అరె అరె వచ్చేస్తుందిరా బుళ్లోడా! 7 సీటర్ బాహుబలి.. ఫ్యామిలీ మొత్తం కూర్చోబెట్టి.. ట్రిప్స్ ప్లాన్ చెయ్!

ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో సంచలనాలు సృష్టిస్తున్న MG మోటార్స్, ఇప్పుడు మరో అడుగు వేస్తోంది. హెక్టర్, గ్లోస్టర్, ఆస్టర్ వంటి పెట్రోల్, డీజిల్ కార్లతో ఇప్పటికే మార్కెట్‌లో బలమైన స్థానం సంపాదించిన ఈ బ్రాండ్, ఇటీవల MG M9 లగ్జరీ MPV, సైబర్‌స్టర్ అనే స్పోర్ట్స్ ఎలక్ట్రిక్ కారును కూడా పరిచయం చేసి దృష్టిని ఆకర్షించింది. ఈ ప్రయాణం అంతా ఎలక్ట్రిక్ భవిష్యత్తుపై దృష్టి పెట్టినట్టు కనిపించినా, ఇప్పుడు MG మళ్ళీ డీజిల్‌ కార్లపై కూడా దృష్టి పెట్టింది. త్వరలో కంపెనీ అదిరిపోయే డిజైన్‌తో, అందరిని ఆకట్టుకునే విధంగా డీజిల్ కారును తీసుకురావాలని చూస్తుంది. అంతేకాకుండా, ఇది చిన్న SUV కాదు - ఫుల్ సైజ్‌ SUV. ఆటో ఎక్స్‌పో 2025లో ప్రదర్శించిన ఎంజీ మెజిస్టర్‌ (MG majestor) SUVను ఇప్పుడు కంపెనీ భారత్‌లో లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది.

మెజిస్టర్‌ పేరుకే తగినట్టుగా, ఈ SUVని ఎలివేటెడ్ ప్రెజెన్స్, డైనమిక్ డిజైన్, రాబోయే జనరేషన్‌కు సరిపోయే ఫీచర్లతో తయారు చేస్తున్నట్లు తెలుస్తోంది. MG ఇప్పటి వరకు అధునాతన టెక్నాలజీ, సేఫ్టీ, ఇంటీరియర్ లగ్జరీలో తానే టాప్ అని చూపించిన బ్రాండ్‌ కాబట్టి, ఈ మోడల్ పై అంచనాలు భారీగానే ఉన్నాయి. పైగా, ఇది డీజిల్ మోడల్ కావడంతో, దూర ప్రయాణాలు చేసే SUV లవర్స్‌కు ఇది మరింత నమ్మకాన్ని కలిగిస్తుంది.

Mg majestor

ఇప్పటివరకు కంపెనీ ఈ మెజిస్టర్‌ ఎప్పుడెప్పుడు రోడ్డెక్కబోతుందో చెప్పలేదు. కానీ గాడివాడి నుంచి తాజా సమాచారం ప్రకారం, ఈ పండుగ సీజన్‌ అంటే దసరా-దీపావళి కాలంలో ఈ మోడల్‌ను మార్కెట్‌లోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది. పండుగల సీజన్‌ అంటే మాత్రమే కాదు... ఇప్పుడు SUV మార్కెట్‌కి కూడా ఒక పండుగే. ఈ అవకాశాన్ని వదులుకోకుండా, MG మోటార్స్ తన తదుపరి భారీ ప్లాన్‌తో ముందుకు వస్తోంది.

వేగంగా పెరుగుతున్న SUV డిమాండ్‌తో పాటు, పండుగ సీజన్‌ అమ్మకాల సామర్థ్యాన్ని ఉపయోగించుకునేందుకు కంపెనీ మెజిస్టర్‌ పేరుతో మోడల్‌ను తెస్తుంది. ఈ మోడల్‌ నిజానికి గ్లోస్టర్‌కి ఒక ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌గానే భావించవచ్చు. ఇదే కాకుండా, కంపెనీ ఇప్పటికే ఉన్న గ్లోస్టర్‌ను కూడా సేల్స్‌లో కొనసాగించనున్నట్లు తెలుస్తోంది. అంటే, ఒకే వాహనం, రెండు రూపాలు, విభిన్న ఎక్స్‌పీరియెన్సులు. ఇది అంతర్జాతీయ మార్కెట్‌లో విక్రయించబడుతున్న SAIC Maxus D90 SUV ఆధారంగా రూపొందించబడింది.

Mg majestor Launch

దాంతో, దీనికి సాధారణ ఫేస్‌లిఫ్ట్ మాదిరిగా కాకుండా పూర్తిగా రిఫ్రెష్ అయిన ఎక్స్‌టీరియర్ డిజైన్ ఉంది. ముందు భాగమే ఆ విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది, ఇది గ్లాస్ బ్లాక్‌లో మెరిసే పెద్ద గ్రిల్, దాని చుట్టూ మెరిసే సొగసైన LED DRL లైట్లు, ఇవన్నీ కలిపి మెజెస్ట్రేకి ఒక రాయల్ లుక్ ఇస్తాయి. ఇక హెడ్‌లైట్లు చతురస్రాకార నల్ల హౌసింగ్‌లలో నిలువుగా అమర్చబడి, SUVకి మరింత గంభీరతను తీసుకొస్తాయి.

ముందు బంపర్ డిజైన్ పెద్దదిగా ఉండటం, ఆ క్రొత్త స్టాన్స్‌తో స్పోర్టీ టచ్‌ ఇవ్వడం విశేషం. వీల్ ఆర్చ్ క్లాడింగ్ SUVకి ఆకర్షణను మరింతగా పెంచుతోంది. ఈ డిజైన్ మార్పులు చూస్తుంటే, MG మెజెస్ట్రే కేవలం గ్లోస్టర్‌కు అప్‌డేట్ మాత్రమే కాదు, కొత్తగా SUVకి అప్‌డేట్ అన్నట్టు అనిపిస్తుంది. ఫార్చ్యూనర్‌తో పోటీ పడాలంటే బయట మేకోవర్‌తో పాటు, లోపల కూడా కొత్తగా ఇవ్వాల్సిందే.

Mg majestor Price

మెజిస్టర్‌ కారు 2.0-లీటర్ ట్విన్-టర్బో డీజిల్ ఇంజిన్‌‌తో వచ్చే అవకాశం ఉంది. ఇది 216 bhp పవర్, 479 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. అంతే కాదు, ఇది రియర్ వీల్ డ్రైవ్ (RWD) కాన్ఫిగరేషన్‌తో స్టాండర్డ్‌గా వస్తుంది. 8-స్పీడ్ ఆటోమేటిక్ గేయిర్‌బాక్స్‌తో ప్రామాణికంగా లభిస్తుంది. దీని ధర రూ.40 లక్షల నుంచి రూ.45 లక్షల వరకు ఎక్స్-షోరూమ్‌గా ఉండే అవకాశముంది.

More from DriveSpark

Article Published On: Tuesday, July 29, 2025, 13:28 [IST]
English summary
7 seater mg majestor suv will launch on festive season details
Read more on: #mg motors #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+