మార్కెట్లో సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు రేపు రంగంలోకి స్టార్ దిగుతున్నాడు.. తస్మాత్ జాగ్రత్త
టాటా మోటార్స్(Tata Motors) నుంచి వస్తున్న ఎలక్ట్రిక్ కార్లకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఇప్పుడు టాటా నుంచి మరో పవర్ఫుల్ ఎలక్ట్రిక్ SUV రాబోతోంది. అదే టాటా హారియర్ EV(Tata Harrier EV). రేపు(జూన్ 3, 2025) ఈ అదిరిపోయే 5-సీటర్ ఎలక్ట్రిక్ SUV అట్టహాసంగా విడుదల కానుంది. దీని డిజైన్, ఫీచర్లు ఎలా ఉండబోతున్నాయి? ఎంత ధర ఉండొచ్చు? పూర్తి వివరాలు ఈ వార్తా కథనంలో చూద్దాం.
భారతీయ కార్ మార్కెట్‌లో రేపు (జూన్ 3, 2025) సరికొత్త టాటా హారియర్ EV (Tata Harrier EV) గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇది ఒక ఎలక్ట్రిక్ SUV. చాలా ఆకర్షణీయమైన, లగ్జరీ ఫీచర్లతో రాబోతోంది. ధర కూడా కొంచెం ఎక్కువే ఉండే అవకాశం ఉంది. మరి ఈ కొత్త 'హారియర్ EV' అంచనా ధర ఎంత? ఎలాంటి ప్రత్యేకతలు ఉండబోతున్నాయో తెలుసుకుందాం.

కొత్త టాటా హారియర్ ఎలక్ట్రిక్ SUV బయటి నుంచి చాలా అద్భుతమైన డిజైన్‌ను కలిగి ఉంటుంది. తయారీ దశలో ఉన్న ఈ 'హారియర్ EV'ని జనవరిలో జరిగిన భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో (Bharat Mobility Global Expo) కూడా ప్రదర్శించారు. అప్పుడే ఈ కారులో LED హెడ్‌లైట్లు, LED DRLలు (డే టైమ్ రన్నింగ్ లైట్స్), అల్లాయ్ వీల్స్‌ను చూశాం.
ఈ కొత్త ఎలక్ట్రిక్ కారు పవర్ ఫుల్ రెండు బ్యాటరీ ప్యాక్‌లతో వచ్చే అవకాశం ఉంది. సింగిల్ ఎలక్ట్రిక్ మోటార్ సెటప్, డ్యూయల్ ఎలక్ట్రిక్ మోటార్ సెటప్ ఆప్షన్లు ఉండే అవకాశం ఉంది. ఒకసారి పూర్తి ఛార్జ్ చేస్తే 500 కిలోమీటర్ల వరకు రేంజ్ (మైలేజ్) ఇవ్వగలదని అంచనా వేస్తున్నారు.

ఈ SUV 5 సీట్ల ఆప్షన్‌తో వస్తుంది. ప్రయాణికులు హాయిగా కూర్చుని దూరం ప్రయాణాలు చేయవచ్చు. వీకెండ్‌లలో, సెలవులలో ఎక్కువ లగేజ్ తీసుకువెళ్లడానికి వీలుగా 445 లీటర్ల పెద్ద బూట్ స్పేస్ (Boot Space) ఉంది.
కొత్త టాటా హారియర్ ఎలక్ట్రిక్ SUV పదుల సంఖ్యలో ఆకర్షణీయమైన ఫీచర్లను కలిగి ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా 12.3-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఫుల్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, టాటా లోగోతో కూడిన 4-స్పోక్ స్టీరింగ్ వీల్, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, పనోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు వంటి వివిధ ఫీచర్లు ఉండే అవకాశం ఉంది.

ఈ కొత్త ఎలక్ట్రిక్ కారు సేఫ్టీకి కూడా పేరుగాంచనుంది. ప్రయాణికుల రక్షణ కోసం 7-ఎయిర్‌బ్యాగ్‌లు, ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్), TPMS (టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్).. ముందు, వెనుక పార్కింగ్ సెన్సార్లు, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, హిల్ హోల్డ్ అసిస్ట్, 360 డిగ్రీ కెమెరా వంటివి ఇందులో ఉండే అవకాశం ఉంది.
ఈ టాటా హారియర్ EV ఎంట్రీ-లెవల్ మోడల్ ధర రూ. 25 లక్షలు, టాప్-ఎండ్ వేరియంట్ ధర రూ. 30 లక్షలు (ఎక్స్-షోరూమ్) మధ్య ఉండే అవకాశం ఉంది. ఈ కొత్త ఎలక్ట్రిక్ SUVకి మహీంద్రా XUV9E, BYD అట్టో 3 (BYD Atto 3), హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ (Hyundai Creta Electric) వంటి కార్లు బలమైన పోటీదారులు కానున్నాయి.
డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం: టాటా హారియర్ ఈవీ విడుదల కోసం చాలా మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 500 కి.మీ. రేంజ్, డ్యూయల్ మోటార్ ఆప్షన్, లగ్జరీ ఫీచర్లు, టాప్-నాచ్ సేఫ్టీ వంటివి ఈ కారును EV మార్కెట్‌లో ఒక బలమైన పోటీదారుగా నిలుపుతాయి. ధర కొంచెం ఎక్కువే అయినా, ఫీచర్లు, రేంజ్ చూస్తే ఇది ఒక మంచి ఎలక్ట్రిక్ SUV అవుతుంది. రేపు విడుదల తర్వాత పూర్తి వివరాలు తెలుస్తాయి.


Click it and Unblock the Notifications








