రేట్ పెరగక ముందే ఈవీ కారు కొనండి.. ఇప్పుడు రూ.2 లక్షల వరకు ఆదా అయ్యే అవకాశం..

ఈ ఏడాది ఇండియాలో ఎలక్ట్రిక్ వాహనాల హావా కొనసాగింది. జనవరి ప్రారంభం నుంచి డిసెంబర్ నెల వరకు కూడా తయారీ కంపెనీలు పలు మోడళ్లను లాంచ్ చేశాయి. ఇవన్నీ కూడా ఇప్పుడు వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా ఈవీ కార్లకు ఇటీవల బాగా డిమాండ్ పెరుగుతుంది. కొత్త కార్లను కొనుగోలు చేయాలని ఆలోచన చేస్తున్నవారు మొదట ఈవీల వైపు మొగ్గుచూపుతున్నారు. దసరా, దీపావళి సమయంలో ఎలక్ట్రిక్ కార్లు అధికంగా విక్రయాలను నమోదు చేయగా, ఆ తరువాత నవంబర్‌లో కొంత వరకు తగ్గిపోయాయి. ఒకసారి డేటాను పరిశీలించినట్లయితే 2024 అక్టోబర్ నెలలో 11,165 యూనిట్లు అమ్ముడుపోగా, నవంబర్‌లో 8,596 యూనిట్ల అమ్మకాలు నమోదు అయ్యాయి. ఈ నెలలో ఎలాంటి ఆఫర్లు లేకపోవడం వలన విక్రయాలు తగ్గినట్లు మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. అదే అక్టోబర్‌లో దేశం అంతా పండుగ సీజన్ నడిచింది.

ఈ సమయంలో తయారీదారులు తమ కార్లపై పలు డిస్కౌంట్స్, క్యాష్‌బ్యాక్‌లు ఇవ్వడం కారణంగా అమ్మకాల సంఖ్య ఎక్కువగా నమోదైంది. అయితే నవంబర్‌లో తగ్గినప్పటికి దీనిని భర్తీ చేయడానికి ఇయర్ ఎండ్‌లో భాగంగా డిసెంబర్ నెలలో కంపెనీలు తమ స్టాక్‌ను క్లియర్ చేయడానికి పెద్ద మొత్తంలో తగ్గింపులు అందిస్తున్నాయి. కస్టమర్లు ఆఫర్లకు అట్రాక్ట్ అయి కొత్త ఈవీ కార్లను కొనుగోలు చేస్తారని అంచనా. దీంతో కంపెనీల అమ్మకాల సంఖ్య మరింత పెరుగుతుంది.

2024 Year End Offers On Cars

భారత్‌లో దిగ్గజ కార్ల తయారీ కంపెనీలుగా ఉన్నటువంటి సంస్థల నుంచి మొదలుకుని చిన్నవి సైతం ఇయర్ ఎండ్ తగ్గింపులను అందిస్తున్నాయి. అదనంగా డీలర్లు కూడా షోరూమ్‌లో ఉన్న స్టాక్‌ను వీలైనంత వరకు తగ్గించుకోడానికి ఈ నెలలో అన్ని మోడళ్లపై ఆకర్షణీయమైన ప్రయోజనాలను, తగ్గింపులను అందిస్తున్నారు. కొత్త ఈవీ కారు కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది మంచి అవకాశం. ఏఏ కార్లపై ఎంత వరకు తగ్గింపు ఉందో క్రింది కథనంలో తెలుసుకుందాం.

కొత్త ఏడాదికి ముందు డిసెంబర్ 2024లో MG మోటార్ ఇండియా తన అమ్మకాలను పెంచుకోడానికి కస్టమర్లను ఆకర్షించడానికి ఎంజీ కామెట్ (MG Comet) ఈవీ కారుపై దాదాపు రూ.75,000 వరకు ఆఫర్‌లను ప్రకటించింది. అయితే ఇది కొన్ని ప్రాంతాల్లో ఏరియాను బట్టి మారుతుంది. కాబట్టి ఆఫర్‌పై కచ్చితమైన వివరాలను తెలుసుకోడానికి దగ్గరలోని డీలర్లను సంప్రదించడం ఉత్తమం. దీంతో పాటు మరిన్ని అదనపు డిసౌంట్స్ కూడా ఈ కారుపై ఉన్నాయి.

Year End Offers On Electric Cars

అలాగే, ఎంజీ ZS ఎలక్ట్రిక్ కారుపై కూడా ఇయర్ ఎండ్ తగ్గింపులు ఉన్నాయి. కంపెనీ ఈ మోడల్‌పై డిసెంబర్‌లో రూ. 1.5 లక్షల నుండి మొదలుకుని రూ. 2.25 లక్షల వరకు తగ్గింపులను ఆఫర్ చేస్తుంది. అయితే ఇటీవల కొత్తగా విడుదల చేసిన విండ్సర్ EVపై మాత్రం కంపెనీ తగ్గింపులను ఇస్తున్నట్టు పేర్కొనలేదు. ఈ తగ్గింపులన్నీ కూడా లిమిటెడ్‌ తేదీ వరకు ఉంటాయి. అందుకే ముందుగా త్వరపడటం మంచిది.

దేశీయ దిగ్గజ కంపెనీ టాటా మోటార్స్ ఈవీ మార్కెట్లో తన సత్తా చాటడానికి ఇయర్ ఎండ్ తగ్గింపు పేరుతో కార్లపై తగ్గింపులను అందించింది. టాటా తన Tigor EV , Tiago EV మోడళ్లపై ఈ డిసెంబర్ నెలలో డిస్కౌంట్స్ ఇస్తుంది. వీటిపై రూ. 1.15 లక్షల వరకు తగ్గింపులు, ప్రయోజనాలు ఉన్నాయి. అలాగే, నెక్సాన్ ఈవీపై కూడా రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు తగ్గింపు ఉంది.

టాటా మోటార్స్ తన పంచ్ EVపై రూ. 25,000ల నుంచి మొదలుకుని టాప్ వేరియంట్‌పై రూ. 70,000 వరకు తగ్గింపులను అందిస్తోంది. వీటిలో కూడా ఎక్స్ఛేంజ్ బోనస్‌లు ఉన్నాయి. మరో కంపెనీ మహీంద్రా తన ఏకైక ఎలక్ట్రిక్ SUV XUV400 కారుపై ప్రత్యేకంగా రూ.3.10 లక్షల విలువైన ప్రయోజనాలను అందిస్తుంది. అలాగే వీటితో పాటు మరిన్ని కార్లపై కూడా తగ్గింపులు ఉన్నాయి. వీటి వివరాల కోసం డీలర్లను సంప్రదించండి.

More from DriveSpark

Article Published On: Monday, December 16, 2024, 15:36 [IST]
English summary
Year end offers on best electric cars check full details
Read more on: #auto #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+