ఒక్కసారి ఛార్జ్ పెడితే ఏకంగా 627కిమీ రేంజ్.. దీనికే పడిపోయినట్లున్నారు.. అందుకే 24గంటల్లో 10,000బుకింగ్స్
ఇటీవలే కొత్త టాటా హారియర్ ఈవీని లాంచ్ చేశారు. ఈ కారు అదిరిపోయే డిజైన్, అదిరిపోయే ఫీచర్లతో వచ్చింది. జూలై 3 నుంచి టాటా కంపెనీ హారియర్ ఈవీ కోసం బుకింగ్స్ తీసుకోవడం మొదలుపెట్టింది. కస్టమర్ల నుంచి ఊహించని విధంగా భారీ స్పందన వచ్చింది. కేవలం ఒక్క రోజులోనే రికార్డు స్థాయిలో ఆర్డర్లు వచ్చాయి. ఇది ఎలక్ట్రిక్ SUVలకు ఎంత డిమాండ్ ఉందో స్పష్టంగా చూపిస్తుంది.
టాటా హారియర్ ఈవీ ఒక ప్రీమియం ఎలక్ట్రిక్ SUV. ఈ కారుకు కేవలం 24 గంటల్లోనే 10,000కు పైగా బుకింగ్‌లు వచ్చాయి. ప్రస్తుతం, కంపెనీ హారియర్ ఈవీ ఉత్పత్తిని కూడా ప్రారంభించింది. అంతా అనుకున్నట్లు జరిగితే, చాలా త్వరలోనే డెలివరీలు కూడా మొదలవుతాయి.

ఈ కారు కొంచెం ఎక్కువ ధరతోనే ఉంది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.21.49 లక్షల నుంచి రూ.28.99 లక్షల మధ్య ఉంది. అడ్వెంచర్, అడ్వెంచర్ S, ఫియర్‌లెస్ ప్లస్, ఎంపవర్‌డ్ అనే వేరియంట్ల ఎంపికలో కస్టమర్లు ఈ కారును కొనుగోలు చేయవచ్చు.
కొత్త హారియర్ ఈవీ చాలా మంచి డిజైన్‌ను కలిగి ఉంది. ఇది చూడగానే ఆకట్టుకుంటుంది. ఇందులో అద్భుతమైన LED హెడ్‌లైట్‌లు, LED DRLలు, 19 అంగుళాల అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. స్టీల్త్ బ్లాక్, ఎంపవర్‌డ్ ఆక్సైడ్, ప్యూర్ గ్రే అనే రంగులలో కూడా ఈ కారు అందుబాటులో ఉంది.

ఈ కారులో 5 సీటింగ్ కెపాసిటీ ఉంది. ప్రయాణికులు చాలా సౌకర్యంగా కూర్చొని ప్రయాణం చేయవచ్చు. ఎక్కువ సామాను తీసుకెళ్లడానికి 502 లీటర్ల బూట్ స్పేస్ కూడా ఉంది. అలాగే, ఈ కారు 4607మీమీ పొడవు, 2132మీమీ వెడల్పు, 1740మీమీ ఎత్తు కలిగి ఉంది.
ఈ కారు క్యాబిన్ డిజైన్ చాలా బాగుంది, అందరినీ ఆకట్టుకుంటుంది. ఇందులో 14.5 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 10.25 అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, 10 JBL స్పీకర్ సౌండ్ సిస్టమ్, సన్‌రూఫ్, యాంబియెంట్ లైటింగ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, విండో సన్‌బ్లైండ్‌లు వంటి ఫీచర్లు ఉన్నాయి.

కొత్త హారియర్ ఈవీ చాలా గట్టిగా, సురక్షితంగా ఉంటుంది. ఇది భారత్ NCAP నుంచి 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను పొందింది. ప్రయాణికుల రక్షణ కోసం 7 ఎయిర్‌బ్యాగ్‌లు, లెవెల్-2 ADAS, TPMS, హిల్-హోల్డ్ అసిస్ట్, హిల్ డిసెంట్ కంట్రోల్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, ఆల్ వీల్ డిస్క్ బ్రేక్, 360-డిగ్రీ కెమెరా వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం: టాటా హారియర్ ఈవీకి వచ్చిన 10,000 బుకింగ్‌లు ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్‌లో టాటా బ్రాండ్‌కి ఉన్న బలాన్ని చూపుతున్నాయి. 627 కి.మీ రేంజ్, అద్భుతమైన సేఫ్టీ ఫీచర్లు, ప్రీమియం క్యాబిన్‌తో ఈ కారు కస్టమర్లను బాగా ఆకట్టుకుంటోంది. భవిష్యత్తులో ఈవీల అమ్మకాలు మరింత పెరగడం ఖాయం.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








