వచ్చే నెలలో కింగ్ ఈజ్ బ్యాక్! దేశవ్యాప్తంగా ఈ కారు గురించే మాట్లాడుకుంటున్నారు

కొత్త తరం రెనాల్ట్ డస్టర్ (Renault Duster) SUV రీ-ఎంట్రీకి రంగం సిద్ధమవుతోంది. ఒకప్పుడు భారత మార్కెట్‌లో కాంపాక్ట్ SUV సెగ్మెంట్‌ని షేక్ చేసిన డస్టర్, ఇప్పుడు మళ్లీ అదే మేజిక్ చేయడానికి రెడీ అవుతోంది. 2012లో తొలిసారి లాంచ్ అయిన ఈ SUV, దాదాపు పదేళ్ల పాటు అంటే 2022 వరకు భారత రోడ్లపై తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్‌బేస్‌ను సంపాదించుకుంది. స్ట్రాంగ్ బిల్డ్ క్వాలిటీ, రఫ్ అండ్ టఫ్ ఇమేజ్, డీజిల్ ఇంజిన్ పనితనం వంటి అంశాలు డస్టర్‌ను ఒక ట్రెండ్ సెట్టర్‌గా నిలబెట్టాయి. అయితే మార్కెట్ మార్పులు, పోటీ పెరగడం, మోడల్ అప్డేట్స్ ఆలస్యం కావడం వంటి కొన్ని కారణాల వల్ల క్రమంగా అమ్మకాలు తగ్గి, చివరికి ఈ కారు మార్కెట్ నుంచి తప్పుకుంది.

ఇప్పుడీ పరిస్థితి పూర్తిగా మారబోతోంది. రెనాల్ట్ మరోసారి డస్టర్ బ్రాండ్‌పై భారీ నమ్మకంతో ముందుకు వస్తోంది. జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా కొత్త తరం డస్టర్‌ను తిరిగి భారత మార్కెట్‌లో ప్రవేశపెట్టే యోచనలో కంపెనీ ఉన్నట్లు సమాచారం. ఇందుకోసం అన్ని స్థాయిల్లో సన్నాహాలు వేగంగా జరుగుతున్నాయని ఆటోమొబైల్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కొత్త డస్టర్ డిజైన్, ఫీచర్లు, టెక్నాలజీ పరంగా పూర్తిగా ఆధునికంగా ఉండబోతోందని అంచనాలు ఉన్నాయి.

2026 Renault Duster Expected Price New Design Engine Option Details

గ్లోబల్ మార్కెట్లలో ఇప్పటికే సక్సెస్ అయిన న్యూ-జెన్ డస్టర్ ప్లాట్‌ఫామ్‌ను భారత అవసరాలకు అనుగుణంగా ట్యూన్ చేసి తీసుకురావాలని రెనాల్ట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ధర విషయానికి వస్తే, కంపెనీ చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం. కొత్త డస్టర్ ధర పోటీగా ఉండబోతుందని అంచనా వేస్తున్నారు. అంచనాల ప్రకారం, దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 12 లక్షల నుంచి రూ. 18 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంది.

ఈ ధర రేంజ్‌లో లాంచ్ అయితే, మిడిల్ సైజ్ SUV సెగ్మెంట్‌లోని ప్రత్యర్థులకు గట్టి సవాల్ విసరడం ఖాయం. ముఖ్యంగా ఒకప్పుడు డస్టర్‌ను ప్రేమించిన పాత కస్టమర్లతో పాటు, కొత్త తరం SUV కొనుగోలుదారులను కూడా ఆకట్టుకునేలా ఈ మోడల్ ఉండబోతుంది. మొత్తానికి, రెనాల్ట్ డస్టర్ రీ-లాంచ్ కేవలం ఒక కారు తిరిగి రావడమే కాదు, ఒక లెజెండ్ మరోసారి భారత రోడ్లపై దూసుకెళ్లే కౌంట్‌డౌన్ ప్రారంభమైనట్టే చెప్పాలి.

2026 Renault Duster Expected Price New Design Engine Option Details

కొత్త తరం రెనాల్ట్ డస్టర్ పవర్‌ట్రెయిన్ విషయంలో కూడా కస్టమర్ల అంచనాలను మించబోతుందని సమాచారం. ఈ SUVలో శక్తివంతమైన ఇంజిన్ ఆప్షన్లను రెనాల్ట్ అందించనుందని చెబుతున్నారు. ఇందులో 1.0-లీటర్ పెట్రోల్ ఇంజిన్, 1.3-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో పాటు 1.5-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ ఎంపికలు ఉండే అవకాశం ఉంది. ట్రాన్స్‌మిషన్ పరంగా, 5-స్పీడ్ మాన్యువల్‌తో పాటు ఆటోమేటిక్, CVT గేర్‌బాక్స్ ఆప్షన్లు అందుబాటులోకి వచ్చే అవకాశముంది.

మైలేజీ విషయానికి వస్తే, కొత్త డస్టర్ గరిష్ఠంగా 24 kmpl వరకు ఇస్తుందని అంచనా వేస్తున్నారు, ఇది ఈ సెగ్మెంట్‌లో ఒక పెద్ద ప్లస్ పాయింట్‌గా నిలవనుంది. సీటింగ్ విషయంలో కస్టమర్ ఎంచుకునే వేరియంట్‌ను బట్టి 5-సీటర్ లేదా 7-సీటర్ కాన్ఫిగరేషన్‌లో ఈ SUV అందుబాటులో ఉండే అవకాశం ఉంది. దీని వల్ల చిన్న కుటుంబాల నుంచి పెద్ద కుటుంబాల వరకూ అందరికీ సరిపోయేలా డస్టర్‌ను డిజైన్ చేసినట్లు అర్థమవుతోంది.

2026 Renault Duster Expected Price New Design Engine Option Details

ఇంటీరియర్‌లో సరైన లెగ్‌రూమ్, హెడ్‌రూమ్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారని, ప్రయాణీకులు దూర ప్రయాణాల్లో కూడా అలసట లేకుండా సౌకర్యంగా ప్రయాణించగలిగేలా ఈ SUV రూపొందించబడుతుందని సమాచారం. డైమెన్షన్ల పరంగా చూస్తే, కొత్త రెనాల్ట్ డస్టర్ మరింత పెద్దదిగా, బలమైన రోడ్ ప్రెజెన్స్‌తో కనిపించనుంది. దీని పొడవు సుమారు 4,360 mm, వెడల్పు 1,822 mm, ఎత్తు 1,695 mm ఉండే అవకాశం ఉంది.

అంతేకాదు, 205 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉండటం వల్ల గుంతల రోడ్లపై, గ్రామీణ ప్రాంతాల్లో లేదా ఆఫ్-రోడ్ పరిస్థితుల్లో కూడా ఈ SUV సులభంగా నడిచేలా ఉంటుంది. 2,673 mm వీల్‌బేస్ ఉండే అవకాశం ఉండటంతో, కారులో స్థలం మరింత పెరిగి స్టెబిలిటీ కూడా మెరుగుపడనుంది. మొత్తంగా, కొత్త డస్టర్ డిజైన్, పవర్, స్పేస్, మైలేజీ అన్నీ కలిపి భారత మార్కెట్‌లో మరోసారి గట్టి ప్రభావం చూపేలా కనిపిస్తోంది.

More from DriveSpark

Article Published On: Saturday, December 27, 2025, 9:32 [IST]
English summary
2026 renault duster expected price new design engine option details
Read more on: #renault #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+