కేవలం రూ.3.6 లక్షలకే ఎలక్ట్రిక్ కారు!.. ఎక్కడో తెలుసా?

చైనీస్ కార్ల తయారీ సంస్థ Zhidou చైనా మార్కెట్లో 'రెయిన్‌బో మినీ' పేరుతో సరికొత్త ఎలక్ట్రిక్ కారును లాంచ్ చేసింది. ఇది చూడటానికి భారతీయ మార్కెట్లో అందుబాటులో ఉన్న ఎంజీ కామెట్ ఈవీ మాదిరిగా ఉంటుంది. మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

చైనా మార్కెట్లో విడుదలైన కొత్త 'జిడౌ రెయిన్‌బో మినీ' (Zhidou Rainbow Mini) ఎలక్ట్రిక్ కారు ధర 31900 నుంచి 43900 యువాన్స్ లేదా 4400 నుంచి 6000 డాలర్లు. అంటే భారతీయ కరెన్సీ ప్రకారం ఈ చిన్న కారు ధర రూ.3.6 నుంచి రూ.5 లక్షల వరకు ఉంటుందని సమాచారం. Zhidou అనేది చైనీస్ మార్కెట్లో అత్యధిక ప్రజాదరణ పొందిన మినీ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ.

Zhidou Rainbow Mini EV

2014లో కంపెనీ Zhidou D1 పేరుతో కారును లాంచ్ చేసింది. ఆ తరువాత Zhidou D2, Zhidou D3 పేర్లతో కూడా కార్లు లాంచ్ అయ్యాయి. ఇవి అన్నీ కూడా మూడు డోర్ల వెర్షన్స్. అక్టోబర్ 2023లో కంపెనీ మరో కొత్త మోడల్ లాంచ్ చేసినట్లు తెలిసింది. కొత్త రెయిన్‌బో మినీ ఇప్పుడు లాంచ్ అయింది. ఇది కూడా మూడు డోర్లు కలిగిన నాలుగు సీట్ల కారు.

జిడౌ రెయిన్‌బో మినీ ఎలక్ట్రిక్ కారు పరిమాణం పరంగా చిన్నగా ఉన్నప్పటికీ.. వాహన వినియోగదారులకు అనుకూలంగానే ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ కారు పొడవు 3224 మిమీ, సెడల్పు 1515 మిమీ, ఎత్తు 1630 మిమీ మరియు వీల్‌బేస్ 2100 మిమీ వరకు ఉంటుంది. ఇది పింక్, ఎల్లో, పర్పుల్, బ్రౌన్, గ్రీన్ వంటి కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. ఇవన్నీ ఆకర్షణీయంగా ఉంటాయి.

Zhidou Rainbow Mini EV

రెయిన్‌బో మినీ ఎలక్ట్రిక్ కారు డిజైన్ విషయానికి వస్తే.. ఈ ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ చూడటానికి చాలా క్యూట్‌గా కనిపిస్తుంది. ఇందులో బిగ్ డిప్పర్ హెడ్‌లైట్‌లు, కార్బన్ ఫైబర్ మిరర్స్, వై ఆకారంలో ఉండే లైట్స్, 13 ఇంచెస్ లేదా 15 ఇంచెస్ రోమన్ షీల్డ్ వీల్ హబ్‌క్యాప్‌ వంటివి గమనించవచ్చు. మొత్తం మీద డిజైన్ చూడచక్కగా ఉన్నట్లు స్పష్టం అవుతోంది.

ఇంటీరియర్ డిజైన్ కూడా చాలా అద్భుతంగా ఉంది. లోపల మొత్తం పింక్ కలర్ చూడవచ్చు. డబుల్ స్పోక్ స్టీరింగ్ వీల్, 5 ఇంచెస్ LCD ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్ మరియు 9 ఇంచెస్ సెంట్రల్ కంట్రోల్ స్క్రీన్‌తో కూడిన పింక్ బ్యాక్‌గ్రౌండ్‌తో కాక్‌పిట్ అందంగా ఉంది. మాన్యువల్ బటన్స్ సెంట్రల్ కంట్రోల్ స్క్రీన్ క్రింద ఉండటం చూడవచ్చు. మొత్తం మీదే ఇంటీరియర్ డిజైన్ కూడా ఆకర్షణీయంగా ఉంది.

Zhidou Rainbow Mini EV

రెయిన్‌బో మినీ ఎలక్ట్రిక్ కారులో మొబైల్ ఫోన్ రిమోట్ వెహికల్ కంట్రోల్, రిమోట్ వెహికల్ అన్‌లాకింగ్, రిమోట్ కార్ సెర్చ్, షెడ్యూల్డ్ ఛార్జింగ్ మరియు OTA అప్‌డేట్‌లు ఉన్నాయి. లోపల సుమారు 20 కంటే ఎక్కువ స్టోరేజ్ స్పేస్‌లు ఉన్నట్లు కంపెనీ పేర్కొంది. ఈ కారు యొక్క వెనుక సీట్లను ఫోల్డ్ చేస్తే స్టోరేజ్ వాల్యూ 1034 లీటర్ల పెరుగుతుంది. ఇది వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

రెయిన్‌బో మినీ ఎలక్ట్రిక్ కారు లిథియం ఐరన్ ఫాస్ఫేట్ బ్యాటరీ ప్యాక్‌తో జత చేయబడింది. బ్యాటరీ ప్యాక్ 9.98 కిలోవాట్, 17.18 కిలోవాట్ మరియు 17.3 కిలోవాట్ సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఇవి వరుసగా 125 కిమీ, 205 కిమీ మరియు 201 కిమీ రేంజ్ అందిస్తాయి. ఈ ఎలక్ట్రిక్ కారు 20 kW/85 Nm లేదా 30 kW/125 Nm ఎలక్ట్రిక్ మోటారు ద్వారా శక్తిని పొందుతుంది.

ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.

More from DriveSpark

Article Published On: Sunday, May 5, 2024, 9:00 [IST]
English summary
Zhidou rainbow mini ev launched price and details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+