మారుతి ఆ కారును కొనేందుకు జనాలు షోరూంలకు ఎందుకిలా పరిగెడుతున్నారు.. ఈ 5కారణాలే కావొచ్చు
అంతర్జాతీయ మార్కెట్లో లాంచ్ అయిన రెండేళ్లలోనే మారుతి సుజుకి ఫ్రాంక్స్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. అత్యంత వేగంగా లక్ష యూనిట్లను ఎగుమతి చేసిన భారతీయ ఎస్‌యూవీగా రికార్డు సృష్టించడమే కాకుండా, 2025 ఫిబ్రవరిలో వ్యాగన్ఆర్, హ్యుందాయ్ క్రెటా వంటి కార్లను వెనక్కి నెట్టి దేశీయ అమ్మకాల్లో నంబర్ 1 స్థానంలో నిలిచింది.
మారుతి సుజుకి గుజరాత్ ప్లాంట్‌లో తయారైన ఫ్రాంక్స్ ఇప్పుడు జపాన్, దక్షిణాఫ్రికా, సౌదీ అరేబియా, లాటిన్ అమెరికా, ఆఫ్రికా వంటి 80కి పైగా దేశాలకు ఎగుమతి అవుతోంది. మరి ఇంతటి విజయానికి కారణం ఏమిటి? ప్రజలు ఈ కారును ఎందుకు అంతలా ఇష్టపడుతున్నారో ఇప్పుడు చూద్దాం. భారతదేశంలో ఫ్రాంక్స్ ధర రూ.7.54 లక్షల నుండి రూ.13.06 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది.

1. అద్భుతమైన సర్వీస్ నెట్‌వర్క్: మారుతి సుజుకి మోడల్స్‌కి ఉన్నట్టే, ఫ్రాంక్స్ కూడా భారతదేశంలో మారుతికి ఉన్న నమ్మకం, విస్తృత సర్వీస్ నెట్‌వర్క్ నుండి ప్రయోజనం పొందుతుంది. దేశవ్యాప్తంగా టైర్-2, టైర్-3 నగరాలతో సహా 4,000కి పైగా సర్వీస్ టచ్‌పాయింట్‌లు మారుతికి ఉన్నాయి.
సర్వీస్, విడిభాగాల లభ్యత, ముఖ్యంగా గ్రామీణ లేదా మారుమూల ప్రాంతాల్లో, యజమానుల ఆందోళనలను తగ్గిస్తుంది. ఇది మొదటిసారి కారు కొనేవారికి మరింత నమ్మకాన్ని ఇస్తుంది. అంతర్జాతీయంగా సుజుకితో ఉన్న బలమైన సంబంధం కూడా దీని విజయానికి కారణం. ముఖ్యంగా కాంపాక్ట్ వాహనాలకు భారీ డిమాండ్ ఉన్న జపాన్ వంటి మార్కెట్లలో ఇది భారీ డిమాండ్ సంపాదించుకుంది.

2. పైసా వసూల్ డీల్: ఫ్రాంక్స్, మారుతి బలేనో హార్ట్‌టెక్ట్ ప్లాట్‌ఫామ్ పై ఆధారపడి రూపొందించబడింది. ఇది తయారీ ఖర్చులను తగ్గించడంలో సహాయపడింది. అందుకే మారుతి, 4 మీటర్ల లోపు ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో ఫ్రాంక్స్‌ను చాలా తక్కువ ధరకే విడుదల చేయగలిగింది. దీని ధరలు రూ.7.52 లక్షల నుండి రూ.13.04 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉన్నాయి.
ఇది అదే ఫీచర్లతో ఉన్న చాలా పోటీదారుల కంటే తక్కువ. ఎస్‌యూవీ లాంటి డిజైన్, మంచి గ్రౌండ్ క్లియరెన్స్, ప్రీమియం ఫీచర్లతో కూడిన కారును కోరుకునే వినియోగదారులకు, హ్యుందాయ్ వెన్యూ, కియా సోనెట్ లేదా టాటా నెక్సాన్ వంటి మోడళ్లకు ఫ్రాంక్స్ ఒక ప్రత్యామ్నాయంగా నిలుస్తుంది.

