వోల్వో C40 రీఛార్జ్‌ ఎలక్ట్రిక్‌ కారులో మంటలు.. ఘటనపై స్పందించిన వోల్వో ఇండియా

ప్రముఖ వాహనాల తయారీ సంస్థ వోల్వో భారత్‌లో విక్రయించే అధునాతన ఎలక్ట్రిక్‌ వాహనాల్లో వోల్వో C40 రీఛార్జ్‌ ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీ (volvo C40 Recharge EV) ఒకటిగా ఉంది. ఇటీవల జరిగిన ప్రమాదంలో ఈ కారులో ఒక్కసారిగా మంటలు చేలరేగాయి. కొద్దిసేపట్లోనే కారు పూర్తిగా మంటల్లో కాలిపోయింది. ఈ ఘటన ఛత్తీస్‌ఘడ్‌లో చోటుచేసుకుంది.

అయితే అప్రమత్తంగా ఉన్న ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను యాజమాని వీడియో తీశారు. ఇది కాస్త వైరల్‌ అయింది. ఫలితంగా ఎలక్ట్రిక్‌ వాహనాల భద్రత సహా ఇతర అంశాలపై అనేక ప్రశ్నలు తలెత్తాయి. భారత్‌ మార్కెట్‌లో వోల్వో C40 రీఛార్జ్‌ ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీ ధర రూ.62.95 లక్షలుగా (ఎక్స్‌షోరూం) ఉంది.

Volvo india responds officially on volvo C40 Recharge EV fire accident

ఈ ఘటనపై వోల్వో ఇండియా అధికారికంగా స్పందించింది. వోల్వో C40 రీఛార్జ్‌ ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీ డ్రైవింగ్‌లో ఉండగా అకస్మాత్తుగా మంటలు చెలరేగాయని పేర్కొంది. అయితే కారులో ఉండే అత్యాధునిక ఫీచర్లు డ్రైవర్‌ను అప్రమత్తం చేసినట్లు తెలిపింది. ఫలితంగా ప్రయాణికులు అంతా క్షేమంగా బయటపడ్డారని పేర్కొంది. ఈ ఘటనపై తమ సంస్థకు చెందిన నిపుణులు దర్యాప్తు చేస్తున్నారని పేర్కొంది. సదరు కారు యజమానితో సంస్థ ప్రతినిధులు సంప్రదింపులు చేస్తున్నారని వెల్లడించింది.

వోల్వో C40 రీఛార్జ్‌ ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీ 78kWh బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంటుంది. ఈ కారులోని డ్యూయల్‌ ఎలక్ట్రిక్‌ మోటార్‌.. గరిష్టంగా 408 ps శక్తి, 660Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఎలక్ట్రిక్‌ SUV 11kW AC ఛార్జర్‌ని ఉపయోగించి 0-100 శాతం ఛార్జింగ్‌ చేసేందుకు 8 గంటల సమయం పడుతుంది. అదే 150kw DC ఛార్జర్‌తో 30 నిమిషాల్లో 10-80 శాతం ఛార్జింగ్‌ చేయవచ్చు.

volvo C40 Recharge EV fire accident

వోల్వో C40 రీఛార్జ్‌ ఎలక్ట్రిక్‌ కారు బ్యాటరీని సింగిల్‌ ఛార్జింగ్‌పై 530 కి.మీ రేంజ్‌ను ఇస్తుంది. ఈ SUV కేవలం 4.7 సెకన్లలో 0-100kmph వేగాన్ని అందుకుంటుంది. ఫీచర్ల పరంగా 9 అంగుళాల టచ్‌స్క్రీన్‌ ఇన్ఫోటైన్‌మెంట్‌ సిస్టమ్, 12 అంగుళాల డిజటల్‌ డ్రైవర్ డిస్‌ప్లే, డ్యూయల్‌ జోన్‌ క్లైమేట్‌ కంట్రోల్‌, సన్‌రూఫ్‌ వంటి ఫీచర్లను కలిగి ఉంది.

ఎలక్ట్రిక్‌ వాహనాలు లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్‌లను కలిగి ఉంటాయి. డ్రైవింగ్‌ చేస్తున్న సమయంలో కొన్నిసార్లు ఎక్కువ శక్తి ఉత్పన్నమైనప్పుడు, మంటలు చెలరేగే అవకాశం ఉంటుంది. అయితే కొన్నిసార్లు తయారీ లోపం కూడా ప్రమాదాలకు కారణం కావచ్చు.

దాంతోపాటు బ్యాటరీ నిర్వహణ సరిగా లేనప్పుడు కూడా అగ్నిప్రమాదాలు చోటుచేసుకొనే అవకాశం ఉంది. బ్యాటరీ ఎక్కువగా ఛార్జి చేసినప్పుడు వేడెక్కి మంటలు చెలరేగే అవకాశం ఉంటుంది. ఈ ఘటనపై వోల్వో సంస్థ దర్యాప్తు చేస్తున్నందున త్వరలోనే స్పష్టమైన కారణాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from DriveSpark

Article Published On: Wednesday, January 31, 2024, 19:18 [IST]
English summary
Volvo india responds officially on volvo c40 recharge ev fire accident
Read more on: #వోల్వో #volvo
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+