దేశానికే హాట్ ఫేవరెట్ ఎస్యూవీ.. అమ్మకాల్లో మారుతి మోడల్ జోరు..  టాప్ 10 కార్లలో థర్డ్ ప్లేస్

మారుతి సుజుకి బ్రెజ్జా ఒక పాపులర్ ఎస్యూవీగా గుర్తింపు పొందింది. కస్టమర్లు కూడా దీనిని ఇష్టపడి కొంటున్నారు. ఇటీవల దేశీయ మార్కెట్‌లో అత్యధికంగా అమ్ముడైన టాప్ 10 కార్ల అమ్మకాల నివేదిక విడుదలైంది. అందులో ఈ బ్రెజ్జా ఎస్యూవీ మూడవ స్థానాన్ని దక్కించుకుంది. మొదటి స్థానంలో హ్యుందాయ్ క్రెటా (Hyundai Creta),రెండవ స్థానంలో మారుతి సుజుకి డిజైర్ (Maruti Suzuki Dzire) ఉన్నాయి.

గత నెలలో (ఏప్రిల్ - 2025) మారుతి సుజుకి దాదాపు 16,971 యూనిట్ల బ్రెజ్జా కార్లను విక్రయించింది. అదేవిధంగా మార్చిలో 16,546 యూనిట్లు, ఫిబ్రవరిలో 15,392 యూనిట్లు, జనవరి నెలలో 14,747 యూనిట్లను విక్రయించింది.

Maruti Suzuki Brezza

ఈ గణాంకాలను పరిశీలిస్తే.. ప్రతి నెల 15,000 కంటే ఎక్కువ 'మారుతి సుజుకి బ్రెజ్జా' ఎస్యూవీలు విజయవంతంగా అమ్ముడవుతున్నాయి. ఇదే 'మే' నెలలో కూడా బ్రెజ్జా కారు అమ్మకాల సంఖ్య మరింత పెరిగి, అన్ని పాపులారిటీ పొందిన కార్లను అధిగమించి నంబర్ 1 స్థానానికి చేరుకున్నా ఆశ్చర్యం లేదు.

మారుతి సుజుకి బ్రెజ్జా అమ్మకాల సంఖ్య పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఈ కారు బడ్జెట్ ధరలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉండటం ఒక ముఖ్య కారణం. దాని ధరకు తగినట్లుగా ఊహించిన దానికంటే ఎక్కువ ఫీచర్లను కలిగి ఉంది. మెయింటెనెన్స్ ఖర్చు కూడా పెద్దగా ఉండదు. అలాగే, ఏ బైక్‌కు తీసిపోని విధంగా మైలేజ్ ఇస్తుంది. ఈ అంశాలన్నింటి వల్ల బ్రెజ్జా అమ్మకాల సంఖ్య పెరిగిందని విశ్లేషణలు చెబుతున్నాయి.

Maruti Brezza

ఈ ఎస్యూవీ చాలా సరసమైన ధరలో లభిస్తుంది, మధ్యతరగతి వినియోగదారులు సులభంగా కొనుగోలు చేయవచ్చు. దీని ధర దాదాపు రూ. 8 లక్షల నుండి రూ. 14 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. ఇది బయటి భాగంలో చాలా ఆకర్షణీయమైన డిజైన్‌ను కలిగి ఉంది. మాగ్మా గ్రే, పెర్ల్ ఆర్కిటిక్ వైట్, పెర్ల్ మిడ్‌నైట్ బ్లాక్‌తో సహా వివిధ రంగుల ఎంపికలలో కూడా లభిస్తుంది.

కొత్త మారుతి బ్రెజ్జా మరింత శక్తివంతమైన పవర్‌ట్రెయిన్‌ను కలిగి ఉంది. 1.5-లీటర్ పెట్రోల్ & సీఎన్జీ ఇంజిన్‌తో వస్తుంది. లీటరుకు 17.38 నుంచి 25.51 కిలో మీటర్ల వరకు మైలేజ్ ఇస్తుంది. ఈ కారులో 5 సీట్లు ఉంటాయి, ప్రయాణికులు సులభంగా ప్రయాణించవచ్చు. ఎక్కువ లగేజీని తీసుకెళ్లడానికి 328 లీటర్ల సామర్థ్యం గల బూట్ స్పేస్‌ను కలిగి ఉంది.

కొత్త మారుతి బ్రెజ్జా కారు 9-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, ప్యాడిల్ షిఫ్టర్స్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్, సన్‌రూఫ్ మరియు 6-స్పీకర్ సెటప్‌తో సహా అనేక ఫీచర్లను కలిగి ఉంది. సేఫ్టీ పరంగా 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ESC (ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్), 360 డిగ్రీల కెమెరాను పొందింది.

Maruti Suzuki

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Wednesday, May 7, 2025, 10:15 [IST]
English summary
25 km mileage 8 lakh price 5 seater why customers are loving the maruti brezza suv
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+