ఈ కారులో వెళ్తుంటే రాజులాగా ఫీలవుతారు.. ఇంధ్రభవనం లాంటి కారు అందుబాటు ధరలోనే!
టాటా మోటార్స్ యాజమాన్యంలో నడుస్తున్న బ్రిటిష్ లగ్జరీ కార్ల బ్రాండ్ ల్యాండ్ రోవర్ (Land Rover) గత కొన్ని సంవత్సరాలుగా ఇండియా మార్కెట్లో అమ్మకాల్లో దూసుకుపోతుంది. ముఖ్యంగా రేంజ్ రోవర్ సిరీస్‌కు సంబంధించి, దీని ప్రీమియం SUV మోడళ్లకు పెరుగుతున్న డిమాండ్, జాగ్వార్ ల్యాండ్ రోవర్ సంస్థకు మంచి ఆదాయ వనరులలో ఒకటిగా మారింది. ఈ క్రమంలో, కంపెనీ తాజాగా 2025 రేంజ్ రోవర్ ఎవోక్ ఆటోబయోగ్రఫీ (range rover evoque autobiography)ని మార్కెట్లోకి విడుదల చేసింది. అత్యున్నత నాణ్యత, అత్యాధునిక టెక్నాలజీ, స్టైలిష్ డిజైన్‌కు మారుపేరుగా నిలిచే ఈ కొత్త మోడల్, లగ్జరీ SUV మార్కెట్‌లో అత్యంత బెస్ట్ ఆప్షన్‌గా మారుతోంది.
మునుపటి ఎవోక్ మోడళ్లకు ఉన్న క్లాస్‌కి తోడు, ఆటోబయోగ్రఫీ వేరియంట్ మరింత రిఫైన్‌డ్ ఇంటీరియర్, అడ్వాన్స్‌డ్ డిజిటల్ ఫీచర్లు, స్మూత్ డ్రైవింగ్ అనుభవాన్ని కలిగించే పవర్‌ట్రెయిన్‌తో వచ్చింది. ఇది భారత వినియోగదారుల ఇష్టాలను దృష్టిలో ఉంచుకొని, లగ్జరీని ఫీలింగ్‌ని అందిస్తుంది. భారతీయ మార్కెట్లో దీని ప్రారంభ ధర వచ్చేసి రూ. 69.50 లక్షల ఎక్స్-షోరూమ్ ధర వద్ద విడుదలైంది. ప్రీమియం SUVలను కోరుకునే కస్టమర్లు ఈ మోడల్‌ను చూస్ చేసుకోవచ్చు.

రేంజ్ రోవర్ ఎవోక్ ఆటోబయోగ్రఫీ రెండు శక్తివంతమైన మైల్డ్-హైబ్రిడ్ ఇంజిన్ ఆప్షన్‌తో అందుబాటులో ఉంది. ఇది P250 పెట్రోల్ మైల్డ్-హైబ్రిడ్ ఇంజిన్‌తో రన్ అవుతుంది. 247 bhp పవర్, 365 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది డ్రైవింగ్ అనుభవాన్ని సాఫీగా మార్చుతుంది. మరో ఇంజిన్ విషయానికి వస్తే, D200 డీజిల్ మైల్డ్-హైబ్రిడ్ వేరియంట్ 201 bhp పవర్, 430 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
ధరకు అనుగుణంగా దీనిలో లగ్జరీ ఫీచర్స్‌ను అందించారు. పనోరమిక్ సన్‌రూఫ్ ఈ కారుకు మరింత అందాన్ని తీసుకొచ్చింది. దీని కాంట్రాస్ట్ రూఫ్ కలర్ ఆప్షన్ పర్సనలైజేషన్‌ను ప్రోత్సహిస్తూ, ఎక్స్‌టీరియర్ డిజైన్‌కు విశిష్టమైన వైవిధ్యాన్ని ఇస్తుంది. అదే సమయంలో, 19-అంగుళాల అల్లాయ్ వీల్స్ అందాన్ని పెంచడమే కాదు, స్థిరమైన ప్రదర్శనకు సహాయపడతాయి. కారు ముందు భాగంలో ఉండే పిక్సెల్ LED హెడ్‌లైట్లు, అందమైన డైనమిక్ టర్న్ ఇండికేటర్లతో కలసి కొత్తగా కనిపిస్తాయి.
హ్యాండ్స్-ఫ్రీ పవర్డ్ టెయిల్‌గేట్ ప్రయాణాన్ని మరింత సులభంగా మారుస్తుంది. హీటెడ్ డోర్ మిర్రర్స్ వర్షాకాలం వంటి ప్రతికూల వాతావరణాల్లో క్లియర్ విజన్‌ను అందిస్తూ, ప్రయాణాన్ని సురక్షితంగా మారుస్తాయి. రేంజ్ రోవర్ ఎవోక్ ఆటోబయోగ్రఫీ క్యాబిన్‌లో అడుగుపెడతూనే అందమైన థీమ్‌ను ప్రయాణికులను అట్రాక్ట్ చేస్తుంది. క్యాబిన్ అంతటా సహజ కాంతితో నిండేలా రూపొందించబడిన స్లైడింగ్ పనోరమిక్ రూఫ్ గాలిని వచ్చేలా చేస్తుంది. విండ్సర్ లెదర్ అప్హోల్స్టరీ సాఫ్ట్ టచ్ ఫీలింగ్‌ను కలిగిస్తుంది.
ఈ SUV ఇంటీరియర్ షాడో గ్రే యాష్ వెనీర్ కలర్ ఆప్షన్‌లో లభిస్తుంది. ఇది 11.4-అంగుళాల టచ్‌స్క్రీన్, PV ప్రో ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌కు సపోర్ట్‌ను ఇస్తుంది. ఇది మెరిడియన్ సరౌండ్ సౌండ్ సిస్టమ్‌తో ప్రీమియం సౌండ్ అనుభూతిని కూడా అందిస్తుంది. 10 కలర్స్‌లలో సర్దుబాటు చేయగల యాంబియంట్ లైటింగ్ కూడా ఈ SUVకి ప్రధాన ఆకర్షణ.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








