక మోడళ్లను అసెంబ్లింగ్‌ చేసేందుకు ఉయోగిస్తోంది. XC40 వోల్వో యొక్క తొలి స్వదేశీ ఎలక్ట్రిక్‌ వాహనంగా ఉంది. బెంగళూరులో యూనిట్‌లోనే పూర్తిగా అసెంబుల్‌ చేయబడింది. వోల్వో c40 రీఛార్జ్‌ ధర రూ.57.90 లక్షలు (ఎక్స్‌షోరూం) గా ఉంది.

volvo-10000-made-in-india-car-rolls-out

వోల్వో XC40 రీఛార్జ్‌ మోడల్‌ 78kWh బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంది. మరియు డ్యూయల్‌ మోటార్‌ ఆప్షన్‌తో ఉంది. ఇది 402bhp శక్తి మరియు 660Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 11kW హోమ్ ఛార్జర్‌తో వస్తుంది. దీంతో బ్యాటరీని పూర్తిగా ఛార్జింగ్‌ చేసేందుకు 12 నుంచి 18 గంటల సమయం పడుతుంది. సింగిల్‌ ఛార్జింగ్‌తో 418 కి.మీ మైలేజీని అందిస్తుంది.

50kW ఫాస్ట్‌ ఛార్జింగ్ స్టేషన్లలో కేవలం 2 గంటల 30 నిమిషాల్లోనే పూర్తి ఛార్జింగ్‌ చేయవచ్చు. ఈ బ్యాటరీ ప్యాక్‌ 150kW DC ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సదుపాయాన్ని సపోర్టు చేస్తుంది. దీంతో కేవలం 33 నిమిషాల్లోనే 80% ఛార్జింగ్‌ను అందిస్తుంది. భారీ బ్యాటరీ కారణంగా ఈ ఈవీ బరువు 2188 కిలోలుగా ఉంది. పెట్రోల్‌ వేరియంట్‌ కంటే 400 కిలోలు బరువు ఎక్కువగా ఉంటుంది.

వోల్వోXc40 రీఛార్జ్‌ ఎలక్ట్రిక్‌ వాహనం కేవలం 4.9 సెకన్లలో 0-100 kmph వేగాన్ని అందుకుంటుంది. ఈ కారు గరిష్ఠ వేగం 180 కి.మీగా ఉంది. ఈ కారు 19 అంగుళాల అల్లాయ్‌ వీల్స్‌, 452 లీటర్ల బూట్‌ స్పేస్‌ను కలిగి ఉంటుంది. ఈ కారు పొడవు 4425mm, 1863mm వెడల్పు, 1652mm ఎత్తు, 175mm గ్రౌండ్ క్లియరెన్స్‌ను కలిగి ఉంటుంది.

వోల్వో C40 రీఛార్జ్ క్యాబిన్‌ లెదర్‌ ఫ్రీగా వస్తుంది. C40 రీఛార్జ్‌ రీసైకిల్‌ చేసిన ప్లాస్టిక్‌ బాటిళ్లను వినియోగించి కార్‌పెట్‌లను తయారుచేశారు. ఈ కారు డ్యాష్‌బోర్డు 9 అంగుళాల టచ్‌స్క్రీన్‌ ఇన్ఫోటైన్‌మెంట్‌ సిస్టమ్‌ను కలిగి ఉంటుంది. ఇది ఆండ్రాయిడ్‌ ఆటో, ఆపిల్‌ కాల్‌ప్లేను సపోర్టు చేస్తుంది. ఈ ఇన్ఫోటైన్‌మెంట్‌ సిస్టమ్‌ ప్రీమియం హార్మన్‌- కార్డాన్‌ ఆడియో సిస్టమ్‌తో జతచేయబడుతుంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from DriveSpark

Article Published On: Friday, January 19, 2024, 18:57 [IST]
English summary
Volvo india has reached milestone and rolls out 10000th made in india car
Read more on: #వోల్వో #volvo
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+