పాత సియెర్రా వర్సెస్ కొత్త సియెర్రా...1990 మోడల్‌కు, 2025 మోడల్‌కు ఉన్న తేడాలు ఇవే

టాటా మోటార్స్ ఐకానిక్ ఎస్‌యూవీ అయిన సియెర్రా సరికొత్త రూపంలో భారతీయ మార్కెట్‌లోకి గ్రాండ్‌గా రీ-ఎంట్రీ ఇచ్చింది. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత వచ్చిన ఈ కొత్త మోడల్ పాత సియెర్రాకు ఎలా డిఫరెంటుగా ఉంది. డిజైన్, టెక్నాలజీ, ఫీచర్లు, పెర్ఫార్మెన్స్‌లో 1990 మోడల్‌కు, 2025 మోడల్‌కు మధ్య ఉన్న ముఖ్యమైన తేడాలను ఈ వార్తలో తెలుసుకుందాం. టెక్నాలజీ పరంగా కారు ప్రపంచం ఎంత మారిందో ఈ తేడాలు చూస్తే అర్థమవుతుంది.

1. డిజైన్
పాత సియెర్రా చూడటానికి చాలా రగ్గడ్, బాక్సీ ఆకృతిలో ఉండేది. ఇది అచ్చంగా ఎస్‌యూవీలా కనిపించేది. దీని హెడ్‌లైట్లు కూడా దీర్ఘచతురస్ర ఆకారంలో ఉండేవి. కొత్త సియెర్రా డిజైన్ మరింత షార్ప్‌గా, స్లీక్‌గా మారింది. దీనికి స్లిమ్ ఎల్‌ఈడీ హెడ్‌లైట్లు, డీఆర్‌ఎల్స్ ఇచ్చారు. మొత్తంమీద కొత్త సియెర్రా పాత మోడల్ కంటే ఆధునిక లుక్‌తో చాలా ఆకర్షణీయంగా ఉంది.

2025 Tata Sierra Vs 1990 Model A Deep Dive into Key Differences

2. ఆఫ్ రోడింగ్ కెపాసిటీ
పాత సియెర్రా 4x4 కాన్ఫిగరేషన్కు, దాని ఆఫ్-రోడింగ్ సామర్థ్యాలకు చాలా ప్రసిద్ధి చెందింది. కొత్త 2025 సియెర్రాలో 4-వీల్ డ్రైవ్ (4x4) ఫీచర్‌ను చేర్చలేదు. ఎక్కువ మంది కస్టమర్లు ఆఫ్-రోడింగ్‌ను ఇష్టపడరు కాబట్టి, ఈ నిర్ణయం తీసుకున్నారు. పాత సియెర్రా ఫ్యాన్స్‌కు ఈ ఫీచర్ లేకపోవడం పెద్ద లోటు అనే చెప్పాలి.

3. ఇంజిన్, పెర్ఫార్మెన్స్
పాత సియెర్రా మొదట్లో సాధారణ డీజిల్ ఇంజిన్‌తో వచ్చేది, ఆ తర్వాత టర్బోచార్జ్‌డ్ డీజిల్ ఇంజిన్, 4x4 డ్రైవ్ ఆప్షన్‌తో అప్‌డేట్ చేశారు. కొత్త సియెర్రాలో కస్టమర్ల ఆప్షన్ కోసం మూడు పవర్‌ట్రైన్లు ఉన్నాయి.. పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిక్. ఇందులో 1.5 లీటర్ పెట్రోల్, 1.5 లీటర్ టర్బో పెట్రోల్, 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్లు, టాటా హారియర్ ఈవీ నుంచి తీసుకున్న ఎలక్ట్రిక్ పవర్‌ట్రైన్ ఉంటాయి. వీటిలో మ్యాన్యువల్, ఆటోమేటిక్ గేర్ ఆప్షన్లు కూడా ఉంటాయి.

2025 Tata Sierra Vs 1990 Model A Deep Dive into Key Differences

4. ఇంటీరియర్, టెక్నాలజీ
రెండు దశాబ్దాలలో కారు టెక్నాలజీ ఎంత మారిందో ఇంటీరియర్ చూస్తే తెలుస్తుంది. పాత సియెర్రా లోపల చాలా సాధారణంగా ఉండేది. ఇందులో అనలాగ్ డయల్స్, ఫిజికల్ కంట్రోల్స్ మాత్రమే ఉండేవి. కొత్త సియెర్రాలో అద్భుతమైన ఇంటీరియర్ డిజైన్ ఉంది. ఇందులో రెండు ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్‌లు, వెంటిలేటెడ్ సీట్లు, పూర్తి పనోరమిక్ సన్‌రూఫ్, యాంబియంట్ లైటింగ్, ప్రీమియం సౌండ్ సిస్టమ్ ఉన్నాయి. సేఫ్టీ కోసం ADAS, ఎయిర్‌బ్యాగ్స్, ఏబీఎస్, హిల్ హోల్డ్ అసిస్ట్ వంటి ప్రపంచ స్థాయి ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి.

2025 Tata Sierra Vs 1990 Model A Deep Dive into Key Differences

5. డోర్స్ సంఖ్య
పాత సియెర్రా 3-డోర్ల కారు. అంటే ముందు రెండు డోర్లు మాత్రమే ఉండేవి. వెనుక సీట్లో కూర్చునేవారు దిగడానికి లేదా ఎక్కడానికి ముందు సీటును మడత పెట్టాల్సి వచ్చేది. ఇది సుదూర ప్రయాణాలకు చాలా అసౌకర్యంగా ఉండేది. అలాగే వెనుక స్పేర్ వీల్ బయట మౌంట్ చేసి ఉండేది. కొత్త సియెర్రా మరింత ప్రాక్టికల్‌గా మారింది. వెనుక కర్వ్డ్ గ్లాస్‌ను ఉంచినా, ఇది 5 డోర్లతో వస్తుంది. దీనివల్ల ప్రయాణికులకు మరింత సౌకర్యంగా ఉంటుంది.

More from DriveSpark

Article Published On: Wednesday, November 26, 2025, 7:10 [IST]
English summary
2025 tata sierra vs 1990 model a deep dive into key differences
Read more on: #tata motors #new launches
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+