టాటా నుంచి మారుతి వరకు అదిరిపోయే ఫీచర్లతో త్వరలో మార్కెట్లోకి రాబోతున్న ఐదు కార్లు ఇవే
భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల డిమాండ్ విపరీతంగా పెరుగుతోంది. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి టాటా, మారుతి, కియా, హ్యుందాయ్, మహీంద్రా వంటి ప్రముఖ కంపెనీలు తమ కొత్త మోడళ్లను మార్కెట్‌లోకి తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాయి. త్వరలో విడుదల కానున్న ఈ ఎలక్ట్రిక్ కార్లలో అద్భుతమైన ఫీచర్లు, ఎక్కువ రేంజ్, ఆకర్షణీయమైన డిజైన్ ఉన్నాయి.
మీరు కొత్త ఎలక్ట్రిక్ కారు కొనుక్కోవాలని ఆలోచిస్తుంటే, రాబోయే ఈ ఐదు కార్ల వివరాలు మీకు చాలా ఉపయోగపడతాయి. అవేంటో చూద్దాం. మనదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ చాలా వేగంగా విస్తరిస్తోంది. ఇప్పుడు వినియోగదారులు కొత్త మోడళ్ల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు తమ సరికొత్త ఎలక్ట్రిక్ కార్లను త్వరలో మార్కెట్‌లోకి తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాయి.

1. టాటా సియెర్రా ఈవీ
భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025లో తొలిసారిగా ప్రదర్శించిన టాటా సియెర్రా ఎలక్ట్రిక్ వెర్షన్ చాలామంది దృష్టిని ఆకర్షించింది. దీని గురించి పూర్తి వివరాలు ఇంకా వెల్లడించనప్పటికీ, దీని పవర్‌ట్రైన్ హ్యారియర్ ఈవీ నుంచి తీసుకునే అవకాశం ఉంది. దీని డిజైన్ పాత సియెర్రా ఐసీఈ మోడల్‌ను పోలి ఉంటుంది. ఇది ఒక స్పెషల్ ఆకర్షణ. ఈ కారు మార్కెట్లోకి వస్తే, టాటా ఎలక్ట్రిక్ కార్ల పోర్ట్‌ఫోలియో మరింత బలోపేతం అవుతుంది.
2. హ్యుందాయ్ అయోనిక్ 5
హ్యుందాయ్ అయోనిక్ 5 ఫేస్‌లిఫ్ట్ మోడల్ టెస్టింగ్ దశలో ఉంది. ఈ కారు సింగిల్ మోటార్ సెటప్, డ్యూయల్ మోటార్ కాన్ఫిగరేషన్ ఆప్షన్లలో లభిస్తుంది. 63 kWh RWD మోడల్ 394 కి.మీ రేంజ్, 84 kWh RWD మోడల్ 511 కి.మీ రేంజ్, 84 kWh AWD మోడల్ 466 కి.మీ రేంజ్ అందిస్తుంది. ఇది శక్తివంతమైన పవర్‌ట్రైన్‌తో పాటు మంచి రేంజ్‌తో కస్టమర్లను ఆకట్టుకుంటుందని భావిస్తున్నారు.

3. మారుతి సుజుకి e-విటారా
దేశంలో అత్యధిక కార్లు విక్రయించే మారుతి సుజుకి సెప్టెంబర్ 3న తమ మొదటి ఎలక్ట్రిక్ కారు e-విటారాను విడుదల చేయనుంది. ఇది రెండు బ్యాటరీ ఆప్షన్లలో లభిస్తుంది. సింగిల్ ఛార్జ్ పై 49 kWh బ్యాటరీ 346 కి.మీ రేంజ్, 61 kWh బ్యాటరీ సింగిల్-మోటార్ వేరియంట్‌లో 428 కి.మీ, డ్యూయల్-మోటార్ వేరియంట్‌లో 412 కి.మీ రేంజ్ ఇవ్వగలదు. మారుతి నుంచి రాబోతున్న ఈ కారు కోసం వినియోగదారులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
4. మహీంద్రా XEV 7e
మహీంద్రా యొక్క కొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ XEV 7e గురించి పూర్తి వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. కానీ, ఇది రెండు బ్యాటరీ ప్యాక్‌లతో వచ్చే అవకాశం ఉంది. 59 kWh, 79 kWh. ఈ కారు ఒక్కసారి ఛార్జ్ చేస్తే సుమారు 500 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇవ్వగలదని అంచనా వేస్తున్నారు. మహీంద్రా నుంచి రాబోతున్న ఈ కారు కూడా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో మంచి పోటీని ఇస్తుంది.

5. కియా సైరోస్ ఈవీ
కియా సంస్థ కూడా ఈ ఏడాది చివరి నాటికి తమ సైరోస్ ఈవీని విడుదల చేయవచ్చని తెలుస్తోంది. ఈ కారులో 42 kWh లేదా 49 kWh బ్యాటరీ ప్యాక్‌లను ఉపయోగించే అవకాశం ఉంది. కియా సైరోస్ ఈవీ కూడా భారత మార్కెట్లో మంచి రేంజ్‌తో అడ్వాన్సుడ్ ఫీచర్లతో మంచి అమ్మకాలను సాధించవచ్చని భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications








