రూ.7 లక్షల ధర.. 28.06 కి.మీల మైలేజ్.. పైగా ఫుల్ సేఫ్టీ.. ఇంతకంటే ఏం కావాలి.. టాటా టియాగో NRG కీలక వివరాలు ఇవే
ఇండియాలో ప్రయాణికుల సేఫ్టీ పరంగా అత్యున్నత నాణ్యత ప్రమాణాలతో కార్లను తయారు చేసే కంపెనీ అంటే అందరికి మొదటగా గుర్తుకు వచ్చే టాటా మోటార్స్(tata motors) మాత్రమే. రతన్ టాటా ఆశయాలకు అనుగుణంగా భారతీయ వినియోగదారుల కోసం బడ్జెట్ ధరలో అదిరిపోయే మోడళ్లను విడుదల చేస్తుంది. గత ఏడాదిలో అధునాతన ఫీచర్స్ కలిగిన కార్లను లాంచ్ చేయగా, 2025లో తన సేల్స్ పెంచుకోవాలని చూస్తుంది. దీనిలో భాగంగా తన ప్రసిద్ధ మోడల్ టియాగో ( Tiago) అప్‌డేట్ వెర్షన్ NRGను ఇటీవల విడుదల చేసింది. Tata Tiago NRGలో సాధారణ టియాగో కారుతో పోలిస్తే కొత్త ఫీచర్స్ చాలా ఉన్నాయి.
పెర్ఫామెన్స్ విషయంలో కస్టమర్లను పూర్తిగా సంతృప్తి పరుస్తుందని కంపెనీ తెలిపింది. ఎలాంటి రోడ్లపైనా కూడా సాఫీ ప్రయాణాన్ని ఇస్తుంది. కొత్తగా మంచి కారును కొనుగోలు చేయాలనే ఆలోచనలో ఉన్న వారికి ఇది బెస్ట్ ఆప్షన్ అయ్యే అవకాశం ఉంది. ఈ NRG హ్యచ్‌బ్యాక్ వెర్షన్ గురించి పూర్తి వివరాలు తెలసుకోవాలనుకునే వారు ఈ కింది కథనంలో తెలుసుకోండి.

డిజైన్: టియాగో ఎన్‌ఆర్‌జీ వెర్షన్ డిజైన్‌ను చూసినట్లయితే ఇది ప్రస్తుతం అందుబాటులో ఉన్న టియాగోను పోలి ఉంటుంది. బాడీలో కొన్ని స్వల్ప మార్పులు ఉన్నట్లు తెలుస్తుంది. మందపాటి సిల్వర్ స్కిడ్ ప్లేట్, రీడిజైన్ చేసిన బంపర్, షార్క్ ఫిన్ యాంటెన్నా, మస్క్యులర్ టెయిల్‌గేట్‌ను కలిగి ఉంది. రెండు-స్పోక్ స్టీరింగ్ వీల్‌పై టాటా లోగో అందించారు. ఎక్స్‌టీరియ్‌తో పాటు ఇంటీరియర్ కూడా అందంగా ఉంటుంది.
ఫీచర్స్: ఇది 5 సీటర్ కారు. చిన్న కుటుంబం గల వినియోగదారులకు అనుకూలంగా ఉంటుంది. సీట్లు లాంగ్ జర్నీ చేయడానికి కంఫర్ట్‌గా మెత్తగా ఉంటాయి. లోపల క్యాబిన్ కూడా మిమ్మల్ని అట్రాక్ట్ చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఫీచర్స్ బాగా నచ్చుతాయి. ఇది టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, పుష్ స్టార్ట్/స్టాప్ బటన్, వెనుక సెన్సార్లు వైపర్లు, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే, కీలెస్ ఎంట్రీ మొదలుగునవి వాటిని కలిగి ఉంది.

పవర్‌ట్రెయిన్: కొత్త టాటా టియాగో NRG హ్యాచ్‌బ్యాక్ 1.2-లీటర్ పెట్రోల్, CNG ఇంజిన్ ఆప్షన్‌ను కలిగి ఉంది. పెట్రోల్ ఇంజిన్ 86 PS హార్స్‌పవర్, 113 Nm పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అదే, 1.2-లీటర్ CNG 73 PS హార్స్‌పవర్, 95 Nm పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. లీటరుకు 19.43 నుంచి 28.06కి.మీల మైలేజీని ఇస్తుంది. వేరియంట్‌ను బట్టి 5-స్పీడ్ మాన్యువల్/5-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ను ఇంజిన్‌కు జోడించారు.
సేఫ్టీ ప్రమాణాలు: సాధారణంగా టాటా మోటార్స్ నుంచి విడుదలయ్యే కారు అత్యంత కఠిన బాడీతో తయారవుతాయి. ప్రమాదాల సమయంలో టాటా కార్లు లోపల కూర్చున్న వారికి ఎలాంటి గాయాలు కాకుండా రక్షిస్తాయి. ఇప్పుడు ఈ కొత్త దానిలో కూడా అలాంటి ప్రమాణాలు అందించారు. డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగులు, ABS (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్), ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ మొదలగునవి ఉన్నాయి.

చివరగా ధర: టాటా టియాగో NRG హ్యాచ్‌బ్యాక్ దేశీయ మార్కెట్లో మధ్యతరగతి కస్టమర్లు కొనగలిగేలా అందుబాటు ధరలోనే లభిస్తుంది. పెట్రోల్ మాన్యువల్ ఆప్షన్ ధర రూ. 7.2 లక్షలు. ఆటోమేటిక్ ధర రూ. 7.75 లక్షలు, ఇవి ఎక్స్ షోరూమ్ ధరలు. అదే CNG వేరియంట్ల ధరలు రూ. 8.2 లక్షల నుంచి మొదలై రూ. 8.75 లక్షల మధ్య(ఎక్స్-షోరూమ్) ఉంటుంది. తక్కువ ధరలో కావాలంటే ఇది బెస్ట్ ఆప్షన్.


Click it and Unblock the Notifications








