దీపావళి లోపు కార్లు కొనండి.. అలా చేస్తే చాలు ఆటోమేటిక్‌గా కంపెనీలు డిస్కౌంట్‌ ఇస్తున్నాయి!

దేశంలో రానున్న పండుగ సీజన్‌లో కార్ల అమ్మకాలు ఊపందుకోన్నాయి. ముఖ్యంగా దీపావళి పండుగ సందర్భంగా జనాలు ఎక్కువగా కార్లు కొనుగోలు చేస్తారు. అయితే ఈ పండుగ సీజన్ లోపు వాహన తయారీదారులు తమ పాత వాహనాలను స్క్రాప్ (Vehicle Scrapping) చేసి కొత్త వాటిని కొనుగోలు చేయడానికి పలు కంపెనీలు ప్రోత్సహించనున్నాయి. దీనిలో భాగంగా మీరు కొనుగోలు చేసే కొత్త వాహనాలపై 1.5-3.5 శాతం వరకు డిస్కౌంట్లను అందించనున్నారు. ఈ ప్రకారంగా మీరు రూ.25,000 వరకు డిస్కౌంట్‌ పొందే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన వివరాలపై ఓ లుక్కేద్దాం.

దేశంలో వాయు కాలుష్యం తీవ్ర స్థాయిలో పెరుగుతుంది. ముఖ్యంగా పాత వాహనాలు ఇంకా వాడుకలో ఉండటంతో కాలుష్యం స్థాయి ఎక్కువగా అవుతుంది. దీంతో పాత వాహనాల వాడకాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాలను అమలు చేస్తోంది. అందులో పాత వాహనాలను స్క్రాప్ చేసే విధానం కూడా ఉంది. దీని ద్వారా కాలుష్యాన్ని కొద్దిమేర అరికట్టవచ్చని కేంద్రం భావిస్తోంది.

Kia Seltos

ఇక భారతదేశంలో దీపావళి సమీపిస్తుండటంతో కార్ల విక్రయాలు మరింత పెరిగే అవకాశం ఉంది. అదే సమయంలో పాత వాహనాలను విక్రయించి కొత్త వాహనాలను కొనుగోలు చేసే కస్టమర్లు చాలా మంది ఉంటారు. అందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం కూడా ప్రభుత్వ కార్యకలాపాలు, ఇతర అవసరాల కోసం వాడుకలో ఉన్న పాత వాహనాలను స్థానంలో కొత్త వాహనాలను కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తోంది.

ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం ఆటోమొబైల్ తయారీదారులతో ఇప్పటికే చర్చలు జరిపింది. ఇక సాధారణ ప్రజలు కూడా వివిధ ప్యాసింజర్, లగ్జరీ కార్ల కంపెనీలు ఇప్పటికే పాత వాహనాలను స్క్రాపింగ్‌కి ఇవ్వవచ్చు. తద్వారా మీరు కొత్త వాహనం కొనుగోలుపై 1.5 శాతం నుంచి 3.5 శాతం వరకు డిస్కౌంట్లను పొందవచ్చు. ఈ లెక్కన రూ.25,000 వరకు డిస్కౌంట్ పొందే అవకాశం ఉంది.

Honda Elevate

దీనికి సంబంధించి త్వరలోనే సదరు కంపెనీలు ప్రకటనలు విడుదల చేసే అవకాశం ఉంది. ఒక్కో కంపెనీ ప్రొడక్ట్స్‌పై ఒక్కో రకమైన డిస్కౌంట్లు ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. కేంద్ర రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఈ డిస్కౌంట్లను ప్రకటించేందుకు తనదైన శైలిలో సూచనలు చేస్తున్నారు. ఈ విషయంలో ఆయన చేసిన ప్రయత్నాలు ఫలించాయి.

పాత వాహనాలను స్క్రాప్ చేసి కొత్తవి కొనుగోలు చేసే కస్టమర్లకు జీఎస్టీపై రాయితీ ఇచ్చేందుకు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చర్చలు జరుపుతున్నారు. ముఖ్యంగా వాణిజ్య వాహనాలకు ఇది భారీ ప్రయోజనం చేకూరుస్తుందని భావిస్తున్నారు. ఇప్పటికే తమ పాత వాణిజ్య వాహనాన్ని రద్దు చేసి కొత్త వాణిజ్య వాహనాన్ని కొనుగోలు చేసిన వినియోగదారులకు ఇప్పటికే చాలా వాణిజ్య వాహన డీలర్లు వివిధ రకాల డిస్కౌంట్లను అందిస్తున్నారు.

MG Astor

దేశంలో స్క్రాపింగ్ పాలసీ ప్రవేశపెట్టిన తర్వాత వాహనాలను స్క్రాపింగ్ చేసే కస్టమర్ల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. భారత్‌లో ఇప్పటి వరకు 1.2 లక్షల వాహనాలను స్క్రాప్ చేశారు. వీటిలో 61 వేల ప్రభుత్వ వాహనాలు ఉన్నాయి. ఈ వాహనాలన్నీ 15 ఏళ్లకు పైగా వినియోగంలో ఉన్నాయి. 2025 మార్చి నాటికి 90,000 ప్రభుత్వ వాహనాలను రద్దు చేయాలని కేంద్రం యోచిస్తోంది.

ప్రస్తుతం ప్రభుత్వం భారతదేశం అంతటా 60 రిజిస్టర్డ్ వెహికల్ స్క్రాపింగ్ సెంటర్లను నిర్వహిస్తుంది. 75 ఆటోమేటెడ్ టెస్టింగ్ సెంటర్లను కూడా నిర్వహిస్తోంది. ఇప్పటికే దేశంలోని 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కూడా పాత వాహనాన్ని రద్దు చేసి కొత్త వాహనాన్ని కొనుగోలు చేసే వినియోగదారులకు పన్ను రాయితీలను ప్రకటించాయి. ఇప్పటికే గడువు ముగిసి రోడ్డుపై తిరుగుతున్న 18 రాష్ట్రాల్లో పాత వాహనాలను స్క్రాప్ చేయడానికి డ్రైవ్ కూడా కొనసాగుతుంది.

More from DriveSpark

Article Published On: Wednesday, August 28, 2024, 9:00 [IST]
English summary
You will discounts on old cars scrapping check details in telugu
Read more on: #auto news #cars #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+