సూపర్ ఫీచర్లు, అదిరిపోయే లుక్స్.. ఏప్రిల్‌లో బజార్‌ను షేక్ చేయబోతున్న కార్లు ఇవే!
భారత ఆటోమొబైల్ మార్కెట్ కొత్త లాంచ్‌ల కోసం ఎదురు చూస్తుంది. వచ్చే నెలలో దేశీయ వినియోగదారుల కోసం దిగ్గజ వాహన తయారీదారులు కొత్త కార్లను విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వీటిలో సాంప్రదాయ ఇంధన వాహనాలతో పాటు, ఎలక్ట్రిక్ మోడళ్లు కూడా ఉన్నాయి. ఇవన్నీ అధునాతన టెక్నాలజీ, స్టైలిష్ డిజైన్స్, అదిరిపోయే పెర్ఫామెన్స్ అందించడానికి వాహన ప్రియులను ఆకట్టుకోవడానికి విడుదల కాబోతున్నాయి. దేశీయంగా కార్ల అమ్మకాల్లో మొదటి స్థానంలో ఉన్నటువంటి మారుతీ సుజుకీ (maruti suzuki), ఎంజీ మోటార్ (Mg motor), టాటా మోటార్స్ (tata motors), నిస్సాన్ (nissan) కంపెనీల నుంచి అత్యాధునిక టెక్నాలజీతో, అధునాతన సదుపాయాలతో కూడిన కార్తు విడుదల కానున్నాయి. వాటి గురించి కింది కథనంలో తెలుసుకుందాం.
Maruti Suzuki e-Vitara: మారుతీ సుజుకీ ఇ-విటారా ఎలక్ట్రిక్ SUV ఫిబ్రవరి నెలలో విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. ఈ కారును సుజుకి మోటార్ గుజరాత్ (SMG) ప్లాంట్‌లో ఉత్పత్తి చేసి ఇక్కడ విక్రయిస్తూనే, ఇతర దేశాలకు సైతం ఎగమతి చేయనున్నారు. ఇది రెండు బ్యాటరీ ఆప్షన్లు 48.8 kWh, 61.1 kWh ప్యాక్‌లతో అందుబాటులో ఉంటుంది. పూర్తి ఛార్జ్‌తో 500 కి.మీల కంటే ఎక్కువ రేంజ్‌ను ఇస్తుంది.

అంతర్జాతీయ మార్కెట్లో ఆల్-వీల్ డ్రైవ్ సెటప్ అందుబాటులో ఉండగా, ఇక్కడ ఫ్రంట్-వీల్ డ్రైవ్ సిస్టమ్ లభించనుందని తెలుస్తుంది. ఇది డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఛార్జర్, వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, 360-డిగ్రీల సరౌండ్ వ్యూ కెమెరా, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, లెవల్-2 ADAS, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, పనోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు ఇంకా ఇతర ప్రీమియం ఫీచర్స్ ఉన్నాయి.
Tata Harrier EV: టాటా మోటార్స్ మరో సంచలనాన్ని సృష్టించేందుకు హారియర్ ఈవీని ఫిబ్రవరి నెలలో విడుదల చేయబోతుందని సమాచారం. మిడ్-సైజ్ SUV సెగ్మెంట్‌లో గేమ్ ఛేంజర్ కాబోతోందని భావిస్తున్నారు. ఈ కారు సింగిల్ ఛార్జ్‌తో 500 కి.మీ కంటే ఎక్కువ రేంజ్‌ను అందిస్తుందని భావిస్తున్నారు. ఇది డ్యూయల్ మోటార్ AWD సెటప్‌తో 75kWh బ్యాటరీ ప్యాక్‌తో లభించే అవకాశం ఉంది. దీని డిజైన్ ICE వేరియంట్ మాదిరిగా ఉంటుంది.

ఈ కారులో 12.3-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టం, ఇంటీరియర్ లుక్‌ను మరో లెవల్‌కి తీసుకెళ్లే పనోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే, ప్రమాద సమయంలో లోపల కూర్చన్న ప్రయాణికులను రక్షించడానికి 7 ఎయిర్‌బ్యాగులు, EBD తో ABS, 360-డిగ్రీల సరౌండ్ వ్యూ కెమెరా, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), ముందు, వెనుక పార్కింగ్ సెన్సార్‌లను కలిగి ఉంది.
Nissan Magnite CNG: నిస్సాన్ మాగ్నైట్ CNG దేశీయ మార్కెట్లో హల్‌చల్ సృష్టించడానికి వచ్చె నెలలో లాంచ్ కాబోతుందని సమాచారం. కొత్త CNG కిట్‌ను మాగ్నైట్ 1.0-లీటర్, 3-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌లో అందించనుంది. డీలర్‌షిప్‌లో ఇన్‌స్టాల్ చేయబడిన CNG కిట్‌పై 12 నెలల వారంటీ కూడా ఉంటుంది. మైలేజ్ విషయానికి వస్తే, కిలో ఇంధనానికి దాదాపు 25 కి.మీ కంటే ఎక్కువ దూరం ప్రయాణిస్తుంది.

MG Cyberster: ఎంజీ మోటార్ తన సరికొత్త ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ సైబర్‌స్టర్ GTకారును ఫిబ్రవరిలో విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. ఇది అత్యాధునిక టెక్నాలజీతో పాటు అదిరిపోయే పెర్ఫామెన్స్‌ను అందించనుంది. శక్తివంతమైన ట్విన్-మోటార్ సెటప్‌తో వస్తుంది. 510 PS పవర్, 725 Nm టార్క్‌ను విడుదల చేస్తుంది. ఇది సింగిల్ ఛార్జ్‌తో 450 కి.మీ.ల రేంజ్ అందించనుంది. దీని టాప్ స్పీడ్ వచ్చేసి గంటకు 208 కి.మీలుగా ఉంది.


Click it and Unblock the Notifications








