పెట్రోల్ కార్లతో పోలిస్తే CNG కార్లు కాస్ట్లీ అని మీకు తెలుసా.??.. కారణాలివే.!!

భారత మార్కెెట్లో CNG కార్ల అమ్మకాలు నెమ్మదిగా వేగం పంజుకుంటున్నాయి. పెట్రోల్ కార్లతో పోలిస్తే CNG కార్లు అధిక మైలేజ్ ఇవ్వడమే ఇందుకు కారణం. అయితే ఇంధన కార్లతో పోలిస్తే CNG కార్ల ధరలు ఎక్కువగా ఉంటున్నాయి. ఇలా ఎందుకని చాలా మందికి డౌట్ రావచ్చు. దానికి సమాధానాలు ఇక్కడ అందిస్తున్నాం.

పెట్రోల్ కార్లతో పోలిస్తే CNG కార్లు అనేక విధాలుగా సమర్థవంతంగా పనిచేస్తాయి. CNG.. పెట్రోల్ కారు కంటే తక్కువ కాలుష్యాన్ని విడుదల చేస్తుంది. దీని ద్వారా పర్యావరణానికి తక్కువ హాని కలుగుతుంది. ఇది మాత్రమే కాదు, పెట్రోల్ వాహనాల కంటే CNG వాహనాలు ఎక్కువ మైలేజీని ఇస్తాయి. దీని ద్వారా వాహనదారులకు డబ్బు ఆదా అవుతుంది.

CNG-Cars-Expensive-Than-Petrol-Cars

ఇదంతా ఓ వైపు అయితే మార్కెట్లో సీఎన్జీ కార్ల ధర పెట్రోల్ కార్ల ధర కంటే రూ. 1 లక్ష నుంచి రూ. 1.5 లక్షలు ఎక్కువగా ఉంటుంది. పెట్రోల్ మరియు సీఎన్‌జి వాహనాలను పోల్చినప్పుడు, సీఎన్‌జీ వాహనాలలో ఫీచర్లు దాదాపుగా అవే ఉంటాయి. కొత్త CNG వాహనాలు తరచుగా ఏ ప్రత్యేక లక్షణాలను కలిగి ఉండవు.

అయితే ఫీచర్లు అన్నీ ఒకేలా ఉన్నా పెట్రోల్ వాహనాల కంటే CNG వాహనాలు ఎందుకు ఖరీదైనవనే సందేహం కలుగుతుంది కదా.. మీరు CNG వాహనాన్ని కొనుగోలు చేయాలనుకుంటున్నట్లయితే అందుకు సంబంధించిన ఈ కారణాలన్నింటినీ తెలుసుకోవడం ఉత్తమం. ఆ తర్వాత మీకు సరిపోయే కారును ఎంచుకోండి.

ప్రాథమికంగా, పెట్రోల్ వాహనాల తయారీ ఖర్చు కంటే సీఎన్‌జి వాహనాల తయారీ ఖర్చు ఎక్కువగా ఉంటుంది. ఇది ఒక ముఖ్యమైన కారణం కాగా పెట్రోల్ వాహనాలతో పోలిస్తే, CNG వాహనాలు అధిక పీడన నిల్వ ట్యాంక్ కలిగి ఉంటుంది. దీంతో పాటు CNG ఫ్యూయెల్ నాజిల్ మరియు ప్రెజర్ రెగ్యులేటర్ పైపులు వంటి అదనపు భాగాలతో వస్తాయి.

సీఎన్‌జీ వాహనాల్లో ఉపయోగించే పైప్‌లైన్‌లను స్టెయిన్‌లెస్ పైప్ లైన్‌లుగా నిర్మించాల్సి ఉంటుంది. దీని ధర ఎక్కువగా ఉంటుంది. ఈ వాహనాల్లో అమర్చిన ఇంజిన్ పెట్రోల్ ఇంజిన్ అయినప్పటికీ, సీఎన్‌జీతో నడపడానికి కొన్ని మార్పులు చేయాలి. ప్రధానంగా బలమైన పిస్టన్‌లతో రూపొందించాలి. ఇందుకు ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్‌లో కొన్ని మార్పులు అవసరం ఉంటుంది. ఈ మార్పుల ద్వారా CNG కార్ల ధర అధికంగా ఉంటుంది.

ఇక CNG గ్యాస్ అత్యంత మండే వాయువు.. ఈ క్రమంలో సీఎన్‌జీ ట్యాంక్‌ నుంచి స్వల్పంగా లీక్‌ వచ్చినా వాహనం మొత్తం పేలిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి CNG వాహనాలను తయారు చేసేటప్పుడు అధిక భద్రతా ప్రమాణాలను పాటించాల్సి ఉంటుంది. ఇవి కూడా వాహనం ధర పెరగడానికి కారణాలుగా ఉన్నాయి.

మరోవైపు మీరు CNG వాహనాన్ని కొనుగోలు చేసిన తర్వాత, మీరు దానిని పెట్రోల్ వాహనం మాదిరిగా మెయింటైన్ చేయలేరు. కాబట్టి ఇందుకోసం నిర్ణీత వ్యవధిలో నిర్వహణ చేయాల్సి ఉంటుందిద. అదేవిధంగా సీఎన్జీ వాహనాల్లో ఏవైనా స్పేర్ పార్ట్స్ మార్చుకోవాల్సిన పరిస్థితి ఉంటే మార్కెట్లో వీటి ధర ఎక్కువగా ఉంటుంది.

వీటితో పాటు CNG వాహనాలకు సేవలందించే మెకానిక్‌లు చాలా తక్కువగా అందుబాటులో ఉంటారు. దీని కారణంగా, మీరు అసలు మెకానిక్ కోసం వెతకాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ మెకానిక్ ఖర్చు కూడా ఎక్కువగా ఉంటుంది. చాలా తక్కువ మెకానికల్‌లు ఉన్నందున వారు మీ కారుకు వెంటనే సర్వీస్ చేయలేరు.

More from DriveSpark

Article Published On: Tuesday, May 7, 2024, 9:20 [IST]
English summary
Why cng cars expensive than petrol cars here are the reasons you should know
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+