ఏకంగా 27కిమీ మైలేజ్.. రూ.95వేల తగ్గింపు.. ఇంతకంటే ఏం కావాలి ఈ హోండా కారు కొనడానికి

హోండా కార్స్ ఇండియా కంపెనీ తమ పాపులర్ సిటీ కారులో e:HEV అనే పేరుతో హైబ్రిడ్ వెర్షన్‌ను కొన్నేళ్లుగా అమ్ముతోంది. సిటీ కారు అమ్మకాల్లో ఈ హైబ్రిడ్ మోడల్ వాటా చాలా కీలకం. అందుకే హోండా కంపెనీ సిటీ హైబ్రిడ్ కారులో ఎప్పటికప్పుడు కొత్త అప్‌డేట్‌లు ఇస్తూనే ఉంటుంది.

ఇప్పుడు, సిటీ హైబ్రిడ్ కారు ధరను హోండా భారీగా తగ్గించింది. దీని గురించి, అలాగే సిటీ e:HEV కారు గురించి వివరంగా తెలుసుకుందాం. జపాన్‌కు చెందిన హోండా కార్స్ కంపెనీ ఇప్పుడు ఇండియాలో కేవలం మూడు కార్లను మాత్రమే అమ్ముతోంది. అవి ఎలివేట్, అమేజ్, సిటీ. వీటిలో, చాలా సంవత్సరాలుగా ఇండియాలో అమ్ముడవుతున్న కారు సిటీ.

Honda City Hybrid

హోండా ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిన సెడాన్ కారు సిటీ. ఇది గతంలో చాలా వెర్షన్లలో అప్‌డేట్ అయ్యింది. అంటే, ఆయా కాలాలకు తగ్గట్టుగా హోండా సిటీ కారును అప్‌డేట్ చేస్తూ వచ్చారు. అయితే, ఇప్పుడు సిటీ e:HEV కారు వేరియంట్లను, కొన్ని వేరియంట్ల ధరలను అప్‌డేట్ చేసింది.

ఇందులో భాగంగా సిటీ హైబ్రిడ్ కారులో తక్కువ ధర ఉన్న V వేరియంట్‌ను హోండా అమ్మడం ఆపేసింది. దీనితో ఇకపై సిటీ ఇ:హెచ్.ఈ.వి కారును కేవలం జడ్.ఎక్స్ అనే ఒకే ఒక వేరియంట్‌లో కొనుక్కోవచ్చు. వి వేరియంట్ అమ్మకాలను హోండా ఆపేయడానికి కారణం జడ్.ఎక్స్ వేరియంట్ ధరను తగ్గించడమే.

Honda City Hybrid

సిటీ ఇ:హెచ్.ఈ.వి కారు జడ్.ఎక్స్ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ.95,000 తగ్గింది. ఈ ధర తగ్గింపుతో సిటీ హైబ్రిడ్ కారు జడ్.ఎక్స్ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ.20 లక్షల లోపు వచ్చి రూ.19.90 లక్షలుగా మారింది. ఇది ఈ కారు పాత ధర కంటే 4.56శాతం తక్కువ.

అంతేకాదు, ఇప్పుడు రూ.19.90 లక్షలు అనేది, ప్రస్తుతం అమ్మకం ఆపేసిన వి వేరియంట్ ధర కంటే కేవలం రూ.90 వేలు మాత్రమే ఎక్కువ. ఇంతకుముందు వి, జడ్.ఎక్స్ వేరియంట్ల ధరల మధ్య తేడా రూ.1.85 లక్షలు ఉండేది. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. సిటీ హైబ్రిడ్ కారు ధరను ఇటీవల గత మే నెలలో రూ.29,900 పెంచారు.

Honda City Hybrid

సిటీ హైబ్రిడ్ కారు 1.5 లీటర్ నాచురల్లీ-ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్, రెండు ఎలక్ట్రిక్ మోటార్లతో నడుస్తుంది. పెట్రోల్ ఇంజిన్ ద్వారానే కారు బ్యాటరీ ఛార్జ్ అవుతుంది. లీటరుకు సుమారు 27 కిలోమీటర్ల మైలేజ్ ఇచ్చే ఈ హైబ్రిడ్ కారులో లెవెల్-2 అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ వంటి అత్యాధునిక సౌకర్యాలు ఉన్నాయి.తక్కువ ధరలో అద్భుత ఫీచర్లతో వస్తుంది.

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం: హోండా సిటీ ఇ:హెచ్.ఈ.వి కారు వి వేరియంట్ కంటే జడ్.ఎక్స్ వేరియంట్‌లో ఎక్కువ టెక్నాలజీ ఫీచర్లు ఉన్నాయి. ఇప్పుడు ధర తగ్గడంతో, సిటీ హైబ్రిడ్ కారును తక్కువ ఖర్చుతో ఎక్కువ ఫీచర్లతో కొనుక్కోవచ్చు. కస్టమర్లను ఆకర్షించడానికి ఇది కూడా ఒక మంచి ఎత్తుగడ. ఇలాంటి ప్లాన్స్‌తో హోండాకు ఎలా గిట్టుబాటు అవుతుందో చూడాలి.

More from DriveSpark

Article Published On: Saturday, July 5, 2025, 12:22 [IST]
English summary
27kmpl mileage per liter honda city hybrid rs 95 000 price cut super car under rs 20 lakhs
Read more on: #honda #auto news #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+