ఈ రోడ్లపై వెళ్తుంటే మీ ఎలక్ట్రిక్‌ కారు ఆటోమేటిక్‌గా ఛార్జ్‌ అవుతుంది.. అదెలా అనుకుంటున్నారా.??

టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ ఆటో రంగంలో విస్తృతమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. కొత్త కొత్త ఆవిష్కరణలు పుట్టుకొస్తున్నాయి. అందులో ముఖ్యమైనది ఎలక్ట్రిక్ వాహనాల సెగ్మెంట్‌(Electric Vehicles). ICE వాహనాలకు ప్రత్యామ్నాయంగా ప్రజలకు ఈవీలు మారాయి. అయితే ఈవీ రంగానికి సంబంధించి తాజా ఆవిష్కరణ ఒకటి ఆసక్తికరంగా మారింది.

సాంప్రదాయ వాహనాలకు పెట్రోల్‌, డీజిల్‌ ఎంత అవసరమో.. ఎలక్ట్రిక్‌ వాహనాలకు ఛార్జింగ్‌ అంత అవసరం. మీ ఎలక్ట్రిక్‌ వాహనం ఏదైనా సరే ఛార్జింగ్‌ లేనిదే బయటకు వెళ్లలేరు. ఇందుకోసం ఛార్జింగ్‌ స్టేషన్లు ఉంటాయి. కానీ మీ ఎలక్ట్రిక్‌ కారు లేదా స్కూటర్‌ బ్యాటరీ ఫుల్‌గా ఛార్జ్‌ అవ్వాలంటే కనీసం గంట సేపైనా ఛార్జింగ్‌(EV's Charging) పెట్టాల్సిందే. అప్పటిదాగా మీరు వెయిట్‌ చేయాల్సిందే..

Wireless-Charging-Roads

కానీ ఆ అవసరం లేకుండా మీరు వెళ్తున్న రోడ్డుపైనే ఛార్జింగ్‌ సదుపాయం ఉంటే.. మీరు మీ ఎలక్ట్రిక్‌ కారులో వెళ్తున్నంత సేపూ మీ కారుకు ఛార్జింగ్ అవుతూ ఉంటే.. ఊహించడానికే అద్భుతంగా ఉంది కదా.. అయితే తాజాగా అలాంటి అద్భుతమైన ఆవిష్కరణే ఒకటి అమెరికాలో జరిగింది. మిచిగాన్‌లోని డెట్రాయిట్‌(Detroit) నగరంలో మొట్టమొదటి వైర్‌లెస్‌ ఎలక్ట్రిక్‌ రోడ్‌ను నిర్మించారు. ఇది ప్రపంచంలోనే ఈవీ టెక్నాలజీలో కీలకమైన మైలురాయిగా చెప్పుకోవచ్చు.

డెట్రాయిట్‌లో అందుబాటులోకి వచ్చిన ఈ వైర్‌లెస్‌ ఎలక్ట్రిక్‌ రోడ్‌(Wireless Electric Road) ద్వారా.. ఈ రోడ్డుపై ఎలక్ట్రిక్‌ వాహనాలు కదులుతున్నప్పుడు వాటికి శక్తి సరఫరా అవుతుంది. ఇలాంటి సరికొత్త టెక్నాలజీతో ఈ ఎలక్ట్రిక్‌ వైర్‌లెస్‌ స్ట్రీట్‌ను రూపొందించారు. ఈ ఆవిష్కరణతో.. ప్రపంచ వ్యాప్తంగా ఇలాంటి వైర్‌లెస్‌ ఎలక్ట్రిక్‌ రోడ్లు అందుబాటులోకి వస్తే ఫ్యూయెల్‌తో నడిచే వాహనాలు కనుమరుగవుతాయని ఆటో నిపుణులు భావిస్తున్నారు.

Wireless-Charging-Roads

ఈ ఎలక్ట్రిక్‌ వైర్‌లెస్‌ రోడ్ల ఉపరితలం కింద విద్యుదయస్కాంత(Electromagnetic Coils) కాయిల్స్‌ను అమర్చారు. ఈ కాయిల్స్ ఎలక్ట్రిక్ వాహనాలను నేరుగా ఛార్జ్ చేయగల అధునాతన వ్యవస్థను కలిగి ఉంటాయి. తద్వారా ఈవీలు ఈ రోడ్డుపై వెళ్తున్నప్పుడు ప్రత్యేక రిసీవర్ ఉన్న వాహన బ్యాటరీ ఛార్జ్ అవుతుంది. దీని ద్వారా వాహనదారులు ఛార్జింగ్ స్టేషన్ల కోసం వెతకాల్సిన అవసరం ఉండదు.

ఈ సరికొత్త టెక్నాలజీ ద్వారా మార్గమధ్యలో బ్యాటరీ ఛార్జింగ్‌(Detroit Wireless Electric Road) అయిపోతుందమేనని వాహనదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వాహనదారులు నిశ్చింతగా ఎక్కువ దూరం ప్రయాణించేలా ఈ ఎలక్ట్రిక్‌ వైర్‌లెస్‌ స్ట్రీట్లను నిర్మించారు. అయితే వీటి ద్వారా ఛార్జింగ్‌ సమస్య పరిష్కారం అయినప్పటికీ ఇందులోనూ కొన్ని సవాళ్లు ఉన్నాయి. వాటిలో ప్రధానమైనది ఖర్చు.

అమెరికాలో డెట్రాయిట్‌లో ప్రవేశపెట్టిన ఈ ఎలక్ట్రిక్‌ వైర్‌లెస్‌ స్ట్రీట్‌ రోడ్‌ నిర్మాణానికి అయిన మొత్తం ఖర్చు దాదారు 2 మిలియన్‌ డాలర్లు. భారత కరెన్సీలో దీని విలువ రూ.16,60,54,000. ఏదేమైనా ఈ సరికొత్త ప్రాజెక్ట్ ద్వారా మిచిగాన్‌ నగరం.. భవిష్యత్తు లక్ష్యాలకు ఆదర్శంగా నిలుస్తుంది. 2050 నాటికి కార్బన్ న్యూట్రాలిటీని సాధించడమే ఈ వైర్‌లెస్ ఎలక్ట్రిక్ రోడ్డు ప్రధాన లక్ష్యం.

మిచిగాన్‌ నగరంలో ప్రవేశపెట్టిన ఈ వైర్‌లెస్‌ ఎలక్ట్రిక్‌ రోడ్డు ద్వారా.. భవిష్యత్తు మరింత ఆశాజనకంగా కనిపిస్తుందనే చెప్పవచ్చు. పర్యావరణానికి అనుకూలంగా కర్బన ఉద్గారాలను నియంత్రించడమే లక్ష్యంగా దేశాలు కృషిచేస్తున్నాయి. అందులో కీలకమైనది ఎలక్ట్రిక్‌ వాహన రంగం. ఈవీలనే ఐసీఈ వాహనాలకు ప్రత్యామ్నాయంగా భావిస్తున్నారు. అయితే ఇందులో వాహనదారులకు ఎక్కువగా గందరగోళానికి గురిచేసేది ఛార్జింగ్‌ సమస్య. ఈ టెక్నాలజీ ద్వారా వాహనదారులకు ఈ సమస్య నుంచి శాశ్వత పరిష్కారం లభిస్తుంది.

More from DriveSpark

Article Published On: Wednesday, February 7, 2024, 11:59 [IST]
English summary
Wireless charging roads in detroit where electric vehicles never need to plug in
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+