టాప్ లేని త్రీవీలర్.. ఆటో మాత్రం కాదు.. స్కూటర్ లాంటి డ్రైవింగ్.. వికలాంగుల కోసమే ఈ సూపర్ వెహికల్..

వికలాంగులు సాధారణ వాహనాల్లో ప్రయాణం చేయడానికి చాలా ఇబ్బంది పడుతుంటారు. వారి కోసం ఇప్పటికే మార్కెట్లో కొన్ని వాహనాలు అందుబాటులో ఉన్నాయి. అయితే తాజాగా వికలాంగుల కోసం ఒక కొత్త వాహనం ఇటీవల మార్కెట్లో రాగా, చాలా మంది దీన్ని వాడుతున్నారు. ఇది చూడటానికి ఒక ఆటో మాదిరిగా కనిపిస్తుంది. కానీ ఆటో మాత్రం కాదు. వికలాంగుల కోసం ప్రత్యేకమైన సౌకర్యాలను కలిగి ఉంది. దీనిలో అందించిన ఫీచర్లను కూడా చాలా సులభంగా రిమోట్ మోడ్ ద్వారా యాక్సెస్ చేయవచ్చు. అధునాతన సదుపాయాలతో కూడిన ఈ వాహనం ఎలక్ట్రిక్ వెర్ష‌న్‌లో (Electric Version) లభిస్తుంది.

ఈ ప్రత్యేక వెహికల్‌ను తమిళనాడుకు చెందిన యాలీ మొబిలిటీ అనే సంస్థ తీసుకువచ్చింది. ఇది మద్రాస్ ఐఐటీ ఇన్‌స్టిట్యూట్ ఉంది. వికలాంగులు తమ ప్రయాణాలకు ఇబ్బంది పడుతున్న దృష్ట్యా సొంతంగా తమకు తాముగానే ఒంటరిగా డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళడానికి చాలా అనువుగా ఉండే ఈ వాహనాన్ని సంస్థ తీసుకువచ్చింది.

Yali Mobility Transportation Vehicle

వీల్‌ చైర్ నుంచే నేరుగా వాహనం లోపలికి వెళ్లచ్చు. సాధారణంగా సైడ్ నుంచి ఎంట్రీ ఉండటం అందరికి తెలిసిందే. కానీ ఈ వాహనం లోపలికి ఎంట్రీ వెనుక నుంచి ఉంటుంది. మూడు చక్రాలతో కూడిన ఈ వాహనంలో సైడ్‌కు ఎలాంటి డోర్లు ఉండవు. వెనుక ఉన్న డోర్‌ను రిమోట్ మోడ్ ద్వారా అన్‌లాక్ చేసి ఓపెన్ చేయవచ్చు. ఆ తర్వాత వాహనం కొంత క్రింది దిగుతుంది.

వెనక డోర్ రోడ్డుకు సమానంగా వస్తుంది. దీంతో వీల్ చైర్‌తో సులభంగా నేరుగా హ్యాండిల్ దగ్గరికి వెళ్లవచ్చు. వికలాంగులు సులువుగా ఎక్కేందుకు అనువుగా ఉండటంతో పాటు దిగేందుకు కూడా ఈజీగా ఉంటుంది. చక్రాల కుర్చీని ఇతర వాహనాల్లో ఎత్తి లోపల పెట్టాల్సి ఉంటుంది. కొన్నింటిలో అయితే వీటిని పెట్టడానికి సరిపడినంత స్థలం ఉండదు. కానీ ఈ మూడు చక్రాల వాహనంలో మాత్రం చక్రాల కుర్చీని పైకెత్తి పెట్టాల్సిన అవసరం లేదు.

Vehicle For Wheelchair Users

ఈ కొత్త వాహనంలో మాత్రం చక్రాల కుర్చీని పెట్టడానికి సరిపోయేంత స్థలం ఉంటుంది. ఇక, దీని డ్రైవింగ్ విషయానికి వస్తే, స్కూటర్ లాగా నడపచ్చు. గేర్‌లను కూడా మాన్యువల్‌గా మార్చాల్సిన అవసరం ఉండదు. స్కూటర్ ఏ విధంగా డ్రైవింగ్ చేస్తారో అచ్చం దాని మాదిరిగానే చాలా ఈజీగా రైడింగ్ చేయడానికి కంఫర్ట్‌గా ఉంటుంది. ఇప్పటికే కొంతమంది వికలాంగులు ఈ వాహనాన్ని వాడుతున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు కూడా కనిపించాయి.

ఈ మూడు చక్రాల వాహనం పనితీరు విషయానికి వస్తే దీనిలో అమర్చిన బ్యాటరీని ఒక్కసారి ఛార్జింగ్ చేసినట్లయితే ఏకంగా 130 కి.మీల వరకు ప్రయాణిస్తుంది. ఎలక్ట్రిక్ మోటార్ గురించిన వివరాలు మాత్రం సంస్థ వెల్లడించలేదు. మార్కెట్ వర్గాల ప్రకారం, శక్తివంతమైన మోటార్‌ను ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. ఈ వాహనం టాప్ స్పీడ్ గంటకు 60 కిమీ కంటే తక్కువగా ఉంటుందని సమాచారం.

Yali Transportation Vehicle For Wheelchair Users

ఈ వాహనంలో సురక్షితమైన ప్రయాణం కోసం డిస్క్ బ్రేక్‌ను అందించారు. అవసరం ఉన్నచోట నిలిపివేయడానికి హ్యాండ్ బ్రేక్ సిస్టమ్ ప్రత్యేకంగా ఉంటుంది. దీంతో వాహనం ఎటు కదలకుండా నిలిచిపోతుంది. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు అన్నింటిని ఈజీగా యాక్సెస్ చేయడానికి స్మార్ట్ ఫీచర్లు ఉన్నాయి. గేర్లను మార్చాల్సిన అవసరం లేకుండా ఒక సాధారణ స్కూటర్‌లాగా ఈజీగా డ్రైవింగ్ చేయచ్చు.

వికలాంగుల కోసం ఎంతో ప్రత్యేకంగా రూపొందిన ఈ వాహనం ఎలా పనిచేస్తుందో తెలిపే వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. తమిళనాడుకు చెందిన యాలీ మొబిలిటీ సంస్థ దీని పనితీరు, ఫీచర్ల యాక్సెస్, డ్రైవింగ్ విధానాన్ని క్లుప్తంగా వివరించింది.

More from DriveSpark

Article Published On: Tuesday, December 24, 2024, 13:25 [IST]
English summary
Yali mobility developed transportation vehicle for wheelchair users
Read more on: #auto #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+