ఈ స్టైలిష్ కారుతో రోడ్డుపై వెళ్తుంటే అందరి చూపు మీ మీదే.. అదిరిపోతున్న కియా కొత్త కారు

దక్షిణ కొరియా బ్రాండ్ కియా మోటార్స్‌(Kia Motors)కు ఇండియాలో బలమైన మార్కెట్ ఉంది. ఇక్కడ అడుగుపెట్టిన అతి తక్కువ కాలంలోనే టాటా మోటార్స్, మారుతీ సుజుకీ, హ్యుందాయ్ వంటి కార్ల తయారీదారులకు పోటీ ఇచ్చే స్థాయికి ఎదిగింది. భారతీయ కస్టమర్లను తన వైపు తిప్పుకోవడానికి ఎప్పటికప్పుడు కియా లేటెస్ట్ ఫీచర్స్‌తో కూడిన కార్లను లాంచ్ చేస్తూ, తన మార్కెట్‌ను క్రమంగా పెంచుకుంటుంది. 2024లో అదిరిపోయే సరికొత్త మోడళ్లను తీసుకొచ్చిన కంపెనీ తాజాగా ఇండియాలో 2025 కియా సెల్టోస్(Seltos) భారతదేశంలోకి తీసుకొచ్చింది. అప్‌డేటెడ్‌తో వచ్చిన ఈ కారులో ఎనిమిది కొత్త వేరియంట్‌లను కంపెనీ పరిచయం చేసింది. అదనంగా పలు వేరియంట్లలో 24 ట్రిమ్‌లలో కస్టమర్లకు కొనుగోలుకు అందుబాటులో ఉంది. భారతదేశంలోని SUV లలో కియా సెల్టోస్ ఒక ప్రసిద్ధ మోడల్. దేశీయంగానే కాకుండా అంతర్జాతీయంగా దాదాపు ఆరు లక్షలకు పైగా యూనిట్లు అమ్ముడయ్యాయి.

కొత్తగా అత్యాధునిక ఫీచర్స్‌తో వచ్చిన 2025 సెల్టోస్‌తో రానున్న రోజుల్లో సేల్స్ మరింత పెరుగుతాయి. ధర విషయానికి వస్తే, కొత్త సెల్టోస్ HTE(O) బేస్ వేరియంట్ ధర రూ. 11.13 లక్షల నుంచి మొదలవుతుంది. అదే విధంగా టాప్ వేరియంట్ అయినటువంటి X-లైన్ వెర్షన్ ధర రూ. 20.50 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఇవి ఎక్స్ షోరూమ్ ధరలు. ఆన్‌రోడ్ వచ్చేసరికి పన్నులు, ఇతరత్రా వాటితో మరింత ఎక్కువగా ఉంటాయి.

2025 Kia Seltos Price

2025 సెల్టోస్‌‌లో HTE(O) వేరియంట్‌లో డజన్ల కొద్ది ఫీచర్స్ ఉన్నాయి. హాలోజన్ ప్రొజెక్టర్ హెడ్‌లైట్లు, బ్లూటూత్‌తో కూడిన 8-అంగుళాల టచ్‌స్క్రీన్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఎత్తు సర్దుబాటు చేయగల డ్రైవర్ సీట్లు, LED టెయిల్ లైట్లు, ప్రయాణంలో ఎంటర్‌టైన్‌మెంట్ కోసం 6-స్పీకర్ ఆడియో సిస్టమ్‌ను కూడా ప్రత్యేకంగా అందించారు. వెనుక కాంబి LED తో కలిపిన DRL PSTN ల్యాంప్ LED సెటప్ కూడా ఉంది.

HTK(O) వేరియంట్‌ విషయానికి వస్తే, ఇది రూ. 12.99 లక్షల నుండి ప్రారంభమవుతుంది. ఈ మోడల్ కూడా అధునాతన ఫీచర్స్‌తో వచ్చింది. 16-అంగుళాల అల్లాయ్ వీల్స్ కారుకు ఎక్స్‌టీరియర్ అందాన్ని పెంచుతాయి. పనోరమిక్ సన్‌రూఫ్, డీఫాగర్‌ ఫంక్షనల్ రియర్ వైపర్, రూఫ్ రెయిల్స్ , స్టైలిష్ ఇల్యుమినేటెడ్ పవర్ విండోస్, వైబ్రెంట్ మూడ్ లాంప్, స్మార్ట్ కీ వంటి అత్యాధునిక ఆప్షన్లు ఈ కారులో అందించారు.

2025 Kia Seltos Launched In India

HTK+(O) వేరియంట్ రూ. 14.39 లక్షల నుంచి మొదలవుతుంది. ఇది EPB IVTతో డ్రైవింగ్‌‌లో మరింత కొత్త అనుభవాన్ని అందిస్తుంది. 17-అంగుళాల అల్లాయ్ వీల్స్ కారుకు ఎక్స్‌టీరియర్ ఆకర్షణ. శక్తివంతమైన LED ఫాగ్ ల్యాంప్‌లను ఈ మోడల్లో అమర్చారు. కియా సెల్టోస్ వినియోగదారులకు డీజిల్, పెట్రోల్ వేరియంట్లతో కొనుగోలుకు లభిస్తుంది.

కస్టమర్లు తమకు నచ్చిన దాన్ని ఎంచుకోవచ్చు. HTE(O), HTK, HTK(O), HTK+(O), HTX, HTX(O) 1.5-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌లో మాన్యువల్ గేర్‌బాక్స్‌ను ఇచ్చారు. వీటి ప్రారంభ ధరలు రూ. 11,12,900 నుంచి మొదలుకుని టాప్ వేరియంట్ ధర రూ. 18,06,900 వరకు ఉన్నాయి.

అలాగే, HTK+, GTX+, GTX+ DT, X-లైన్ వంటి పెట్రోల్ 1.5 టర్బో ఇంజిన్ వేరియంట్ల ధరలు రూ.15.77 లక్షల నుంచి రూ.20.50 లక్షల వరకు ఉన్నాయి. HTE(O), HTK, HTK(O), HTK+(O), HTX, GTX+, GTX+ DT, X-లైన్ డీజిల్ కార్ల ధరలు రూ.12.70 లక్షల నుంచి రూ.20.50 లక్షల వరకు ఉంది.

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Friday, February 21, 2025, 17:50 [IST]
English summary
2025 kia seltos launched in india with new variants full details check here
Read more on: #kia motors #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+