రాజు వచ్చేశాడు! తన చరిత్రను తానే తిరగరాయడానికి.. హీట్ క్రియేట్ చేసిన సియెర్రా ఫస్ట్ లుక్, ఫీచర్స్ ఇవే
టాటా మోటార్స్ (Tata Motors) ఎంతో ప్రతిష్ఠాత్మకంగా జరిపిన సియెర్రా బ్రాండ్ డేలో కొత్త టాటా సియెర్రా ప్రొడక్షన్-రెడీ వేరియంట్‌ను ఆవిష్కరించడం నిజంగా ఒక భావోద్వేగ క్షణంలా మారింది. ఒరిజినల్ 1991 సియెర్రా భారతీయ ఆటోమొబైల్ చరిత్రలో ఒక మైలు రాయి. ఆ ఐకానిక్ SUVను మళ్లీ పూర్తిగా కొత్త రూపంలో, కొత్త టెక్నాలజీలతో, ఆధునిక డిజైన్‌తో మన ముందుకు తీసుకురావడం టాటా కంపెనీ ఎంత ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతోందో చెప్పకనే చెబుతుంది. కొత్త యుగానికి నాంది పలుకుతున్నట్టే ఈ సరికొత్త సియెర్రా కనిపిస్తుంది. పాతది గుర్తు చేస్తూనే, నేటి యువత కోరుకునే ఫ్యూచరిస్టిక్ లుక్‌ను కూడా అందిస్తుంది. బయట నుండి చూసిన క్షణం నుంచే కొత్త సియెర్రా ఎంత క్లాసీగా, ఎంత మస్క్యులర్‌గా రూపుదిద్దుకుందో స్పష్టంగా తెలుస్తుంది.
ముందు LED డేటైమ్ రన్నింగ్ లైట్లు SUVకు ప్రత్యేకమైన విజువల్ సిగ్నేచర్‌ను ఇస్తాయి. ఇవి రాత్రివేళల్లోనే కాదు, పగళ్లలో కూడా కారు ప్రెజెన్స్‌ను రోడ్డుపై స్పష్టంగా చూపిస్తాయి. వెనుక కూడా ఇదే తరహా కనెక్ట్ చేసిన LED టెయిల్ లాంప్ స్ట్రిప్ ఉండటం దీన్ని మరింత ప్రీమియంగా నిలబెడుతుంది. టెయిల్‌గేట్ పైన పెద్ద అక్షరాలతో ఉన్న SIERRA బ్యాడ్జ్ రెండు చివర్లను కలిపినట్లుగా ఒక ఫ్రేమ్‌లా నిలబడి ప్రత్యేకతను పెంచుతుంది.

ఈ కొత్త అవతారంలో సియెర్రా మరింత శక్తివంతంగా కనిపించడానికి కారణం దాని ప్రోపోర్షన్ మాత్రమే కాదు, 19-అంగుళాల స్టైలిష్ అల్లాయ్ వీల్స్ కూడా SUVకు ఒక రగ్డ్, అడ్వెంచర్-రెడీ క్యారెక్టర్‌ను ఇస్తాయి. వీటి డిజైన్ SUV స్టాన్స్‌ను మరింత హైలైట్ చేస్తూ, రోడ్డుపై సియెర్రా ప్రెజెన్స్‌ను బలంగా నిలబెడుతుంది. అలాగే ఆల్పైన్-స్టైల్ కర్వ్డ్ రియర్ విండో, ఇది ఒరిజినల్ సియెర్రా నీట్ సిగ్నేచర్ ఎలిమెంట్.
ఆ క్లాసిక్ డిజైన్‌ను ఆధునిక టచ్‌తో మళ్లీ తీసుకురావడం ఈ SUV పాత అభిమానులకు ఒక కొత్త అనుభూతి. కొత్త సియెర్రా లోపలకి అడుగుపెడితే, అది కేవలం ఒక SUV కంటే ఎక్కువగా, సొగసైన లౌంజ్‌లోకి నడిచిన అనుభూతిని ఇస్తుంది. మెత్తటి ఇంటీరియర్ మెటీరియల్స్, భారీ క్యాబిన్ స్పేస్, ప్రీమియం టచ్‌పాయింట్లు కలిసి ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా, మరింత విలాసవంతంగా మార్చేస్తాయి.

ముఖ్యంగా ఫ్రంట్ సీట్లలో ఇచ్చిన వెంటిలేటెడ్, పవర్డ్ ఫీచర్లు నగర ప్రయాణాల్లోనూ, హైవే డ్రైవ్‌లలోనూ డ్రైవర్‌కు, కో-ప్యాసింజర్‌కు ఒక రిలాక్స్డ్ అనుభూతిని ఇస్తాయి. ఎండ ఎక్కువగా ఉన్న భారతీయ వాతావరణంలో ఇవి ఎంతగా ఉపయోగపడతాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. డ్యూయల్-జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ కూడా సియెర్రాలో ఒక పెద్ద హైలైట్. ముందు కూర్చున్న వారు, వెనుక ఉన్న వారు ఇద్దరూ తమకు అనుకూలంగా ఉష్ణోగ్రతను సెట్ చేసుకోవచ్చు.
ఇంజిన్ విషయానికి వస్తే, టాటా సియెర్రా కొత్తతనాన్ని, పనితీరును, వినియోగదారుల విభిన్న అవసరాలను దృష్టిలో పెట్టుకుని చాలా విస్తృతంగా సిద్ధం చేసింది. ముఖ్యంగా 1.5-లీటర్ TGDI టర్బో పెట్రోల్ ఇంజన్ ఈ SUVకి హృదయం లాంటిది. దాదాపు 168 bhp పవర్, 280 Nm టార్క్‌ను అందించే ఈ ఇంజన్, రోడ్డుపై మీ డ్రైవింగ్ అనుభూతిని పూర్తిగా మార్చేస్తుంది. వేగం కావాలా, కంఫర్ట్ డ్రైవ్ రెండింటినీ సమర్థవంతంగా బ్యాలెన్స్ చేస్తుంది.

అదనంగా, ఇది మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేయబడటం వల్ల డ్రైవింగ్‌ను మరింత ఎంగేజింగ్‌గా, కంట్రోల్ మీ చేతుల్లోనే ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఆస్పిరేటెడ్(NA) 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్ కూడా ఉంది. అలాగే ఎక్కువ మైలేజ్ కోరుకునే కస్టమర్ల కోసం డీజిల్ వేరియంట్‌ను కూడా టాటా మోటార్స్ అందిస్తోంది. ఈ మూడు ఇంజన్లూ మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఎంపికలతో రావడం వల్ల, ప్రతి రకమైన డ్రైవర్‌కు ఒక సరిగ్గా సరిపోయే కాంబినేషన్ దొరుకుతుంది.
ధరలను పరిగణనలోకి తీసుకుంటే, టాటా సియెర్రా సుమారు రూ. 15 లక్షల ప్రారంభ ధరతో మార్కెట్లోకి రాబోతోంది. ఈ ప్రైస్‌లో ఇంత ఆధునికమైన ఫీచర్లు, లగ్జరీ ఇంటీరియర్, భద్రతా టెక్నాలజీలు, పైగా శక్తివంతమైన ఇంజన్లు.. ఇది నిజంగా విలువకన్నా ఎక్కువ విలువను అందించే ప్యాకేజ్ అని చెప్పాలి.


Click it and Unblock the Notifications








