తక్కువ ధరకే టాప్ క్లాస్ ఫీచర్స్‌తో క్రెటా కొత్త వేరియంట్స్.. డిమాండ్ పెరగకముందే షోరూమ్‌కు పరిగెత్తండి
దక్షిణ కొరియాకు చెందిన కార్ల తయారీ కంపెనీ హ్యుందాయ్ (Hyundai) ఇండియాలో చాలా కాలంగా కార్లను విక్రయిస్తుంది. ప్రతి ఏడాది అదిరిపోయే డిజైన్‌తో అత్యాధునిక ఫీచర్స్‌తో కస్టమర్లకు అనుకూలంగా ఉండే విధంగా బడ్జెట్ ధరలో కార్లను విడుదల చేస్తుంది. దేశంలో హ్యుందాయ్ కార్లు చాలా ప్రసిద్ధి చెందాయి. వాటిలో క్రెటా (Creta) మోడల్‌కు మంచి ఆదరణ ఉంది. మిడ్‌సైజ్ SUV విభాగంలో క్రెటా దేశంలో విజయవంతమైన మోడల్. దాదాపు 1.2 మిలియన్లకు పైగా కస్టమర్లు దీనిని వాడుతున్నారు. దీని ఆకట్టుకునే ప్రీమియం లుక్స్, ఫీచర్స్ కారణంగా భారతీయ కస్టమర్లలో ప్రజాదరణ పొందిన కారుగా నిలుస్తుంది. ఇంత డిమాండ్ ఉన్న మోడల్‌ను హ్యుందాయ్ కొత్తగా మరింత ఆకట్టుకునే ఫీచర్స్‌తో విడుదల చేసింది. 2025 క్రెటా కొత్త వేరియంట్‌లతో కూడా వచ్చింది. అప్‌డేట్‌లలో భాగంగా రెండు వేరియంట్‌లు SX ప్రీమియం, EX (O) ను తీసుకొచ్చింది.
వీటిలో కంపెనీ డజన్ల కొద్ది అడ్వాన్స్‌డ్ ఫీచర్స్‌ను అందించింది. ఈ రెండు వేరియంట్‌లు కూడా 1.5-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్, 1.5-లీటర్ టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజిన్‌తో మాత్రమే కొనుగోలుకు అందుబాటులో ఉన్నాయి. పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్ IVT గేర్‌బాక్స్, మాన్యువల్‌లో లభిస్తుంది. డీజిల్ వెర్షన్ విషయానికి వస్తే, మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గేర్‌బాక్స్‌లో అందుబాటులో ఉంది. SX(O) వేరియంట్ మూడు ఇతర ఇంజిన్ ఆప్షన్లో కూడా లభిస్తుంది.

SX ప్రీమియం వేరియంట్‌లో హ్యుందాయ్ వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లను, 8-వే పవర్-అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు, ప్రయాణంలో ఉన్నప్పడు మంచి మ్యూజిక్‌ను ఎంజాయ్ చేయడానికి 8-స్పీకర్ బోస్ సౌండ్ సిస్టమ్‌ను అందించింది. అలాగే, వెనుక కూర్చున్న ప్రయాణికులు కాళ్లు ముందుకు పెట్టుకోవడానికి స్కూప్-అవుట్ సీట్‌బ్యాక్, విశాలమైన స్థలం, లెదర్ సీట్లు వంటి ఫీచర్స్‌తో ఇది మరింత ప్రీమియం లుకింగ్‌ను కలిగిస్తుంది.
ఇంకా రెయిన్ సెన్సార్, వెనుక వైర్‌లెస్ ఛార్జర్ వంటి వాటిని అందించారు. అదే EX (O) వేరియంట్ విషయానికి వస్తే, ఇది EX ట్రిమ్‌లో ఉన్నవాటినే తిరిగి పొందింది. పనోరమిక్ సన్‌రూఫ్, LED రీడింగ్ లాంప్స్ మొదలగు వాటిని ఇది కలిగి ఉంది. వీటితో పాటు కంపెనీ తన అన్ని వేరియంట్లకు రెండు కొత్త కలర్స్ టైటాన్ గ్రే మ్యాట్, స్టార్రి నైట్‌ను జోడించారు.

EX (O) వేరియంట్ ధర విషయానికి వస్తే, ఇది రూ. 12.97 లక్షల నుండి లభిస్తుంది. అలాగే, 1.5-లీటర్ డీజిల్ ఆటోమెటిక్ ట్రాన్స్‌మిషన్ ధర రూ.15.96 లక్షలు. మరోవైపు SX ప్రీమియం పెట్రోల్ మాన్యువల్ వేరియంట్ ధర రూ.16.18 లక్షలు, అలాగే, IVT గేర్‌బాక్స్ ధర రూ.17.68 లక్షలు, డీజిల్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ ధర రూ.17.76 లక్షలు. ఇవన్నీ కూడా ఎక్స్ షోరూమ్ ధరలు. ఆన్‌రోడ్ మరింత ఎక్కువగా ఉంటాయి.
ప్రస్తుతం వాహన పరిశ్రమలో పోటీ ఎక్కువగా ఉంది. ఇలాంటి సమయంలో ఒక కంపెనీ నుంచి ఒక మోడల్ విడుదల అయిందంటే, దానికి పోటీగా ఇతర కంపెనీలు కొత్త మోడళ్లను దింపుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో హ్యుందాయ్ తన ప్రసిద్ధ మోడల్‌ను మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్తగా అప్‌డేట్ చేసి మార్కెట్లోకి తీసుకువచ్చి ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇవ్వడానికి సిద్దమైంది.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








