800 కి.మీ రేంజ్‌తో రానున్న షియోమీ కారు.. ఇక ఆ కంపెనీలు ఇండియాలో గేట్లు మూసుకోవాల్సిందే!!

భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో అధిక భాగాన్ని ఆక్రమించుకున్న చైనా టెక్ దిగ్గజం షియోమీ దేశ ఎలక్ట్రిక్ కార్ల రంగంపై కన్నేసింది. భారతదేశంలో దశాబ్ద సంవత్సరాలు అగ్రగామిగా ఉన్న ఈ సంస్థ ఇప్పుడు ఆటోమోబైల్‌ రంగంలోనికి అడుగుపెట్టింది. ఆ సంస్థ భారత్‌లో 10 సంవత్సరాల కార్యకలాపాలను పురస్కరించుకుని జరిగిన ఓ కార్యక్రమంలో షియోమీ ఎస్‌యూవీ7 కారుని దేశంలో మొదటిసారి ప్రదర్శించింది. షియోమీ ఎస్‌యూ7 (Xiaomi SU7) అనేది ఆల్-ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ సెడాన్ మరియు కంపెనీ మొట్టమొదటి కారుగా ఉంది.

ఇది ఈ సంవత్సరం మార్చిలో చైనా మార్కెట్‌లో ఇప్పటికే లాంచ్ అయింది. తాజాగా భారతీయ మార్కెట్‌పై దృష్టి సారించింది. భారతీయ ఈవీ స్పేస్‌లోకి ఈ కారు త్వరలోనే అందుబాటులోకి రానుంది. తాజాగా షియోమీ ఎస్‌యూ7ను ప్రదర్శించడం ద్వారా సరికొత్త రికార్డుని నెలకొల్పేందుకు సిద్ధంగా ఉంది. ఈ కారు ప్రదర్శనతో దేశంలోని ఇతర శక్తివంతమైన కార్ల కంపెనీలకు ఈ సరికొత్త ఎలక్ట్రిక్ కారు పలు సవాళ్లను విసురుతుంది.

Xiaomi-SU7-Showcased-In-India

ఈ కారుని స్పీడ్ అల్ట్రా అని కూడా పిలుస్తున్నారు. షియోమీ ఎస్‌యూ7 చైనా టెక్నాలజీ దిగ్గజం నుంచి వచ్చిన మొదటి కారుగా వచ్చింది. ఈ ప్రాజెక్టులో కంపెనీ సుమారు 10 బిలియన్ డాలర్లను పెట్టుబడిగా పెట్టింది. చైనాలో ఈ లగ్జరీ ఎలక్ట్రిక్ సెడాన్ డెలివరీలు ఈ ఏడాది మార్చి నుండి ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఈ కారును ప్రవేశపెట్టిన అతి తక్కువ కాలంలోనే 70,000కు పైగా బుకింగ్స్ ను సొంతం చేసుకున్న షియోమీ ఈ ఏడాది చివరి నాటికి 1,00,000 డెలివరీలను లక్ష్యంగా పెట్టుకుంది.

30,000 డాలర్లు (సుమారు రూ.25 లక్షలు) ధర కలిగిన షియోమీ ఎస్‌యూ7 దేశంలో అత్యంత సరసమైన టెస్లా మోడల్ 3 కంటే సుమారు 4,000 డాలర్ల (రూ. 3.3 లక్షల) కంటే చౌకగా లభిస్తుంది. ఇక ఈ కారులోని ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, అనేక విదేశీ కార్ల తయారీదారులు ఇక్కడ పట్టు సాధించాలని చూస్తున్న సమయంలో భారతదేశంలో షియోమి ఎస్‌యూ7 ప్రదర్శనకు వచ్చింది.

Xiaomi-SU7-Showcased-Price-And-Details

షియోమీ ఎస్‌యూ7 మ్యాక్స్ పెర్ఫార్మెన్స్ వేరియంట్‌లో 101 కిలోవాట్ల బ్యాటరీ, 800 కిలోమీటర్ల (సీఎల్‌టీసీ) పరిధి ఉంటుంది. ఈ మోడల్ 663 bhp పవర్ మరియు 838 nm టార్క్ ను ఉత్పత్తి చేసే డ్యూయల్-మోటార్ సిస్టమ్‌ని కలిగి ఉంది. దీని గరిష్ట వేగం గంటకు 265 కిలోమీటర్లు. ఇది కేవలం 10.67 సెకన్లలో గంటకు 0 నుంచి 200 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.

చైనాకు చెందిన బీవైడీ, వియత్నాంకు చెందిన విన్‌ఫాస్ట్ వంటి కంపెనీలు భారత ఈవీలో వాటాను దక్కించుకోవాలని చూస్తున్నాయి. ఇప్పటికే భారతదేశంలో అమ్మకానికి ఉన్న బీవైడీ సీల్ ఈవీకి షియోమీ ఎస్‌యూ7 గట్టి పోటీ ఇవ్వనుంది. షియోమీ ఎస్‌యూ7 పొడవు 4,997 మీమీ, వెడల్పు 1,963 మీమీ, ఎత్తు 1,455 మీమీ, వీల్ బేస్ 3,000 మీమీని కలిగి ఉంది.

Xiaomi-SU7-Showcased

ఈ ఎలక్ట్రిక్ సెడాన్ 105 లీటర్ల కెపాసిటీని కలిగి ఉండగా, బూట్ స్పేస్‌లో 517 లీటర్ల స్టోరేజ్ కెపాసిటీని కలిగి ఉంది. ఈ షియోమీ ఎస్‌యూ7 ఎలక్ట్రిక్ సెడాన్ చైనా మార్కెట్లో రెండు వేరియంట్లలో లభిస్తుంది. షియోమీ ఎస్‌యూ7 ఒక వెర్షన్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 668 కిలోమీటర్ల డ్రైవింగ్ పరిధిని అందిస్తుంది. మరొకటి పూర్తిగా ఛార్జ్ చేసిన బ్యాటరీపై 800 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది.

ఈ ఎస్‌యూ7 బైవైడీ సీల్, హ్యుందాయ్‌కి చెందిన అయోనిక్ 5, కియాకు చెందిన ఈవీ6 మోడళ్లకు గట్టి పోటీ ఇవ్వనుంది. యుఎస్ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా ఇంకా భారత్‌లో తన ప్రవేశంపై ఇంకా ఎటువంటి ప్రకటన తెలియజేయలేదు. ఆ లోపు భారత్‌లో షియోమీ తన పాదముద్రను భారత్‌లో వేయనుంది. ఈ ఎస్‌యూ 7 పోర్శే టేకాన్ ఎలక్ట్రిక్ కారును దగ్గరగా పోలి ఉంటుంది.

More from DriveSpark

Article Published On: Tuesday, July 9, 2024, 15:12 [IST]
English summary
Xiaomi su7 electric sports sedan showcased in very soon debut in indian market
Read more on: #electric vehicles #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+