పెద్ద ఫ్యామిలీల కోసం పర్‌ఫెక్ట్ కారు.. ఇక మీ ఇంట్లో ఖర్చులకు బైబై చెప్పేయండి!
మధ్యతరగతి వాళ్లైనా, బిలియనీర్స్ అయినా.. అందరికీ సరిపడా కార్లను అందిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దిగ్గజ వాహన తయారీ సంస్థ మారుతి సుజుకి (Maruti Suzuki). ఇప్పటికే మార్కెట్లో ఈ సంస్థ నుంచి వచ్చిన కార్లు కస్టమర్స్‌ను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అంతేగాకుండా మార్కెట్లో ఇతర వాహన తయారీ సంస్థలకు గట్టి పోటీ ఇస్తూ తగ్గేదేలే అంటోంది. ఈ సంస్థ నుంచి వచ్చిన ఆల్టో, కే10, సెలెరియో, WagonR, స్విఫ్ట్, డిజైర్, బ్రెజా, ఫ్రాంఛైజ్, బాలెనో వంటి కార్లు... దేశీయ మార్కెట్లో ఎరీనా, నెక్సా వంటి డీలర్‌షిప్‌లతో వినియోగదారులకు చేరువయ్యాయి. ప్రస్తుతం.. గ్రాండ్ విటారా ఎస్‌యూవీని 7 సీటర్ ఆప్షన్‌తో తీసుకువచ్చేందుకు సిద్ధమవుతోంది మారుతీ సంస్థ. దాని ఫీచర్లు తదితర విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం.
డిజైన్: మారుతి సుజుకి గ్రాండ్ విటారా ఎస్‌యూవీ... బయటవైపు ఆధునాతనమైన డిజైన్‌తో రానున్నట్లు తెలుస్తోంది. ఈ 7 సీటర్ కారు.. ఇ- విటారా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ తరహాలో ఉండనున్నట్లు సమచారం. అయితే.. ప్రస్తుతం రానున్న గ్రాండ్ విటారాలో హెడ్ ల్యాంప్స్, LED DRLs, LED టెయిల్ ల్యాంప్స్ వంటి సదుపాయాలతో కొత్త లైటింగ్ సెటప్‌తో ఈ కారు రానుంది.

పర్ఫార్మెన్స్: ఈ కొత్త మోడల్ ఎస్‌యూవీ 2 ఇంజిన్ ఆప్షన్స్‌తో హై ఫర్ఫామెన్స్‌తో రానుంది. వాటిల్లో ఒకటి 1.5 లీటర్ నేచురల్లీ యాస్పిరేటెడ్ పెట్రోల్ కాగా మరొకటి 1.5 లీటర్ హైబ్రిడ్ పెట్రోల్‌తో ఉండనుంది. ఈ పవర్‌టైన్స్ కారణంగా ఈ కారు మైలేజీ కూడా బాగానే ఉండనుంది. ఈ కారు ఈవీ వెర్షన్‌లోనూ వచ్చే అవకాశం ఉంది. అయితే దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.
ఫీచర్లు: ఈ మారుతి సుజుకి 7 సీటర్ మారుతీ గ్రాండ్ విటారా ఎస్‌యూవీలో అనేక అడ్వాన్స్‌డ్ ఫీచర్లతో తీసుకువస్తోంది మారుతీ సంస్థ. ప్రస్తుతం అందుబాటులో ఉన్న మోడల్‌లోని ఫీచర్లన్నీ త్వరలో రానున్న కారులోనూ ఉండనున్నాయి. 9- అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటెయిన్మెంట్ సిస్టమ్, 7 అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, పనోరమిక్ సన్ రూఫ్, యాంబియంట్ లైటింగ్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, హెడ్స్‌అప్ డిస్‌ప్లే వంటి ఫీచర్లతో ఈ కారు రానుంది.

సేఫ్టీ మాటేమిటి: సేఫ్టీ విషయంలో మారుతీ గ్రాండ్ విటారా అనేక జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్స్, ఏబీఎస్(Anti-Lock braking system), ఈబీడీ(Electronic Brakeforce Distribution), టీఎంపీఎస్(Tire Pressure Monitoring System), అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్, 360 డిగ్రీ కెమెరా వంటి సేఫ్టీ సంబంధిత ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
మారుతి సుజుకి గ్రాండ్ విటారా ధర విషయానికి వస్తే ఇది అందుబాటు ధరలోనే ఉండనున్నట్లు తెలుస్తోంది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 15 లక్షలుగా ఉండనుందని అంచనా. ఈ ఏడాది ప్రథమార్థంలో లేదా మధ్య నాటికి ఇది వినియోగదారులకు అందుబాటులోకి రానున్నట్లు సమాచారం.

ఇది ఈ సెగ్మెంట్లో ఇది హ్యూందాయ్ అల్కాజర్, ఎంజీ హెక్టార్ ప్లస్, టాటా సఫారీ వంటి కార్లకు గట్టి పోటీ ఇవ్వనుంది. దేశీయ మార్కెట్లో అట్రాక్టివ్ డిజైన్, అడ్వాన్స్‌డ్ ఫీచర్లతో గ్రాండ్ విటారాను తీసుకువచ్చి మార్కెట్లో పోటీ పెంచాలని భావిస్తోంది మారుతీ సుజుకీ సంస్థ. అయితే ఇది ఎంత మేరకు కస్టమర్స్‌ను ఆకట్టుకుంటుందనే విషయంలో మాత్రం మరికొన్ని రోజులు మనం ఎదురు చూడక తప్పదు.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








