టెస్లా, బీవైడీలకు పోటీగా Xiaomi SU7 ఎలక్ట్రిక్‌ కారు లాంచ్‌.. 810 కి.మీ రేంజ్‌

చైనీస్ టెక్ దిగ్గజం Xiaomi తన తొలి ఎలక్ట్రిక్ కారు SU7 లాంచ్‌తో అధికారికంగా ఎలక్ట్రిక్ వెహికల్ (EV) మార్కెట్లోకి ప్రవేశించింది. గురువారం Xiaomi SU7ని సంస్థ విడుదల చేసింది. టెస్లా మరియు BYD వంటి టాప్‌ కంపెనీల మోడళ్లకు గట్టిపోటీగా Xiaomi ఈ ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీని విడుదల చేసింది.

2,15,900 యువాన్లు అంటే భారత కరెన్సీలో రూ. 24.90 లక్షలతో ఈ చైనీస్‌ టెక్‌ దిగ్గజం Xiaomi SU7 ను లాంచ్‌ చేసింది. వేరియంట్లను ధరలు మారుతుంటాయి. ఈవీ డెలివరీలు త్వరలో ప్రారంభమవుతాయని కంపెనీ వెల్లడించింది. చైనా అంతటా వివిధ షోరూమ్‌లలో Xiaomi SU7 అందుబాటులో ఉంటుంది.

Xiaomi-SU7-Launch

Xiaomi SU7 నాలుగు వేరియంట్‌లలో సంస్థ ప్రవేశపెట్టింది. ఎంట్రీ-లెవెల్ వెర్షన్, ప్రో వేరియంట్, మ్యాక్స్ వెర్షన్ మరియు లిమిటెడ్ ఫౌండర్స్ ఎడిషన్‌లలో కస్టమర్లు కొనుగోలు చేయవచ్చు. సొగసైన నాలుగు-డోర్ల సెడాన్ డిజైన్‌తో ఆకర్షణీయంగా ఉంటుంది. 4,997 mm పొడవు, 1,963 mm వెడల్పు మరియు 1,455 mm ఎత్తుతో ఉంటుంది. 3,000 mm వీల్‌బేస్ మరియు 19-అంగుళాల మిచెలిన్ అల్లాయ్ వీల్స్‌ను కలిగి ఉంటుంది.

ఫీచర్ల విషయానికొస్తే Xiaomi SU7 మోడల్ 16-అంగుళాల పెద్ద ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్‌ను కలిగి ఉంది. పూర్తి డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే మరియు 2 Xiaomi Pad 6S Pro టాబ్లెట్‌లను కలిగి ఉంది. స్టాండర్డ్‌ 50W వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్‌ను అందిస్తుంది.

Xiaomi-SU7-Launch

ల్యాప్‌టాప్‌ను ఉంచగలిగే పెద్ద గ్లోవ్ బాక్స్, యాంటీ-వోబుల్ మ్యాట్‌తో కూడిన 4.6 లీటర్ రిఫ్రిజిరేటర్, అండర్ సీట్ గొడుగు హోల్డర్, గ్లాస్ రూఫ్ మరియు 25-స్పీకర్ ఆడియో సిస్టమ్ వంటివి ఉన్నాయి. వాహనం యాక్టివ్ సీట్ బోల్‌స్టరింగ్ మరియు పనోరమిక్ గ్లాస్ రూఫ్‌ను కూడా పొందుతుంది.

Xiaomi SU7 పనితీరుపై లాంచ్‌ ఈవెంట్‌లో సంస్థ ఆసక్తికర విషయాలు వెల్లడించింది. టాప్-ఎండ్ మ్యాక్స్ వేరియంట్ గంటకు గరిష్ఠంగా 265 కి.మీ వేగంతో ప్రయాణిస్తుంది. ఈ కారు కేవలం 2.78 సెకన్లలో 0 నుంచి 100 kmph నుండి వేగాన్ని అందుకుంటుంది. ఇక పూర్తి ఛార్జింగ్‌పై 810 కి.మీ వరకు రేంజ్‌ను ఇస్తుంది.

Xiaomi-SU7-Launch

Xiaomi SU7 లో డ్యూయల్-మోటార్, ఫోర్-వీల్-డ్రైవ్ పవర్‌ట్రెయిన్‌ను ఉపయోగించారు. కాగా లిమిటెడ్‌ ఫౌండర్స్ ఎడిషన్(Xiaomi SU7 Limited Founders Edition) దాదాపు 986 bhp శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇది కేవలం 1.98 సెకన్లలో 0 నుంచి 100 కి.మీ వేగంతో దూసుకుపోతుంది.

Xiaomi SU7 రెండు బ్యాటరీ ప్యాక్‌లలో అందుబాటులో ఉంటుంది. ఇందుకోసం సంస్థ CATLతో భాగస్వామ్యాన్ని కలిగి ఉంది. కాగా ఎంట్రీ-లెవెల్ వేరియంట్‌లో 73.6 kWh ప్యాక్ మరియు టాప్-ఆఫ్-ది-లైన్ మోడల్ కోసం పెద్ద 101 kWh ప్యాక్‌ను ఉపయోగించారు. ఈ బ్యాటరీలు ఒక్కసారి ఛార్జ్ చేస్తే కనీసం 700 కిమీల పరిధిని అందించగలవని సంస్థ చెబుతోంది.

Xiaomi-SU7-Launch

కాగా అదనంగా Xiaomi SU7 లో 150 kWh బ్యాటరీ ప్యాక్‌ను వచ్చే ఏడాది పరిచయం చేయాలని సంస్థ యోచిస్తోంది. ఈ బ్యాటరీ ప్యాక్‌ రేంజ్‌ పూర్తి ఛార్జ్‌పై గరిష్ఠంగా 1,200 కి.మీ ఉండే అవకాశం ఉంది. Xiaomi SU7 అల్ట్రా ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ను ఇస్తుంది.

Xiaomi-SU7-Launch

కేవలం 15 నిమిషాల ఛార్జింగ్‌తో Xiaomi SU7 EV వరుసగా 350 కి.మీలు మరియు 510 కి.మీలు రేంజ్‌తో ప్రయాణిస్తాయని సంస్థ చెబుతోంది. దీని ద్వారా యజమానుల అవసరాలు ఏ ఆటంకం లేకుండా తీరుతాయని షియామీ వెల్లడించింది. మారుతున్న అవసరాలు, టెక్నాలజీకి అనుగుణంగా దీనిని ప్రవేశపెట్టినట్లు పేర్కొంది.

More from DriveSpark

Article Published On: Friday, March 29, 2024, 10:46 [IST]
English summary
Xiaomi su7 launched at rs 24 90 lakhs features battery range specs details here
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+