2026 జనవరిలో కొత్త కార్ల జాతర..ఒకే నెలలో 7 కార్లు లాంచ్..ఆటోమొబైల్ ఇండస్ట్రీలో భారీ భూకంపం
2025వ సంవత్సరం ముగింపుకు వచ్చేసింది. మరో 10 రోజుల్లో మనం కొత్త ఏడాది 2026లోకి అడుగుపెట్టబోతున్నాం. ఆటోమొబైల్ ప్రేమికులకు న్యూ ఇయర్ అంటేనే కొత్త కార్ల పండుగ. సాధారణంగా జనవరి నెలలో కంపెనీలు తమ సరికొత్త మోడళ్లను మార్కెట్లోకి తెస్తుంటాయి. అయితే, 2026 జనవరి నెల మాత్రం చాలా స్పెషల్ అని చెప్పాలి. ఎందుకంటే ఒకే నెలలో ఏకంగా 7 కొత్త కార్లు భారత రోడ్లపై సందడి చేయనున్నాయి. అవేంటో వాటి ప్రత్యేకతలు ఏంటో ఇప్పుడు వివరంగా చూద్దాం.
1. న్యూ జనరేషన్ కియా సెల్టోస్ (Kia Seltos 2026)
కియా తన అత్యంత ప్రజాదరణ పొందిన సెల్టోస్ మోడల్‌లో సెకండ్ జనరేషన్‌ను జనవరి 2న విడుదల చేయనుంది. ఇది సరికొత్త K3 ప్లాట్‌ఫామ్ పై రూపొందింది. ప్రస్తుత మోడల్ కంటే ఇది 95 మిమీ పొడవుగా, 30 మిమీ వెడల్పుగా ఉండటమే కాకుండా, 80 మిమీ అదనపు వీల్‌బేస్‌తో వస్తోంది. దీనివల్ల కారు లోపల స్పేస్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పటికే రూ. 25,000తో బుకింగ్స్ కూడా మొదలయ్యాయి.

2. మారుతి సుజుకి ఇ-విటారా (Maruti e-Vitara)
మారుతి సుజుకి నుంచి వస్తున్న మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారు ఇదే. దీనిపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. జనవరి 15న ఈ కారు ధరలను ప్రకటించే అవకాశం ఉంది. ఇందులో 49kWh, 61kWh అనే రెండు బ్యాటరీ ఆప్షన్లు ఉండనున్నాయి. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 543 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని సమాచారం. ఇది హ్యుందాయ్ క్రెటా ఈవీ, టాటా కర్వ్ ఈవీలకు గట్టి పోటీ ఇవ్వనుంది.
3. రెనాల్ట్ డస్టర్ (Renault Duster)
ఒకప్పుడు ఇండియాలో సంచలనం సృష్టించిన డస్టర్ మళ్ళీ కొత్త అవతారంలో తిరిగి వస్తోంది. జనవరి 26న (గణతంత్ర దినోత్సవం) ఈ కారును అధికారికంగా ప్రదర్శించనున్నారు. ఇది CMF-B ప్లాట్‌ఫామ్ పై రూపొందింది. ఇందులో 1.3 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌తో పాటు హైబ్రిడ్ ఆప్షన్ కూడా ఉండవచ్చని తెలుస్తోంది. పాత డస్టర్ లాగే ఇది కూడా మంచి ఆఫ్-రోడింగ్ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.

4. స్కోడా కుషాక్ ఫేస్‌లిఫ్ట్ (Skoda Kushaq Facelift)
జనవరిలో స్కోడా తన కుషాక్ మోడల్‌కు సరికొత్త అప్డేట్ ఇవ్వనుంది. ఇందులో కేవలం లుక్స్ మాత్రమే కాకుండా ఫీచర్లు కూడా భారీగా మారుతున్నాయి. పనోరమిక్ సన్‌రూఫ్, 360-డిగ్రీ కెమెరా, లెవల్ 2 ADAS వంటి సేఫ్టీ ఫీచర్లు ఇందులో చేరనున్నాయి. ఇంజన్ పరంగా పాత 1.0L, 1.5L టర్బో పెట్రోల్ ఇంజన్లే కొనసాగుతాయి.
5. మహీంద్రా ఎక్స్‌యూవీ 7XO (Mahindra XUV 7XO)
మహీంద్రా తన ఫ్లాగ్‌షిప్ ఎక్స్‌యూవీ 700 మోడల్‌ను ఫేస్‌లిఫ్ట్ చేసి XUV 7XO పేరుతో జనవరి 5న లాంచ్ చేయనుంది. ఇందులో ఇంటీరియర్ మొత్తం మారిపోనుంది. ముఖ్యంగా డ్యాష్‌బోర్డ్‌లో 3 స్క్రీన్లు, వెనుక సీట్లకు కూడా వెంటిలేషన్ ఫీచర్, అదిరిపోయే సౌండ్ సిస్టమ్ ఉండబోతున్నాయి. దీని డిజైన్ రీసెంట్ గా వచ్చిన ఎలక్ట్రిక్ కార్ల (XEV 9e) లుక్ లో ఉంటుందని సమాచారం.

6. నిస్సాన్ గ్రావిటే ఎంపీవీ (Nissan Gravite MPV)
నిస్సాన్ నుంచి వస్తున్న మొదటి కాంపాక్ట్ 7-సీటర్ కారు ఇది. రెనాల్ట్ ట్రైబర్ ప్లాట్‌ఫామ్ పై రూపొందినప్పటికీ, దీని లుక్ మాత్రం నిస్సాన్ గ్లోబల్ డిజైన్ లాగే చాలా అగ్రెసివ్ గా ఉంటుంది. జనవరిలో దీనిని ప్రదర్శించి, మార్చి నెలలో అమ్మకాలు ప్రారంభించే అవకాశం ఉంది. తక్కువ ధరలో ఫ్యామిలీ కోసం 7 సీటర్ కారు కావాలనుకునే వారికి ఇది మంచి ఆప్షన్.
7. టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్ (Tata Punch Facelift)
దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న మైక్రో ఎస్‌యూవీ టాటా పంచ్ కూడా కొత్త లుక్ లో రాబోతోంది. జనవరి 15న ఇది లాంచ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇందులో కొత్త స్టీరింగ్ వీల్, 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్, ఫుల్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఉండబోతున్నాయి. దీని డిజైన్ టాటా పంచ్ ఈవీని పోలి ఉంటుంది.


Click it and Unblock the Notifications








