26 కి.మీ మైలేజ్, 7 సీట్లు.. ఫ్యామిలీకి కంఫర్ట్.. రూ.10లక్షల్లో లభించే టయోటా ఎంపీవీ ఆల్టర్నేటివ్ మోడల్స్ ఇవే
టయోటా రూమియన్ అత్యంత పాపులారిటీ పొందిన ఎంపీవీ(మల్టీ పర్పస్ వెహికల్). దేశీయ మార్కెట్‌లో ఈ కారు చాలా సరసమైన ధరలో కస్టమర్లకు అందుబాటులో ఉంటుంది. దీని ధర రూ.10 లక్షల నుంచి రూ.14 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) ఉంటుంది. ఇది 1.5-లీటర్ కెపాసిటీ గల పెట్రోల్, CNG ఇంజిన్ ఆప్షన్‌లను కలిగి ఉంది.
ఇది లీటరుకు 20.11 నుంచి 26.11 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుంది. ఇందులో 7 సీట్లు ఉండడంతో ప్రయాణికులు హాయిగా ప్రయాణించవచ్చు. టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్‌తో సహా వివిధ ఫీచర్లను కలిగి ఉంటుంది. సేఫ్టీ కోసం 4 ఎయిర్‌బ్యాగ్‌లను అందిస్తోంది. ఈ 'రూమియన్' ఎంపీవీకి ఆల్టర్నేటివ్గా ఈ 5 కార్లను కొనుగోలుదారులు పరిశీలించవచ్చు. వాటి ధర, ప్రత్యేకతల గురించి తెలుసుకుందాం.

కియా కారెన్స్ (Kia Carens): ఇది కూడా ఒక పాపులర్ ఎంపీవీ. టయోటా రూమియన్‌కు ఇది మంచి ఆల్టర్నేటివ్ అవుతుంది. దీని ధర రూ.10.60లక్షల నుండి రూ.19.70లక్షల వరకు(ఎక్స్-షోరూమ్) ఉంటుంది. ఈ ఎంపీవీ చాలా ఎట్రాక్టివ్ డిజైన్‌ను కలిగి ఉంది. ఇంపీరియల్ బ్లూ, ఇంటెన్స్ రెడ్, అరోరా బ్లాక్ పెర్ల్, స్పార్కింగ్ సిల్వర్, గ్రావిటీ గ్రే, గ్లేసియర్ వైట్ పెర్ల్‌తో సహా వివిధ కలర్ ఆప్షన్లలో కూడా లభిస్తుంది.
కొత్త కియా కారెన్స్ ఎంపీవీ పవర్ఫుల్ 3 పవర్‌ట్రెయిన్‌లను కలిగి ఉంది.. 1.5-లీటర్ పెట్రోల్, 1.4-లీటర్ టర్బో పెట్రోల్, 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్‌లు ఉన్నాయి. ఇది లీటరుకు 16 నుండి 21 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుంది. ఈ కారులో 6/7 సీట్లు ఉన్నాయి. ఎక్కువ లగేజ్ తీసుకెళ్లడానికి వీలుగా 216 లీటర్ల బూట్ స్పేస్‌ను కలిగి ఉంది.

కొత్త కియా కారెన్స్ కారు 10.25-ఇంచుల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 8-స్పీకర్ మ్యూజిక్ సిస్టమ్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, 64 కలర్ యాంబియంట్ లైటింగ్, వైర్‌లెస్ ఫోన్ చార్జర్‌తో సహా వివిధ ఫీచర్లను కలిగి ఉంది. సేఫ్టీ పరంగా 6 ఎయిర్‌బ్యాగ్‌లను కలిగి ఉంది.
మారుతి సుజుకి XL6 (Maruti Suzuki XL6): ఈ MPVని కూడా టయోటా రూమియన్‌కు బదులుగా కొనుగోలుదారులు పరిశీలించవచ్చు. దీని ధర రూ.12 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) ఉంటుంది. ఈ కారు 6 సీట్ల ఆప్షన్లను కలిగి ఉంటుంది. ప్రయాణాలకు వెళ్లే లగేజ్ కోసం 209 లీటర్ల బూట్ స్పేస్‌ను కంపెనీ అందించింది.

