పెద్ద కుటుంబానికి పర్ఫెక్ట్ ఛాయిస్.. సైన్యానికి నచ్చిన కారు.. 13 లక్షలకే 7 సీట్ల SUV

మహీంద్రా స్కార్పియో ఒక పాపులర్ ఎస్యూవీ. ఇది సూపర్ స్టైలిష్ డిజైన్‌తో, చాలా మంచి ఫీచర్లతో వస్తుంది. పైగా, ఇది కొనడానికి కూడా అందుబాటు ధరలోనే ఉంటుంది. అందుకే కస్టమర్లు దీన్ని బాగా ఇష్టపడుతున్నారు. తాజాగా, ఏప్రిల్ నెలలో అత్యధికంగా అమ్ముడుపోయిన టాప్ 10 కార్ల లిస్ట్ వచ్చింది. అందులో స్కార్పియో SUV ఐదో స్థానంలో ఉంది. దాని గురించి మరిన్ని వివరాలు ఇక్కడ చూద్దాం.

పోయిన నెల (ఏప్రిల్-2025)లో మహీంద్రా కంపెనీ ఏకంగా 15,534 యూనిట్ల 'స్కార్పియో' SUVలను సక్సెస్‌ఫుల్‌గా అమ్మేసింది. అంతకుముందు మార్చిలో అమ్ముడైన 13,913 యూనిట్లతో పోలిస్తే, నెలనెలా దీని అమ్మకాలు కొంచెం పెరుగుతున్నాయని చెప్పొచ్చు.

Mahindra Scorpio Sales April 2025

ఈ సంవత్సరం ఫిబ్రవరిలో 13,618 యూనిట్లు, జనవరి నెలలో 15,442 యూనిట్ల మహీంద్రా స్కార్పియో కార్లు అమ్ముడయ్యాయి. ఈ లెక్కల ప్రకారం చూస్తే, ప్రతి నెల సగటున 14,000 స్కార్పియో SUVలు అమ్ముడవుతున్నాయి. కొత్త స్కార్పియో ఎక్కువ సీట్లతో, చాలా లేటెస్ట్ ఫీచర్లతో వస్తోంది. అందుకే దీని అమ్మకాలు పెరుగుతున్నాయని నిపుణులు అంటున్నారు.

మహీంద్రా స్కార్పియో రెండు రకాలుగా అందుబాటులో ఉంది..
మహీంద్రా స్కార్పియో ఎన్ (Mahindra Scorpio N): ఇది చాలా తక్కువ ధరలో దొరుకుతుంది. దీని ధర రూ.13.99 లక్షల నుంచి రూ.24.89 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) ఉంది. ఇందులో 6 లేదా 7 సీట్లు ఉంటాయి, కాబట్టి ప్రయాణికులు హాయిగా వెళ్లొచ్చు. ఎక్కువ లగేజ్ పెట్టుకోవడానికి 460 లీటర్ల బూట్ స్పేస్ కూడా ఉంది.

Mahindra Scorpio Sales

ఈ స్కార్పియో ఎన్ 2.2-లీటర్ డీజిల్, 2-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌తో వస్తుంది. ఇది లీటరుకు 14 నుంచి 15 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుంది. బయట కూడా మంచి డిజైన్‌తో ఉంటుంది. డీప్ ఫారెస్ట్, ఎవరెస్ట్ వైట్ & నాపోలి బ్లాక్‌తో సహా చాలా రంగుల్లో ఇది అందుబాటులో ఉంది. 8-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు 6 ఎయిర్‌బ్యాగ్‌ల వంటి అనేక ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

మహీంద్రా స్కార్పియో క్లాసిక్ (Mahindra Scorpio Classic): ఈ SUV ధర రూ.13.62 లక్షల నుంచి రూ.17.50 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) ఉంది. ఇందులో 7 లేదా 9 సీట్లు ఉంటాయి, కాబట్టి పెద్ద కుటుంబం కూడా చాలా సౌకర్యంగా ప్రయాణం చేయొచ్చు. దీనికి కూడా 460 లీటర్ల బూట్ స్పేస్ ఉంది.

Mahindra Scorpio

ఈ కారు 2.2-లీటర్ డీజిల్ ఇంజన్‌తో వస్తుంది, ఇది లీటరుకు 16 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుంది. బయట కూడా చాలా మంచి డిజైన్‌తో ఉంటుంది. గెలాక్సీ గ్రే, రెడ్ రేజ్, ఎవరెస్ట్ వైట్, డైమండ్ వైట్‌తో సహా చాలా రంగుల్లో ఇది దొరుకుతుంది. 9-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌ల వంటి అనేక ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Monday, May 12, 2025, 17:45 [IST]
English summary
7 seater rs 13 lakh customers rush for mahindra scorpio selling like hotcakes
Read more on: #mahindra #india #auto news
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+