3. స్టైలిష్ డిజైన్: మెకానికల్‌గా బలేనోను పోలి ఉన్నప్పటికీ, ఫ్రాంక్స్ బాడీ డిజైన్ పూర్తిగా భిన్నంగా, ఆకర్షణీయంగా ఉంటుంది. ఇది ఉన్నతమైన బోనెట్, విశాలమైన గ్రిల్, ఎల్‌ఈడీ డే-టైమ్ రన్నింగ్ లైట్లు, ఒక స్ట్రాంగ్ బంపర్ డిజైన్‌ను కలిగి ఉంది. ఇది రోడ్డుపై దీనికి స్పెషల్ లుక్‌ను ఇస్తుంది. కారు వెనుక భాగంలో వాలుగా ఉండే రూఫ్, ఒక కూపే-ఎస్‌యూవీ లాంటి రూపాన్ని అందిస్తుంది.
ఇది బాక్సీ డిజైన్ ఉన్న పోటీదారుల నుండి దీన్ని వేరు చేస్తుంది. బేబీ గ్రాండ్ విటారా అని కూడా పిలువబడే ఫ్రాంక్స్, కాంపాక్ట్ సైజ్ ఎస్‌యూవీ స్టైల్‌తో మిళితం చేస్తుంది, ఇది యంగ్ కస్టమర్లను, ఫ్యామిలీలను ఇద్దరినీ ఆకట్టుకుంటుంది.

4. అదిరిపోయే ఫీచర్లు: చిన్న సైజు ఎస్‌యూవీ అయినప్పటికీ, ఫ్రాంక్స్ లోపల ప్రీమియం ఫీచర్లతో నిండి ఉంది. దీని టాప్ వేరియంట్లలో 9-అంగుళాల ఫ్లోటింగ్ టచ్‌స్క్రీన్, 360-డిగ్రీ కెమెరా, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, హెడ్స్-అప్ డిస్‌ప్లే, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ ఫీచర్లు సాధారణంగా ఖరీదైన కార్లలోనే లభిస్తాయి.
ఇవి డ్రైవింగ్ అనుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయి. భద్రత విషయంలో కూడా, ఫ్రాంక్స్ 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ESP (ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్), హిల్ హోల్డ్ అసిస్ట్, రేర్ పార్కింగ్ సెన్సార్లను కలిగి ఉంది. ఇది సిటీలో డ్రైవింగ్ చేయడానికి, హైవేలపై ప్రయాణించడానికి అద్భుతమైన ఎంపికగా నిలుస్తుంది.

5. బహుళ ఇంజిన్ ఆప్షన్లు: ప్రస్తుతం మారుతి లైనప్‌లో టర్బోఛార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్‌ను అందించే ఏకైక మోడల్ ఫ్రాంక్స్. దీని 1.0-లీటర్, 3-సిలిండర్ బూస్టర్‌జెట్ ఇంజిన్ 100 PS పవర్‌ను, 147.6 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది. ఈ ఇంజిన్ ఫ్రాంక్స్‌కు అద్భుతమైన డ్రైవింగ్ అనుభూతిని ఇస్తుంది.
దీంతో పాటు, 5-స్పీడ్ మాన్యువల్ లేదా AMT (ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్) తో కూడిన 1.2-లీటర్ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ కూడా అందుబాటులో ఉంది. ఇది వినియోగదారులకు వారి అవసరాలకు తగ్గట్టుగా ఇంజిన్ ఆప్షన్‌ను ఎంచుకునే స్వేచ్ఛను ఇస్తుంది.


Click it and Unblock the Notifications








