అంత పెద్ద యాక్సిడెంట్ తర్వాత కూడా అందరూ సేఫ్.. 5 స్టార్ రేటింగ్‌కు ప్రూఫ్ ఇదిగో!
కార్ల సేఫ్టీకి సంబంధించి గ్లోబల్ ఎన్‌క్యాప్ క్రాష్ టెస్ట్ విధానాన్ని తీసుకువచ్చింది ప్రభుత్వం. కొన్ని కార్లను పరీక్షించి, అవి సేఫ్టీ పరంగా ఏ స్థాయిలో ఉన్నాయో తెలుపుతూ వాటికి రేటింగ్స్ ఇస్తూ ఉంటుంది. 5 స్టార్ రేటింగ్ సాధించడం అంటే.. ఆ కారు భద్రతాపరంగా అత్యున్నతం అని అర్థం. అయితే.. ఈ రేటింగ్స్ సాధించిన కార్లు నిజంగా ప్రయాణికులకు సేఫ్టీ అందిస్తాయా అనే విషయంలో వినియోగదారులకు చాలా సందేహాలే ఉండేవి. దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ మారుతి నుంచి 5 స్టార్ రేటింగ్ సాధించిన బ్రాండ్ న్యూ డిజైర్ కారు విషయంలోనూ ఈ సందేహాలు ఎందరికో ఉన్నాయి. పర్ఫార్మెన్స్ పరంగా ఈ కారు మంచి పేరే సొంతం చేసుకుంది.
అయితే ఇప్పుడు సేఫ్టీ విషయంలోనూ అందరి చేత ఔరా అనిపించింది. అసలేం జరిగిందంటే.. మారుతి బ్రాండ్- న్యూ డిజైర్ కారు యాక్సిడెంట్‌కు గురైన వీడియో ఒకటి ఆన్‌లైన్‌లో వైరల్ అవుతోంది. 5 స్టార్ రేటింగ్‌కు సంబంధించి జనాల్లో ఈ వీడియో మరింత అవగాహన కల్పిస్తోంది. మారుతి సుజుకి తయారీ నాణ్యత విషయంలో ఉన్న సందేహాలను కూడా ఇది కొంత తీర్చగలిగింది.

మారుతి సుజుకి డిజైర్ కారు ఓ పెద్ద ప్రమాదానికి గురైన తర్వాత తీసిన ఈ వీడియోలో.. ఈ కారు ఎంత శక్తిమంతమైనదో చెబుతూ ఓ వ్యక్తి కెమెరా వెనుక నుంచి మాట్లాడుతున్నాడు. ఈ చిన్న వీడియో క్లిప్‌లో కారు క్యాబిన్‌ను అతడు చూపెట్టాడు. అందులో ముందు ఉన్న ఎయిర్ బ్యాగ్స్ ప్రమాద సమయంలో తెరుచుకుని కనిపించాయి.
ఇదే వీడియోలో డిజైర్ కారు రియర్ భాగాన్ని కూడా చూపించారు. అందులో.. రియర్ ప్యానెల్ పూర్తిగా డ్యామేజ్ అయినట్లు కనిపిస్తోంది. వెనుక భాగంలో కుడివైపు పూర్తిగా దెబ్బతిని కనిపించింది. రియర్ విండ్ షీల్డ్ పూర్తిగా నాశనమైంది. ఈ కారు లెఫ్ట్ సైడ్ ప్రొఫైల్ కూడా ఇందులో కనిపించింది. అయితే ఈ కారు డోర్స్ ఏమాత్రం డ్యామేజ్ కాలేదు. కానీ టైరుతో సహా ఫ్రంట్ లెఫ్ట్ వీల్‌రిమ్ డ్యామేజ్ అయ్యింది.

ఆ తర్వాత కారు లెఫ్ట్ సైడ్‌ను వీడియోలో పూర్తిగా దెబ్బతిని కనిపించింది. ఈ కారులో ఫ్రంట్ బంపర్, రెండు హెడ్ లైట్లు, గ్రిల్ పూర్తిగా పాడై కనిపించాయి. ఈ కారు ఎక్స్‌టీరియర్ చుట్టూ కెమెరాలోని వ్యక్తి నడుచుకుంటూ చూపెట్టిన తర్వాత.. ఈ కారు క్యాబిన్‌లోకి జూమ్ చేశాడు. ఫ్రంట్, రియర్ ప్రొఫైల్ బయటి వైపు పూర్తిగా డ్యామేజ్ అయి కనిపించినప్పటికీ.. లోపల మాత్రం చెక్కు చెదరకుండా ఉన్నట్లు కనిపించింది.
యాక్సిడెంట్ సమయంలో ఈ కారులో ఉన్న ప్రయాణికులు అందురూ సేఫ్‌గా ఉన్నారని వీడియో తీసిన వ్యక్తి వ్యాఖ్యానించాడు. అయితే.. వీడియో తీసిన వ్యక్తి ఈ కారులో ఎందుకని ముందు రెండు ఎయిర్ బ్యాగులు మాత్రమే ఓపెన్ అయ్యాయని తన సందేహాన్ని వెలిబుచ్చాడు. నిజానికి ఈ కారు ఆరు ఎయిర్ బ్యాగులతో ఉంటుంది.
దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు.. ఇంత ఘోర ప్రమాదం జరిగినప్పుడు 6 ఎయిర్ బ్యాగులు కూడా ఓపెన్ కావాల్సింది కదా అని అభిప్రాయపడుతున్నారు. ఈ ఎయిర్ బ్యాగులు చాలా కాంప్లెక్స్ ఇంపాక్ట్ సెన్సార్లను కలిగి ఉంటాయి. ప్రమాదం జరిగిన దానికి అనుగుణంగా ఇవి స్పందిస్తాయి. ఈ వీడియోలని కారులో.. సైడ్ ఇంపాక్ట్ పెద్దగా లేని కారణంగా సైడ్ ఎయిర్‌బ్యాగ్స్, కర్టెయిన్ పని చేసి ఉండకపోవచ్చని మరికొంతమంది అభిప్రాయపడుతున్నారు.
మారుతి సుజుకి డిజైర్... అడల్ట్ అక్యుపెంట్ ప్రొటెక్షన్ విషయంలో 34 పాయింట్లకు గాను 31.24 పాయింట్లు సాధించింది. చైల్డ్ ప్రొటెక్షన్ విషయంలో 42 పాయింట్లకు గాను 39.20 పాయింట్లు సాధించింది. ఫోర్త్- జనరేషన్ డిజైర్ మోడల్ కారు అయిన ఇది మారుతి సుజుకి సంస్థ నుంచి గ్లోబల్ ఎన్‌క్యాప్ టెస్టులో 5 స్టార్ రేటింగ్ సాధించిన తొలి కారు కావడం గమనార్హం.


Click it and Unblock the Notifications








