అప్పు లేదా లోన్‌ ద్వారా కారు కొని టైమ్‌కి EMI కట్టకపోతే ఏమవుతుందో తెలుసా?

దేశంలో చాలామంది కార్లను కొనుగోలు చేస్తున్నారు. అయితే వీరిలో ఎక్కువ మంది లోన్స్‌ లేదా ప్రభుత్వాలు అందించే సబ్సిడీల ద్వారా ఈఎంఐల(EMI) రూపంలో కార్లను కొనుగోలు చేస్తున్నారు. కొంతమంది పర్సనల్‌ వినియోగాల కోసం కార్లను కొనుగోలు చేస్తుండగా మరికొందరు.. జీవనోపాధి కోసం కార్లను ఖరీదు చేస్తున్నారు. అయితే ఈ విధానంలో కొనుగోలు చేసే కొంతమంది సకాలంలో ఈఎంఐ చెల్లిస్తుంటే.. మరికొందరు వీటిని ఎగవేస్తున్నారు. దీనివల్ల చాలా సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఈఎంఐలను మిస్ చేయడం వల్ల జరిగే పరిణామాలు, నష్టాలను ఈ కథనంలో వెల్లడించబోతున్నాం. ఆ వివరాలు ఈ కథనంలో..

సిబిల్‌ స్కోర్: మీరు కారుని లోన్‌ ద్వారా కొనుగోలు చేసి సకాలంలో ఈఎంఐ చెల్లించకపోతే ముందుగా మీ క్రెడిట్ స్కోర్‌పై తీవ్ర ప్రభావం పడుతుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. సిబిల్‌ స్కోర్‌ తగ్గడం వల్ల భవిష్యత్తులో మీ లోన్స్‌ (హోమ్‌, పర్సనల్‌, ఇతర బిజినెస్‌) రిజెక్ట్‌ అయ్యే అవకాశం ఉంటుంది. రాబోయే రోజుల్లో ఇది మీ అవసరాలపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది.

Car-EMI-Payments-Delay-Issues

ముఖ్యంగా హోమ్‌ లేదా లోన్స్‌పై ఇది తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఒకవేళ మీ సిబిల్‌ స్కోర్‌ ఆశించిన స్థాయిలో లేనియెడల బ్యాంక్‌ లేదా ఇతర లోన్స్‌ సంస్థలు అధిక వడ్డీ రేట్లతో లోన్‌ ఆఫర్‌ చేసే అవకాశం ఉంటుంది. ఇది మీకు అదనపు ఖర్చులకు దారితీస్తుంది. కాబట్టి సిబిల్ స్కోర్‌పై తీవ్ర ప్రభావం పడకుండా ఈఎంఐని సకాలంలో చెల్లించుకోవడం ఉత్తమమైన మార్గం.

ఫైన్స్‌: మీరు మీ కారు లోనూ చెల్లింపులను తరచూ మిస్ చేస్తూ ఉంటే బ్యాంకు లేదా ఇతర ఫైనాన్సియల్‌ సంస్థలు మీపై చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు. ఇది కోర్టు కేసులు మరియు జరిమానాల వరకు దారితీస్తుంది. ఇది మిమ్మల్నీ మరింత ఒత్తిడి మరియు ఆర్థిక ఊబిలోకి నెట్టివేసే ప్రమాదం ఉంటుంది. చాలా కంపెనీలు ఇప్పుడు భారీ జరిమానాలు విధిస్తున్నాయి. దీనివల్ల మీపై మరితం ఆర్థిక భారం పడే అవకాశం ఉంటుంది.

Car-EMI-Payments

రికవరీ: నెలల తరబడి మీరు వాయిదాలు చెల్లించడంలో విఫలమైతే, బ్యాంకులు లేదా ఫైనాన్సియల్‌ కంపెనీలు రికవరీ చర్యలను ప్రారంభించవచ్చు. బాకీపడ్డ మొత్తాన్ని తిరిగి పొందే వరకు మీ ఇల్లు లేదా కారును స్వాధీనం చేసుకుంటారు. దీనికంటే ముందే మీకు నోటీసులు ఇస్తారు. ఆ తర్వాత మీ పద్ధతి మార్చుకోక పోతే అప్పు కింద వాటిని రికవరీ చేసుకుంటారు. ఇది అతి పెద్ద తలనొప్పిగా మారుతుంది.

ఓనర్‌షిప్‌ క్యాన్సిల్‌: మీరు ఎక్కువ కాలం ఈఎంఐ చెల్లించడంలో విఫలమైతే బ్యాంక్ మీ కారును స్వాధీనం చేసుకుని విక్రయించవచ్చు. ఫలితంగా మీరు అప్పు తీసుకున్న వాహనంపై యాజమాన్యాన్ని (ఓనర్‌షిప్‌) కోల్పోతారు. వాహన అమ్మకం నుంచి లోన్‌ మొత్తాన్ని మినహాయించిన తర్వాత వచ్చే డబ్బును మాత్రమే మీరు తిరిగి పొందుతారు. ఇది మీకు పూర్తిగా నష్టాన్ని చేకూర్చుతుంది. అంతే కాకుండా మీ వాహనం ఇక మీకు ఎప్పటికి దక్కదు.

Car-Buy-On-EMI

ఒత్తిడి: కారు రుణ వాయిదాలు చెల్లించలేకపోవడం మిమ్మల్ని ఒత్తిడికి గురి చేస్తుంది. ఇది మీ వ్యక్తిగత మరియు వృత్తిపరమైన జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. కాబట్టి సకాలంలో చెల్లించడానికి ప్రయత్నించండి. ఇది మీకు మేలు చేస్తుంది. ఒకవేళ మీ కారు లోన్‌ ద్వారా తీసుకుంటే కలిగే సమస్యల గురించి ముందే తెలుసుకోవడం చాలా ముఖ్యం. కాబట్టి స్థోమతకు తగినట్లు నెలవారీ EMI, అలాగే పూర్తి గడువుపై ముందే చర్చించి నిర్ణయం తీసుకోవాలి.

నెలవారీ వాయిదాల్లో వాహనం కొనడం లాభదాయకంగా ఉంటుంది. కాబట్టి మీరు లోన్‌ ద్వారా వాహనాన్ని కొనుగోలు చేసినప్పుడు తీసుకున్న సొమ్ముకి వడ్డీ కూడా చెల్లించాల్సి ఉంటుంది. దీని వల్ల మీరు ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుంది. కాబట్టి, మీరు కొత్త వాహనాన్ని కొనుగోలు చేస్తుంటే దానికి సరిపడా అదనపు రాబడి ఉంటేనే లోన్‌ ద్వారా కారుని కొనుగోలు చేయాలి. లేదంటే మీ జేబులకు చిల్లు పడటం ఖాయం.

More from DriveSpark

Article Published On: Sunday, August 11, 2024, 13:52 [IST]
English summary
What happens if car emi payments are delayed check full details in telugu
Read more on: #auto news #car loans #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+