కొత్త మారుతి XL6 MPV 1.5-లీటర్ పెట్రోల్, CNG ఇంజిన్‌లను కలిగి ఉంది. ఇది లీటరుకు 20.27 నుండి 26.32 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుంది. అంతేకాకుండా ఈ కారు బయటి భాగంలో లేటెస్ట్ డిజైన్‌ను కలిగి ఉంది. నెక్సా బ్లూ, బ్రేవ్ ఖాఖి, గ్రాండ్యూర్ గ్రే, స్ప్లెండిడ్ సిల్వర్, ఆర్కిటిక్ వైట్, పెర్ల్ మిడ్‌నైట్ బ్లాక్‌తో సహా అనేక రంగుల్లో లభిస్తుంది.
ఈ కారు అనేక ఫీచర్లను కలిగి ఉంది. ముఖ్యంగా 7-ఇంచుల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, క్రూయిజ్ కంట్రోల్, ఆటో ఏసీని కలిగి ఉంది. ప్రయాణికుల సేఫ్టీ కోసం 4 ఎయిర్‌బ్యాగ్‌లు, ESP (ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్), TPMS (టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్), 360-డిగ్రీ కెమెరాను కలిగి ఉంది.

రెనాల్ట్ ట్రైబర్ (Renault Triber): ఇది ఒక ప్రసిద్ధ MPVగా పాపులారిటీ పొందింది. దీని ధర రూ.6 లక్షల నుంచి రూ.9 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) ఉంటుంది. ఇందులో 7 సీట్లు ఉండడంతో ప్రయాణికులు సౌకర్యవంతంగా కూర్చొని ప్రయాణించవచ్చు. ఇది 84 లీటర్ల బూట్ స్పేస్‌ను కలిగి ఉంది. కొత్త రెనాల్ట్ ట్రైబర్ ఎంపీవీ 1-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉంది.
ఇది 5-స్పీడ్ మాన్యువల్/5-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. ఇది లీటరుకు 18.2 నుండి 20 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుంది. అలాగే బయటి భాగంలో ఆకర్షణీయమైన డిజైన్‌ను కలిగి ఉంది. ఐస్ కూల్ వైట్, సీడర్ బ్రౌన్, మూన్‌లైట్ సిల్వర్‌తో సహా అనేక రంగుల్లో లభిస్తుంది.
ఈ కారు 8-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, 7-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, వైర్‌లెస్ ఛార్జర్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్ వంటి అనేక ఫీచర్లను కలిగి ఉంది. సేఫ్టీ కోసం 4 ఎయిర్‌బ్యాగ్‌లు, ABS (యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్), EBD (ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్), TPMS (టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్), రియర్ వ్యూ కెమెరాను కలిగి ఉంది.

మారుతి సుజుకి ఎర్టిగా (Maruti Suzuki Ertiga): ఈ ఎంపీవీ కూడా టయోటా రూమియన్‌కు ప్రత్యామ్నాయంగా ఉంటుంది. దీని ధర రూ.9 లక్షల నుంచి రూ.13 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) ఉంటుంది. ఇది 7 సీట్లను కలిగి ఉంది. ప్రయాణికులు సౌకర్యవంతంగా ప్రయాణించవచ్చు. ఇది 209 లీటర్ల బూట్ స్పేస్‌ను కలిగి ఉంది.
కొత్త ఎర్టిగా కారు 1.5-లీటర్ పెట్రోల్, CNG ఇంజిన్‌ను కలిగి ఉంది. ఇది లీటరుకు 20.3 నుండి 26.11 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుంది. టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ప్యాడిల్ షిఫ్టర్‌లు, క్రూయిజ్ కంట్రోల్, ఆటో AC వంటి వివిధ ఫీచర్లను కలిగి ఉంది. ప్రయాణికుల సేఫ్టీ కోసం 4 ఎయిర్‌బ్యాగ్‌లను కలిగి ఉంది.

మహీంద్రా బొలెరో నియో (Mahindra Bolero Neo): ఇది ఒక ఫ్యామిలీ SUV. దీని ధర రూ.10 లక్షల నుంచి రూ.11 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) ఉంటుంది. ఇందులో 7 సీట్లు ఉన్నాయి. ఎక్కువ లగేజ్ తీసుకెళ్లడానికి 384 లీటర్ల బూట్ స్పేస్‌ను అందించింది. మెజెస్టిక్ సిల్వర్, హైవే రెడ్, పెర్ల్ వైట్, డైమండ్ వైట్‌తో సహా వివిధ కలర్ ఆప్షన్లలో కూడా లభిస్తుంది.
ఈ కారు 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్‌ను కలిగి ఉంది. ఇది లీటరుకు 17.29 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుంది. 7-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, క్రూయిజ్ కంట్రోల్, హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, కీలెస్ ఎంట్రీ వంటి అనేక ఫీచర్లను కలిగి ఉంది. సేఫ్టీ కోసం డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లతో వస్తుంది.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








