రూ.5 లక్షలకే అన్ని సౌకర్యాలున్న కారు.. ఎలక్ట్రిక్ వెర్షన్‌లో ఏకంగా 315 కి.మీలు.. సేఫ్టీకి పెట్టింది పేరు
భారత్‌లో ప్రయాణికుల సేఫ్టీ పరంగా అత్యున్నత భద్రతా ప్రమాణాలతో కార్లను విడుదల చేసే కంపెనీ అంటే మొదటగా గుర్తుకువచ్చేది టాటా మోటార్స్ (Tata Motors) మాత్రమే. అంతర్జాతీయ కంపెనీలకు ధీటుగా దేశీయ ప్రజల కోసం అధునాతన సదుపాయాలు, ఫీచర్స్‌తో కార్లను లాంచ్ చేస్తూ, దేశంలో చాలా మంది కస్టమర్లను కలిగి ఉంది. ఒక్క ఇండియాలోనే కాకుండా ఇక్కడ తయారైన కార్లను ప్రపంచమార్కెట్‌కు సైతం ఎగుమతి చేస్తూ మన దేశ సత్తాను అందరికి తెలిసేలా చేస్తుంది. ఇదిలా ఉంటే టాటా మోటార్స్ 2024 ఏడాదిలో సేల్స్ విషయంలో అదరగొట్టింది. గత సంవత్సరంలో కంపెనీ అదిరిపోయే కొత్త కార్లను విడుదల చేసి కొత్త కస్టమర్లను ఎక్కువగా సంపాదించింది. ఈ నేపథ్యంలో 2025 ఏడాదిలో కొత్త మోడళ్లను తీసుకురావడానికి సన్నాహాలు చేస్తుంది. తాజాగా కంపెనీ తన ప్రముఖ కార్ అయినటువంటి 2025 టియాగో(tiago), టియాగో ఈవీని కొత్తగా అప్‌డేట్ చేసి విడుదల చేసింది.
ఈ రెండు కార్లు అదిరిపోయే ఫీచర్లతో వచ్చాయి. పాత మోడల్ కారుకు దేశవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది. దీంతో టాటా ఈ కారును మరింత ఆధునికరించి విడుదల చేసింది. ఇది హ్యాచ్‌బ్యాక్ మోడల్. భారత దేశంలో దీనికి చాలా మంది అభిమానులు ఉన్నారు. ధర తక్కువ ఉండటంతో బడ్జెట్ ధరలో కారు కొనుగోలు చేయాలనుకునే వారు మొదటగా ఈ టియాగోను ఎంచుకుంటారు. చిన్న ఫ్యామిలీ వినియోగదారులకు అనకూలంగా ఉంటుంది.

అప్‌డేట్‌డ్ ఫీచర్స్‌తో విడుదల అయిన టాటా టియాగో ఎలక్ట్రిక్ కారులో కొత్తగా ఉన్నటువంటి గ్రిల్, హెడ్‌లైట్‌లతో పాటు LED హెడ్‌ల్యాంప్ సెటప్ ప్రత్యేకంగా ఉన్నాయి. ఈ ఈవీలో 14-అంగుళాల వీల్స్‌లో మార్పులు చేశారు. లోపల లేటెస్ట్ ఫీచర్లను జోడించారు. కొత్త ఫ్రీస్టాండింగ్ 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, యాపిల్ కార్ ప్లే, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో వంటివి ఉన్నాయి. ఈ కారు ధర రూ.8 లక్షలు(ఎక్స్ షోరూమ్)గా ఉంది.
టియాగో ఎలక్ట్రిక్ కారు రెండు బ్యాటరీ ఆప్షన్లలో లభిస్తుంది. మొదటిది 19.2 kWh. ఇది ఒక్కసారి ఛార్జ్ చేసినట్లయితే 250 కిమీల దూరం ప్రయాణిస్తుంది. అదే రెండో 24 kWh బ్యాటరీ MIDC సైకిల్‌లో 315 కిమీల దూరం వరకు వెళ్తుంది. అదే 2025 టియాగో పెట్రోల్ వేరియంట్ కూడా దాదాపు ఎలక్ట్రిక్ కారు పొందినటువంటి అప్‌డేట్స్‌ను పొందింది. దీని ధర రూ.5 లక్షల(ఎక్స్ షోరూమ్) ధరకు అందుబాటులో ఉంటుంది.
టియాగో కార్లలో క్యాబిన్ చాలా అందగా ఉంటుంది. లోపల కూర్చున్న వినియోగదారులకు థీమ్ ఆకర్షణీయంగా అనిపిస్తుంది. ప్రయాణికుల భద్రతకు సంబంధించి కూడా రెండు కార్లలో కొత్త ఫీచర్స్‌ను అందించారు. TPMS (టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్), క్రూయిజ్ కంట్రోల్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ఎయిర్ బ్యాగ్స్, వెనుక పార్కింగ్ కెమెరా, ప్రమాదంలో లోపల కూర్చున్న ప్రయాణికుల కోసం మరిన్ని సేఫ్టీ ప్రమాణాలు ఉన్నాయి.
చివరగా డ్రైవ్‌స్పార్క్ ఎం చెబుతుందంటే, ఇండియాలో ప్రయాణికుల రక్షణకు సంబంధించి అత్యంత సురక్షితమైన కార్లలో టియాగో అత్యంత సేఫ్టీ అందిస్తుంది. పాత మోడల్‌కు డిమాండ్ ఉండటం వలన కొత్త కస్టమర్లను సాధించడానికి ఏడాది ప్రారంభంలోనే కంపెనీ కొత్తగా 2025 అప్‌డేటెడ్ టియాగోను తెచ్చింది.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








