ధరకు పేదోడు.. మైలేజ్‌కు ధనవంతుడు.. భద్రతకు రారాజు.. అందుకే షోరూంల ముందు క్యూ కట్టి కొంటున్నారు
మారుతి సుజుకి డిజైర్ (Maruti Suzuki Dzire) ఇది ఒక పాపులర్ సెడాన్. ఇది దేశీయ మార్కెట్లో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో ఒకటిగా నిలిచింది. అట్రాక్టివ్ డిజైన్, ఎక్కువ ఫీచర్లు, అందుబాటు ధరలో లభించడం దీని ప్రత్యేకత. తాజాగా విడుదల అయిన ఏప్రిల్ 2025 అమ్మకాల నివేదిక ప్రకారం.. అత్యధికంగా అమ్ముడైన టాప్ 10 కార్లలో హ్యుందాయ్ క్రెటా తర్వాత రెండో స్థానంలో మారుతి డిజైర్ నిలిచింది.
గత నెల (ఏప్రిల్ 2025)లో మారుతి సుజుకి దాదాపు 16,996 యూనిట్ల డిజైర్ సెడాన్లను విక్రయించింది. అంతకుముందు నెలల్లో కూడా ఈ కారు మంచి అమ్మకాలను సాధించింది. మార్చిలో 15,460 యూనిట్లు, ఫిబ్రవరిలో 14,694 యూనిట్లు, జనవరిలో 15,383 యూనిట్లు అమ్ముడయ్యాయి.

2024 చివరి త్రైమాసికంలో కూడా మారుతి సుజుకి డిజైల్ మంచి సంఖ్యలో అమ్మకాలు నమోదు చేసింది. డిసెంబర్‌లో 16,573 యూనిట్లు, నవంబర్‌లో 11,779 యూనిట్లు, అక్టోబర్‌లో 12,698 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఈ గణాంకాలను ఓ సారి నిశితంగా పరిశీలిస్తే ప్రతి నెలా సగటున 14,000 యూనిట్ల డిజైర్ కార్లు అమ్ముడవుతున్నాయని స్పష్టంగా అర్థం అవుతుంది.
నాలుగో తరం మారుతి సుజుకి డిజైర్ అమ్మకాలు పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ కారు సేఫ్టీ విషయంలో గ్లోబల్ NCAP నుంచి 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ పొందడం దీనికి బాగా కలిసొచ్చిన అంశంగా మారింది. దీనితో పాటు, డిజైర్ సెడాన్ తక్కువ ధరలో ఎక్కువ లేటెస్ట్ ఫీచర్లను కలిగి ఉండడం కూడా వినియోగదారులను బాగా ఆకర్షిస్తోంది.

కొత్త మారుతి సుజుకి డిజైర్ బడ్జెట్ ధరలో అందుబాటులో ఉండడంతో కొనుగోలుదారులు సులభంగా సొంతం చేసుకోవచ్చు. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 6.84 లక్షల నుంచి రూ. 10.19 లక్షల వరకు ఉంది. ఇది చూడగానే ఆకట్టుకునే అద్భుతమైన డిజైన్‌ను కలిగి ఉంటుంది. పెర్ల్ ఆర్కిటిక్ వైట్, మాగ్మా గ్రే, బ్లూయిష్ బ్లాక్‌తో సహా వివిధ కలర్ ఆప్షన్లలో ఇది లభిస్తుంది.
కొత్త డిజైర్ కారు 1.2-లీటర్ పెట్రోల్, సీఎన్జీ ఇంజన్ ఆప్షన్లలతో వస్తుంది. ఇది ఏ బైక్‌కు తీసిపోని విధంగా లీటరుకు ఏకంగా 24.79 నుంచి 33.73 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుంది. ఇందులో 5 సీట్లు ఉండడంతో ప్రయాణికులు హాయిగా ప్రయాణించవచ్చు. ఎక్కువ లగేజీ తీసుకెళ్లడానికి వీలుగా 382 లీటర్ల బూట్ స్పేస్ కూడా ఉంది.

ఈ సెడాన్‌లో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, రేర్ సెంటర్ ఆర్మ్‌రెస్ట్, సన్‌రూఫ్, ఆటో ఏసీ వంటి అనేక ఫీచర్లు ఉన్నాయి. ప్రయాణికుల సేఫ్టీ కోసం 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ESC (ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్), 3-పాయింట్ సీట్ బెల్ట్‌లు, 360-డిగ్రీ కెమెరా వంటి సేఫ్టీ ఫీచర్స్ కూడా ఉన్నాయి.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








