నిమిషానికి 25వేల బుకింగ్స్..ఆ కారు కోసం పడిచచ్చిపోతున్న జనం..షో రూమ్స్ ముందు భారీగా క్యూలు కడుతున్న జనం
భారత మార్కెట్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన కార్లలో మహీంద్రా స్కార్పియో ఎన్ (Mahindra Scorpio N) ఒకటి. ఇది అత్యధికంగా అమ్ముడవుతున్న 7 సీటర్ ఎస్యూవీ రకం కార్లలో ఒకటిగా నిలుస్తుంది. అంతేకాకుండా ఇది ముందస్తు బుకింగ్‌లలో అనేక రికార్డులను క్రియేట్ చేసిన మోడల్.
మహీంద్రా స్కార్పియో ఎన్ కారుకు బుకింగ్‌ల ప్రక్రియ 2022 జూలై 30న ప్రారంభమైంది. అప్పుడు కేవలం 1 నిమిషంలోనే మహీంద్రా స్కార్పియో ఎన్ 25 వేల కంటే ఎక్కువ బుకింగ్స్ సంపాదించింది. ఆ తర్వాత 30 నిమిషాల్లో ఈ కారుకు లక్షకు పైగా బుకింగ్‌లు వచ్చాయి.

అలాంటి కారు మార్కెట్‌లోకి వచ్చి కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. కాబట్టి స్కార్పియో ఎన్ కారు అప్‌డేట్ చేయబడిన ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను మార్కెట్‌లోకి విడుదల చేయడానికి మహీంద్రా సంస్థ రెడీ అవుతుంది. దీనిలో భాగంగా మహీంద్రా స్కార్పియో ఎన్ ఫేస్‌లిఫ్ట్ మోడల్ టెస్టింగ్ ప్రస్తుతం భారతీయ రోడ్ల మీద ప్రారంభించారు.
దీని గురించి కార్ బ్లాక్ ఇండియా వెబ్‌సైట్ వార్తను ప్రచురించింది. ఇది కేవలం ఫేస్‌లిఫ్ట్ అప్‌డేట్ మాత్రమే కాబట్టి, ఇంజిన్ ఆప్షన్లలో మార్పులు చేయడానికి అవకాశాలు లేవు. కాబట్టి ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న మోడల్‌లో అందించబడుతున్న అదే ఇంజిన్ ఆప్షన్లు, ఫేస్‌లిఫ్ట్ మోడల్‌లో కూడా కొనసాగుతాయి.

అవి 2.0 లీటర్ టర్బో పెట్రోల్, 2.2 లీటర్ డీజిల్ ఇంజిన్‌లు అవుతాయి. అంతేకాకుండా మహీంద్రా స్కార్పియో ఎన్ కారు ఫేస్‌లిఫ్ట్ మోడల్‌లో, మాన్యువల్, ఆటోమేటిక్ అనే 2 రకాల గేర్‌బాక్స్ ఆప్షన్లు కూడా అందించనున్నారు. ఈ కారు కొన్ని వేరియంట్లలో 4 వీల్ డ్రైవ్ ఆప్షన్ కూడా ఉంటుంది.
అదేవిధంగా సౌకర్యాల విషయానికి వస్తే, ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న మహీంద్రా స్కార్పియో ఎన్ కారులో అందించబడుతున్న దానికంటే పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, పెద్ద డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వంటివి అందించబడతాయని నిపుణులు భావిస్తున్నారు.

ఇక డిజైన్ విషయానికి వస్తే, ముందు భాగంలో కొత్త గ్రిల్ స్ట్రక్చర్, కొత్త ఎల్ఈడీ హెడ్‌లైట్‌లు అందించబడతాయని అంచనా వేస్తున్నారు. అదేవిధంగా తిరిగి డిజైన్ చేయబడిన కొత్త అలాయ్ వీల్స్ కూడా అందించడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ కొత్త మోడల్ గురించి మరిన్ని వివరాలు రాబోయే రోజుల్లో తెలుస్తాయి.
భారత మార్కెట్‌లో ప్రస్తుతానికి మహీంద్రా స్కార్పియో ఎన్ కారు ప్రారంభ వేరియంట్ ధర 13.20 లక్షల రూపాయలుగా ఉంది. అదే సమయంలో దాని టాప్ వేరియంట్ ధర 24.17 లక్షల రూపాయలుగా ఉంది. ఇవి ఎక్స్-షోరూమ్ ధరలు.
అయితే అనేక అప్‌డేట్‌లు చేయబడుతున్నందున, ఫేస్‌లిఫ్ట్ మోడల్ ధర కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. అయినప్పటికీ, ఫేస్‌లిఫ్ట్ మోడల్ రాక తర్వాత, మహీంద్రా స్కార్పియో ఎన్ కారు అమ్మకాల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
స్కార్పియో ఎన్ పట్ల ప్రజల్లో ఉన్న ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని, ఈ కొత్త మోడల్ అమ్మకాల పరంగా మునుపటి రికార్డులను మించిపోయే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.


Click it and Unblock the Notifications








