అతి తక్కువ ధరకే 6 ఎయిర్‌బ్యాగ్‌లతో లభించే 5 బెస్ట్ కార్లు.. ఒక మోడల్ ఏకంగా 34.43 కి.మీల మైలేజ్ ఇస్తుంది!
ప్రపంచవ్యాప్తంగానే కాకుండా భారత్‌లో కూడా రోడ్డు ప్రమాదాల బారీన పడి చాలా మంది తమ ప్రాణాలను కోల్పోతున్నారు. మరికొంత మంది గాయాలతో మంచనా పడుతున్నారు. దేశంలో చోటుచేసుకుంటున్న మరణాలో ఎక్కువగా యాక్సిడెంట్ల కారణంగానే జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కార్లను కొనుగోలు చేసే సమయంలో సేఫ్టీ పరంగా అత్యుత్తమమైన వాటిని ఎంచుకోవడం అతిముఖ్యం. ప్రస్తుతం కార్ల వినియోగం భారీగా పెరిగింది. దీంతో వాహన తయారీదారులు వరుసగా అధునాతన ఫీచర్లతో కూడిన మోడళ్లను విడుదల చేస్తున్నారు. వీటి నుంచి ప్రమాద సమయంలో రక్షణ పరంగా లోపల కూర్చున్న వారికి ఎలాంటి గాయాలు కాకుండా సేఫ్టీ అందించే కార్లను కొనడం బెస్ట్. ముఖ్యంగా 6 ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్నవాటిని ఎంచుకోవడం ఉత్తమం. ఒకప్పుడు ప్రీమియం కార్లలోనే ఇవి అందుబాటులో ఉండగా, ప్రస్తుతం బడ్జెట్ ధరలో లభించే వాటిలో కూడా 6 ఎయిర్‌బ్యాగ్‌లను అందిస్తున్నారు. మార్కెట్లో ఉన్న ఈ కార్ల గురించి కింది కథనంలో తెలుసుకుందాం.
Hyundai Exter: హ్యుందాయ్ ఎక్స్‌టర్ ప్రధానంగా బడ్జెట్ ధరలోనే కొనుగోలుకు ఉంది. ఇది ఆరు ఎయిర్‌బ్యాగ్‌లను కలిగి ఉంటుంది. కస్టమర్లకు పెట్రోల్ అలాగే, CNG ఆప్షన్‌లో లభిస్తుంది. పెట్రోల్ వేరియంట్ 1.2-లీటర్ కప్పా ఇంజిన్‌తో రన్ అవుతుంది. ఇది 83 PS పవర్, 114 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అదే CNG విషయానికి వస్తే, 69 PS పవర్, 95.2 Nm గరిష్ట టార్కును ఉత్పత్తి చేస్తుంది.

హ్యుందాయ్ ఎక్స్‌టర్ పెట్రోల్ వెర్షన్ 5-స్పీడ్ మాన్యువల్, 5-స్పీడ్ AMT గేర్‌బాక్స్ ఆప్షన్లలో లభిస్తుంది. అదే , CNG వేరియంట్‌లో మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌ను అందించారు. బేస్ వేరియంట్ ప్రారంభ ధర రూ.6.20 లక్షల నుంచి ప్రారంభమై టాప్ వేరియంట్ ధర రూ. 10.50 లక్షల వరకు ఉంటుంది. ఇవన్నీ కూడా ఎక్స్‌షోరూమ్ ధరలు. ఆన్‌రోడ్ అయితే మరింత ఎక్కువగా ఉంటుంది. మైలేజ్ 19.2 నుంచి 19.4 Kmpl వరకు వస్తుంది.
4th generation Maruti Dzire: నాల్గవ తరం మారుతి డిజైర్ పాత మోడల్ కంటే మరింత కొత్తగా అప్‌డేట్ అయింది. ఈ కారులో 6 ఎయిర్‌బ్యాగ్‌లను కంపెనీ ప్రామాణికంగా అందించింది. అలాగే సేఫ్టీకి సంబంధించిన ఇతర అంశాలను సైతం జోడించింది. ముఖ్యంగా ఇది, గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్‌లో 5-స్టార్ రేటింగ్ సాధించిన మొదటి మారుతీ కారుగా రికార్డులకెక్కింది. ఇది ఇండియాలో అత్యంత డిమాండ్ ఉన్న మోడల్.

Hyundai Grand i10 Nios: హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ బేస్ వేరియంట్‌తో పాటు ఇతర వాటిలో కూడా 6 ఎయిర్‌బ్యాగ్‌లను స్టాండర్డ్‌గా కలిగి ఉంది. ఇది పెట్రోల్, cng ఆప్షన్లో కొనుగోలుకు లభిస్తుంది. ఈ హ్యాచ్‌బ్యాక్ ప్రారంభ ధర రూ.5.98 లక్షలుగా ఉంది. అదే టాప్ వేరియంట్ అయితే ఏకంగా రూ.9.75 లక్షల వరకు ఉంది. ఇవి ఎక్స్ షోరూమ్ ధరలు. ఆన్‌రోడ్ అయితే మరింత ఎక్కువగా ఉంటుంది.
Maruti Celerio: మారుతి సెలెరియో బేస్ వేరియంట్ ప్రారంభ ధర రూ.5.64 లక్షల నుంచి మొదలుకుని టాప్ వేరియంట్ రూ.7.37 లక్షల వరకు ఉంటుంది. ఈ కారును ఇటీవల అప్‌గ్రేడ్ చేసింది. వినియోగదారుల కోసం అదనంగా కొత్త ఫీచర్స్‌ను జోడించింది. వాటిలో ప్రధానంగా కంపెనీ ఇటీవలే 6 ఎయిర్‌బ్యాగ్‌లను అందించింది. ఇది 34.43 కిమీల మైలేజ్‌తో పేద, మధ్యతరగతి కస్టమర్లకు అందుబాటు ధరలో మెరుగైన సేఫ్టీ ఫీచర్స్‌ను కలిగి ఉంది.

Nissan Magnite: నిస్సాన్ మాగ్నైట్ బేస్ వేరియంట్ ధర రూ.6.12 లక్షలు. అదే టాప్ వేరియంట్ రూ. 11.88 లక్షలు. ఇవన్నీ ఎక్స్ షోరూమ్ ధరలు. ఈ కారు ప్రయాణికుల రక్షణ కోసం ఆరు ఎయిర్‌బ్యాగులను కలిగి ఉంది. ఇది రెండు పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లలో కొనుగోలుకు అందుబాటులో ఉంది.


Click it and Unblock the Notifications








