దేశంలోని అందిరి ఫేవరెట్ కార్లు.. రూ. 6 లక్షల లోపు 6 ఎయిర్‌బ్యాగ్స్.. కళ్లు మూసుకుని తీసుకోవచ్చు!
ఈ రోజుల్లో కొత్త కారు కొనుగోలు చేసే వారు కేవలం స్టైల్‌ను మాత్రమే కాదు, సేఫ్టీని కూడా ప్రధానంగా తీసుకుంటున్నారు. ప్రత్యేకించి, కారులో ఆరు ఎయిర్‌బ్యాగ్స్ ఉండాలని చాలా మంది కోరుకుంటున్నారు. ఎయిర్‌బ్యాగ్స్ సంఖ్య ఎక్కువగా ఉండటంతో, ప్రమాద పరిస్థితుల్లో లోపల కూర్చున్న ప్రయాణికులకు మరింత సేఫ్టీ లభిస్తుంది. అయితే సాధారణంగా ఇలాంటి భద్రతా ఫీచర్లు ఉన్న కార్లు ధర పరంగా కొంచెం ఎక్కువగా ఉంటాయి. కానీ కొన్ని కంపెనీలకు చెందిన మోడళ్లు మాత్రం అందరు కొనగలిగే విధంగా అందుబాటు ధరలో మార్కెట్లో లభిస్తున్నాయి. కొత్తగా కారు కొనాలనే చూసే వినియోగదారుల కోసం ఇప్పుడు రూ. 6 లక్షల లోపే 6 ఎయిర్‌బ్యాగ్స్ ఫీచర్ ఉన్న కార్లను కింది కథనంలో అందిస్తున్నాం, అవెంటో ఒకసారి చూసేద్దాం.
Maruti Suzuki Celerio: మారుతీ సుజుకీ సెలెరియో, భారతీయ మార్కెట్లో హ్యాచ్‌బ్యాక్ కార్లలో ఒక ప్రత్యేకమైన స్థానం సంపాదించుకుంది. ఈ కారు తక్కువ ధరలో ఎక్కువ సేఫ్టీ ఫీచర్లను అందిస్తూ, వినియోగదారులకు ఇష్టమైన మోడల్‌గా ఉంది. ధర పరంగా చూసుకుంటే, ఈ హ్యాచ్‌బ్యాక్ రూ. 5.64 లక్షల నుంచి ప్రారంభమై, రూ. 7.37 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది.

సెలెరియో కారులో 6 ఎయిర్‌బ్యాగులు ఉన్నాయి. ఇంత తక్కువ ధరలో ప్రయాణికుల రక్షణ కోసం ఇవి ఇవ్వడం అంటే ఆశ్చర్యం కలిగించే అంశం అని చెప్పవచ్చు. అంతేకాకుండా, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESP), యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ABS), ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ (EBD), హిల్ హోల్డ్ అసిస్ట్, రివర్స్ పార్కింగ్ సెన్సార్లు వంటి ఆధునిక భద్రతా ఫీచర్లు కూడా దీనిలో పొందుపరిచి కస్టమర్లను అట్రాక్ట్ చేస్తున్నారు.
ఈ హ్యాచ్‌బ్యాక్ పెట్రోల్, CNGలలో లభిస్తుంది. సెలెరియో, మైలేజ్ పరంగా కూడా ఆకట్టుకుంటోంది. పెట్రోల్ వేరియంట్లు 24.97 కి.మీల వరకు ఇస్తాయి. అదే CNG వేరియంట్లు 34.43 కి.మీ. వరకు మైలేజ్ ఇస్తాయి. తక్కువ ధరలో సేఫ్టీతో పాటు, మంచి మైలేజ్ కావాలనుకునే వినియోగదారులకు ఇది బెస్ట్ ఆప్షన్ అవుతుంది. 5 మంది కలిసి ప్రయాణించడానికి అనువుగా ఉన్న ఈ కారులో డజన్ల కొద్ది లేటెస్ట్ ఫీచర్స్ కూడా ఉన్నాయి.

