26 కి.మీ మైలేజ్, 6 సీటర్, తక్కువ ధర..ఈ కారును కొనేందుకు క్యూ కడుతున్న జనాలు

దేశంలో అత్యధికంగా కార్లను విక్రయింటే కంపెనీ మారుతి సుజుకి. కస్టమర్ల అవసరాలకు తగ్గట్లు ఎప్పటికప్పుడు తక్కువ ధరలో, ఎక్కువ మైలేజ్ ఇచ్చే కార్లను తయారు చేయడంలో దీనికి సాటి మరొకటి లేదు. ఈ క్రమంలో మారుతి సుజుకి నుంచి వచ్చిన XL6 ఎంపీవీ ప్రస్తుతం మార్కెట్‌లో సంచలనం సృష్టిస్తోంది.

ఈ కారు చూడగానే ఆకట్టుకునే అద్భుతమైన డిజైన్, సరికొత్త ఫీచర్లతో పాటు ముఖ్యంగా దాని అధిక మైలేజ్ కారణంగా కస్టమర్లు అందరూ కొనుగోలు చేయడానికి ఎగబడుతున్నారు. దీనికి నిదర్శనంగా అక్టోబర్ నెలలో ఈ కారు అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. గత సంవత్సరం ఇదే నెలతో పోలిస్తే ఏకంగా 10 శాతం వృద్ధిని నమోదు చేసింది. అక్టోబర్‌లో మొత్తం 3,611 యూనిట్లు అమ్ముడయ్యాయి.

26 Kmpl Mileage and 6-Seater Comfort Why Customers are Rushing to Buy the Maruti XL6

మారుతి XL6 అమ్మకాలు అక్టోబర్ నెలలో ఇంత మొత్తంలో పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయి. సెప్టెంబర్ 22 నుంచి ప్రభుత్వం సవరించిన జీఎస్టీ రేట్లు అమలులోకి రావడంతో ఈ ఎంపీవీ ధరలు పెద్ద ఎత్తున తగ్గాయి. ప్రధానంగా ఇది కొనుగోలుదారులను బాగా ఆకర్షించింది. అలాగే దీపావళి పండుగ సీజన్ కావడంతో చాలా మంది కొత్త వాహనాలు కొనుగోలు చేయడానికి మొగ్గు చూపారు.

మారుతి XL6 అనేది 6-సీటర్ కావడం క్కువ మైలేజ్ ఇవ్వడం వంటి అంశాలు ఈ కారును కుటుంబాలకు ఇష్టమైన ఎంపికగా మార్చాయి. మారుతి XL6 కారు వినియోగదారులకు చాలా పోటీ ధరలో అందుబాటులో ఉంది. ఈ కారు కనీస ధర రూ.11.52 లక్షలు ఉండగా, గరిష్టంగా రూ.14.48 లక్షల వరకు ఉంది. మధ్య తరగతి, సంపన్న వర్గాల కస్టమర్లు కూడా సులభంగా కొనుగోలు చేయగలిగేలా ధర నిర్ణయించారు.

26 Kmpl Mileage and 6-Seater Comfort Why Customers are Rushing to Buy the Maruti XL6

ఇది జీటా (Zeta), ఆల్ఫా (Alpha), ఆల్ఫా ప్లస్ (Alpha Plus) అనే మూడు వేరియంట్‌లలో లభిస్తుంది. XL6 కొలతల విషయానికి వస్తే పొడవు 4,445 మి.మీ, వెడల్పు 1,775 మి.మీ, ఎత్తు 1,755 మి.మీ. దీని వీల్‌బేస్ 2,740 మి.మీ, గ్రౌండ్ క్లియరెన్స్ 180 మి.మీ ఉంది. LED హెడ్‌ల్యాంప్‌లు, LED DRL లు, అల్లాయ్ వీల్స్‌తో డిజైన్ చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.

XL6 కారు పవర్ఫుల్ ఇంజిన్ ఆప్షన్లు, అద్భుతమైన మైలేజ్‌ను కలిగి ఉంది. ఇది 1.5-లీటర్ పెట్రోల్, 1.5-లీటర్ పెట్రోల్ + CNG అనే రెండు ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ కారు 20 నుంచి 26 కి.మీ వరకు మైలేజ్ ఇస్తుంది. ఇది గరిష్టంగా గంటకు 170 కిమీ వేగాన్ని అందుకోగలదు. వేరియంట్‌ను బట్టి 5-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లు ఉన్నాయి.

26 Kmpl Mileage and 6-Seater Comfort Why Customers are Rushing to Buy the Maruti XL6

ప్రయాణీకుల సౌలభ్యం, సేఫ్టీ విషయంలో XL6 టాప్ ప్లేసులో ఉంది. ఇది 6-సీటర్ కావడం వల్ల ప్రయాణికులు సులభంగా, సౌకర్యవంతంగా కూర్చోవచ్చు. 318 లీటర్ల బూట్ స్పేస్ లగేజ్ తీసుకెళ్లడానికి సరిపోతుంది. 7-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, రేర్ ఏసీ వెంట్స్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

ప్రయాణికుల రక్షణ కోసం 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ABS, EBD, ESP, TPMS, 360-డిగ్రీ కెమెరా వంటి అడ్వాన్సుడ్ సేఫ్టీ ఫీచర్లను మారుతి XL6 కలిగి ఉంది. ప్రస్తుతం కియా కారెన్స్, టయోటా రూమియన్ వంటి ఎంపీవీలు XL6 కి ప్రధాన పోటీదారులుగా ఉన్నాయి.

More from DriveSpark

Article Published On: Friday, November 21, 2025, 9:41 [IST]
English summary
26 kmpl mileage and 6 seater comfort why customers are rushing to buy the maruti xl6
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+