Maruti Suzuki Alto K10: మారుతి సుజుకి ఆల్టో కె10, చిన్న హ్యాచ్‌బ్యాక్. దీని అన్ని వేరియంట్లలో 6 ఎయిర్‌బ్యాగులు స్టాండర్డ్‌గా అందించారు. ఇది కనీసంగా రూ. 4.23 లక్షల నుంచి ప్రారంభమై, టాప్ ఎండ్ వేరియంట్ రూ. 6.21 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) లభిస్తోంది. ఇండియాలో అతితక్కువ ధరలో లభిస్తున్న కారులో అన్ని వేరియంట్లలో కూడా ప్రయాణికుల రక్షణ కోసం 6 ఎయిర్‌బ్యాగులు ఇవ్వడం విశేషం అని చెప్పవచ్చు.
6 ఎయిర్‌బ్యాగులు స్టాండర్డ్‌గా కలిగి ఉండటంతో పాటు, అదనంగా యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ABS), ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్(EBD), ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESP), రివర్స్ పార్కింగ్ సెన్సార్లు, వెనుక సీట్లో ప్రయాణించే వారికి 3-పాయింట్ సీట్ బెల్టులు వంటి ఫీచర్లు కూడా జోడించారు. ఇది 1 లీటర్ పెట్రోల్, CNG ఇంజిన్‌ను కలిగి ఉంది. పెట్రోల్ 24.39 కిలోమీటర్లు, CNG వేరియంట్లు 33.85 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తాయి.

Maruti Suzuki WagonR: మారుతీ సుజుకీ వ్యాగన్ఆర్ కారుకు దేశంలో ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ కారులో 6 ఎయిర్‌బ్యాగులు ఉన్నాయి. అదనంగా ప్రయాణికులకు మరింత సేఫ్టీ ఇవ్వడానికి యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్(ABS), ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ (EBD), వెనుక పార్కింగ్ సెన్సార్లు, హిల్-హోల్డ్ అసిస్ట్, సీట్‌బెల్ట్ హెచ్చరికలు, చైల్డ్ లాక్, మరియు సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అన్ని వయస్సుల వారికి ఇది సౌకర్యంగా ఉంటుంది.
ధర విషయానికొస్తే, వ్యాగన్ఆర్ రూ. 5.64 లక్షల ప్రారంభ ధరతో మొదలుకుని టాప్ ఎండ్ వేరియంట్ రూ. 7.47 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) అందుబాటులో ఉంది. ఇది 1.2 లీటర్ పెట్రోల్, CNG ఇంజిన్ వేరియంట్లలో లభిస్తుంది. ఈ కారు, మైలేజ్ పరంగా కూడా వినియోగదారులను ఆకర్షిస్తోంది. పెట్రోల్ వేరియంట్లు సుమారు 23.56 కి.మీ. లీటర్‌కు మైలేజ్ ఇవ్వగా, CNG వేరియంట్లు 34.05 కి.మీ. లీటర్‌కు మైలేజ్ అందిస్తున్నాయి.

Hyundai Exter: హ్యుందాయ్ ఎక్స్‌టర్, భారత మార్కెట్లో SUV సెగ్మెంట్లో బాగా డిమాండ్ ఉన్న మోడల్. దీని ధర రూ.6.21 లక్షల నుంచి మొదులుకుని రూ.10.51 లక్షల వరకు కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది. ఈ కారులో 6 ఎయిర్‌బ్యాగులు ఉన్నాయి. బడ్జెట్ ధరలో వీటిని అందించడం అంటే సాధారణ విషయం కాదు. ప్రమాద సమయంలో లోపల కూర్చున్న ప్రయాణికలకు పూర్తి రక్షణ లభిస్తుంది.
ఇంకా ఈ కారులో ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS), యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ABS), ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ (EBD), సీట్ బెల్ట్ రిమైండర్ వంటి అనేక లేటెస్ట్ సేఫ్టీ ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ SUV దాదాపు 19.2 నుండి 27.1 kmpl వరకు మైలేజీని అందిస్తుంది. ఫీచర్స్ కూడా లోపల ప్రయాణికులను ఆకట్టుకునేవి డజన్ల కొద్ది ఉంటాయి.
Hyundai Grand i10 Nios: హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ భారతీయ మార్కెట్లో ప్రముఖ హ్యాచ్‌బ్యాక్‌గా నిలుస్తోంది. దీని ధర వచ్చేసి రూ.5.98 లక్షల నుంచి మొదలుకుని టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ.8.62 లక్షల వరకు కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. ఇంత తక్కువ ధరలో లభిస్తున్న కారులో 6 ఎయిర్‌బ్యాగులు, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ABS), ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ (EBD) వంటివి ఉన్నాయి.
ఇంకా అదనంగా ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS), ISOFIX చైల్డ్ సీట్ మౌంట్ ఆప్షన్ వంటి ఇతర సేఫ్టీ ప్రమాణాలు కూడా అందించబడ్డాయి. ఇది 1.2 లీటర్ పెట్రోల్, CNG ఇంజిన్‌లో కొనుగోలుకు లభిస్తుంది. ఈ కారు మైలేజ్ పరంగా 16 నుండి 27 kmpl వరకు అందిస్తుంది. రోజువారి కార్లలో ప్రయాణాలు చేయాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్ అవుతుంది.


Click it and Unblock the Notifications








